హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Earn From Home: టీవీ చూస్తూ డబ్బులు సంపాదించండి.. చివరి తేదీ అక్టోబర్ 12

Earn From Home: టీవీ చూస్తూ డబ్బులు సంపాదించండి.. చివరి తేదీ అక్టోబర్ 12

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Earn by watching TV: ఈ జాబ్‌కు దరఖాస్తు చేసిన వారిలో నుంచి లక్కీ డ్రా ద్వారా నియామకం చేపడుతారు. మీరు కూడా ఈ జాబ్‌కు దరఖాస్తు చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటే అక్టోబర్ 12లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం కల్చర్ పెరిగింది. దాదాపు అన్ని ఐటీ, అనుబంధ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాయి. అయితే ఈ సమయంలో కూడా వినూత్నంగా తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవడానికి ఒక ఆఫర్‌తో ముందుకొచ్చింది బ్రిటిన్‌కు చెందిన కంపెనీ. ‘చిల్ అవుట్ రివ్యూవర్’గా పిలిచే ఈ జాబ్‌తో ఇంట్లోనే కూర్చొని హాయిగా టీవీ చూస్తూ డబ్బులు సంపాదించొచ్చు. నమ్మశక్యంగా లేని ఈ అవకాశం బ్రిటన్‌కు చెందిన బ్రిటన్‌కు చెందిన చెందిన పౌర్ మోయి(Pour Moi) అనే దుస్తుల కంపెనీ తమ బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా కల్పిస్తోంది.

ఈ జాబ్ దక్కించుకున్న వారు పైజామా ధరించి హాయిగా నెట్‌ఫ్లిక్స్‌లో మీకిష్టమైన టీవీ సిరీస్ చూస్తూ డబ్బులు సంపాదించొచ్చు. దీనికి గాను ఆ వ్యక్తికి 300 యూరోల జీతాన్ని ఇవ్వనుంది. తన బ్రాండ్ ప్రమోషన్‌లో తమ ఉత్పత్తులను పరీక్షించడానికి ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది పౌర్ మోయి కంపెనీ. మీరు ప్రపంచంలో ఎక్కడి వారైనా సరే ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. తమ బ్రాండ్ యొక్క దుస్తులను పరీక్షించడానికి ఈ నియామకం చేపట్టనున్నామని పౌర్ మోయి ఒక ప్రకటనలో తెలిపింది.

లక్కీ డ్రా ద్వారా సెలక్షన్

ఈ జాబ్‌కు దరఖాస్తు చేసిన వారిలో నుంచి లక్కీ డ్రా ద్వారా నియామకం చేపడుతారు. మీరు కూడా ఈ జాబ్‌కు దరఖాస్తు చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటే అక్టోబర్ 12లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. అయితే, ఎంపికైన అభ్యర్థి ప్రతిరోజూ కనీసం పది గంటలు పౌర్ మోయి దుస్తులను ధరించాల్సి ఉంటుంది. తద్వారా మీరు 300 పౌండ్లు లేదా సుమారు 350 యూఎస్ డాలర్లు అందుకోవచ్చు. భారత కరెన్సీలో చూస్తే ఇది దాదాపు 22 వేల రూపాయలతో సమానం.

కాగా ఎంపికైన వ్యక్తి పౌర్ మోయి కంపెనీ అందించిన ఆరు లాంజ్వేర్లతో వారి వేషధారణను ఎప్పటికప్పుడు మార్చవలసి ఉంటుంది. అంతేకాకుండా, కంపెనీకి చెందిన దుస్తులను ధరించి సోషల్ నెట్వర్క్లలో మీ చిత్రాలను పంచుకోవాల్సి ఉంటుంది.ఈ మేరకు జాబ్‌లో జాయిన్ అయ్యే సమయంలోనే నియమ నిబంధనల్లో పేర్కొంటారు. 18 ఏళ్లు పైబడిన వారెవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 12 దరఖాస్తుకు చివరితేది కాగా అక్టోబర్ 26న లక్కీ డ్రా ద్వారా ఎంపికైన అభ్యర్థి పేరు ప్రకటిస్తారు.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Work From Home

ఉత్తమ కథలు