Home /News /technology /

EAR BUDS OF SAMSUNG GALAXY CAUSING INFECTIONS USERS GETTING REFUND AK GH

Samsung Galaxy Buds వాడకంతో చెవిలో ఇన్ఫెక్షన్​.. కంపెనీకి వ్యతిరేకంగా కోర్టుకెక్కిన బాధితురాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Samsung Galaxy Buds: ప్రముఖ టెక్​ దిగ్గజం శామ్సంగ్ విక్రయిస్తోన్న గెలాక్సీ బడ్స్​ ప్రో, బడ్స్​ 2 టీడబ్ల్యూఎస్​ ఇయర్‌ఫోన్లపై ఇలాంటి ఫిర్యాదులో వస్తున్నాయి. వీటిని అత్యుత్తమ TWS ఇయర్​ఫోన్లుగా చెబుతున్నప్పటికీ.. ఇవి చెవి ఇన్ఫెక్షన్‌లకు కారణమవుతున్నాయని కొందరు వినియోగదారులు వాపోతున్నారు.

ఇంకా చదవండి ...
ప్రస్తుతం ఎవరి దగ్గర చూసినా చేతిలో స్మార్ట్​ఫోన్​, చెవిలో ఇయర్​ఫోన్​ సర్వసాధారణంగా మారిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇయర్​ ఫోన్లలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఉన్న వైర్​ ఇయర్​ఫోన్ల స్థానాన్ని ఇప్పడు వైర్​లెస్​ ఇయర్ బడ్స్​ రిప్లేస్​ చేశాయి. చెవిలో అసలు ఉన్నాయా లేవా అన్నట్లు ఇమిడిపోయే ఈ బడ్స్​ కంఫర్డ్​గా ఉండటంతో ఎక్కువ మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఆవా అందుబాటు ధరలోనే లభిస్తుండటంతో విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. అయితే, వీటి వల్ల కలిగే ఎంటర్​టైన్​మెంట్​ విషయాన్ని పక్కన పెడితే చెవుల్లో ఇన్ఫెక్షన్​ కలుగజేస్తున్నాయని కొంతమంది వినియోగదారులు వాపోతున్నారు. తాజాగా, ప్రముఖ టెక్​ దిగ్గజం శామ్సంగ్ విక్రయిస్తోన్న గెలాక్సీ బడ్స్​ ప్రో, బడ్స్​ 2 టీడబ్ల్యూఎస్​ ఇయర్‌ఫోన్లపై ఇలాంటి ఫిర్యాదులో వస్తున్నాయి. వీటిని అత్యుత్తమ TWS ఇయర్​ఫోన్లుగా చెబుతున్నప్పటికీ.. ఇవి చెవి ఇన్ఫెక్షన్‌లకు కారణమవుతున్నాయని కొందరు వినియోగదారులు వాపోతున్నారు.

ఆండ్రాయిడ్ సెంట్రల్‌లోని ఒక నివేదిక ప్రకారం, శామ్సంగ్​ ఇయర్​ బడ్స్​ను ఉపయోగించిన తర్వాత చాలా మంది చెవి ఇన్‌ఫెక్షన్లకు లోనైనట్లు నివేదించారు. అయితే, ఈ ఇన్ఫెక్షన్‌లకు గల అసలు కారణమేమిటో తెలియరాలేదు. కానీ వీటిలో వాడుతున్న కొత్త మెటీరియల్‌ల వల్ల ఈ సమస్య తలెత్తుతోందని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ విమర్శలపై శామ్సంగ్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. కానీ, బాధిత వినియోగదారులకు పూర్తి రీఫండ్​ చేస్తోంది. పరిస్థితిని బట్టి కస్టమర్ల వైద్య బిల్లులను కూడా చెల్లిస్తోంది.

బడ్స్​ ప్రో తయారీలో నికెల్ వాడకంతో సమస్య..
అయితే, శామ్సంగ్ గెలాక్సీ నుంచి గతంలో అనేక ఇయర్​బడ్ మోడళ్లు విడుదలయ్యాయి. కానీ వాటిలోని సమస్యలపై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు లేవని ఆండ్రాయిడ్ సెంట్రల్‌లోని నివేదిక పేర్కొంది. అయితే, ఈ కొత్త గెలాక్సీ బడ్స్​ ప్రోలో నికెల్ వాడకం వల్ల ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. శామ్సంగ్​ కొత్త గెలాక్సీ బడ్స్ 2 మోడళ్లలో అక్రిలేట్ అనే కొత్త మెటీరియల్‌ని కూడా ఉపయోగించింది. ఇది కూడా ఈ సమస్యకు మరో కారణం కావచ్చని నివేదిక పేర్కొంది.

రేవంత్ రెడ్డి ప్లాన్‌కు గండికొడుతున్న ఈటల రాజేందర్.. ఆ నేత విషయంలో..

Ghee: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి

కాగా, ఈ బడ్స్​ కారణంగా చెవి ఇన్ఫెక్షన్లకు గురైన వినియోగదారులు న్యూజెర్సీ కన్జ్యూమర్​ ఫ్రాడ్​ యాక్ట్ కింద శామ్‌సంగ్‌పై క్లాస్-యాక్షన్ పిటిషన్​ను దాఖలు చేశారు. ఈ బడ్స్ వల్ల చెవిలో దురద, మంట, ఎరుపు, పొక్కులు, స్కాబ్లింగ్, చెవి నుండి ద్రవం వస్తుందని పిటిషన్​లో పేర్కొన్నారు. మీకు కూడా ఈ సమస్య ఎదుర్కొంటే, మీ బడ్స్​ను రిటన్​ చేయడానికి కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి. లేదా శామ్సంగ్ కమ్యూనిటీ మోడరేటర్‌ని సంప్రదించండి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Samsung Galaxy

తదుపరి వార్తలు