e-Shram: కార్మికులు వివ‌రాల‌న్నీ ఒకే చోట‌.. ఈ-శ్ర‌మ్ పోర్ట‌ల్ ప్రారంభించిన కేంద్రం

(ప్రతీకాత్మక చిత్రం)

క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో అత్యంత ఇబ్బంది ప‌డ్డ‌ది అసంఘ‌టిత రంగం కార్మికులు. ఉపాధి కోల్పోయి తిరిగి ఇంటి బాట ప‌ట్టారు. వారి ద‌య‌నీయ స్థితి చూసి దేశ‌మే చ‌లించి పోయింది. ఈ నేప‌థ్యంలో అసంఘ‌టిత రంగంలోని కార్మికుల శ్రేయ‌స్సు కోసం కేంద్రం ఈ-శ్ర‌మ్(E-Sharm) పోర్ట‌ల్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ-శ్రమ్‌ వెబ్‌ పోర్టల్‌(portal)తో పాటు అసంఘటిత కార్మికుల కోసం కార్మిక శాఖ హెల్ప్‌లైన్‌(Helpline)ను ఏర్పాటు చేయనుంది.

  • Share this:
    క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో అత్యంత ఇబ్బంది ప‌డ్డ‌ది అసంఘ‌టిత రంగం కార్మికులు. ఉపాధి కోల్పోయి తిరిగి ఇంటి బాట ప‌ట్టారు. వారి ద‌య‌నీయ స్థితి చూసి దేశ‌మే చ‌లించి పోయింది. ఈ నేప‌థ్యంలో అసంఘ‌టిత రంగంలోని కార్మికుల శ్రేయ‌స్సు కోసం కేంద్రం ఈ-శ్ర‌మ్(E-Sharm) పోర్ట‌ల్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ-శ్రమ్‌ వెబ్‌ పోర్టల్‌తో పాటు అసంఘటిత కార్మికుల కోసం కార్మిక శాఖ హెల్ప్‌లైన్‌(Helpline)ను ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా 14434 నంబరును దేశవ్యాప్తంగా కార్మికులకు అందుబాటులోకి తేనున్న‌ట్లు స‌మాచారం(Information) సంక్షేమ ప‌థ‌కాలు, ఉపాధి అవ‌కాశాలు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల స‌మాచారం తెల‌సుకొనేందుకు ఈ పోర్ట‌ల్(Portal) అసంఘ‌టిత రంగం కార్మికుల‌కు ఎంతో ఉప‌యుక్తంగా ఉంటుద‌ని కేంద్రం చెబుతోంది.

    Indian Railways: రైల్వే స్టేష‌న్ల‌లో ఫేసియ‌ల్ రిక‌గ్నెష‌న్‌ సిస్ట‌మ్‌.. ఇండియ‌న్ రైల్వేస్ నిర్ణ‌యం


    దేశ వ్యాప్తంగా అసంఘ‌టి రంగంలో 38 కోట్ల మంది కార్మికులు ఉన్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాల అంచనా. ఈ రంగం వారు లాక్ డౌన్(Lock down) స‌మ‌యంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది ప‌డ్డారు. చాలా మంది వ‌ల‌స వ‌చ్చి ప‌ని ప్ర‌దేశాల్లో ఉండే వారు. లాక్‌డౌన్ ప‌ని చేసే యాజ‌మాన్యం మ‌ద్ద‌తు ల‌భించ‌క ఆర్థికింగా నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు. దీనిపై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డించింది. వీరి స‌మ‌స్య‌ల‌ను గుర్తించిన‌ కేంద్రం అసంఘ‌టిత రంగంలో కార్మికులు ఎంత మంది ఉన్నారు.. వారికి ఎటువంటి సాయం అందించాల‌నే కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని నిర్ణ‌యించింది. అందుకు ఉప‌యోగ‌ప‌డేలా ఈ-శ్ర‌మ్‌ను ప్ర‌వేశ పెట్టింది.
    ఏమిటీ ఈ-శ్ర‌మ్‌..
    - ఆగ‌స్టు 26, 2021న కేంద్రం ఈ-శ్ర‌మ్ పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
    - అసంఘ‌టిత రంగంలోని కార్మికులు వారి ఆధార్ కార్డుల ఆధారంగా త‌మ వివ‌రాల‌ను పోర్ట‌ల్‌లో పొందుప‌ర్చాలి.
    - ఈ పోర్ట‌ల్‌లో నిర్మాణ రంగం, వ‌ల‌స కార్మికులు, చిరు, వీధి వ్యాపారుల వారీగా కేట‌గిరీలుగా నిర్ణ‌యించారు.
    - ఈ పూర్తి స‌మాచారం ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంటే ఎటువంటి సంక్షేమ ప‌థ‌కాలు వారికి అందించాలో ఒక నిర్దిష్ట కార్యాచ‌ర‌ణ రూపొందించ‌వ‌చ్చు.
    ఈ-శ్ర‌మ్ పోర్ట‌ల్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌(State government)తో పాటు కార్మిక సంఘాల‌కు ఒకే చోట పూర్తి సమాచారం ల‌భిస్తుంది. అన్ని స‌మన్వ‌యంతో ప‌ని చేసే వీలు ఉంటుంది. కార్మికుల స‌మ‌స్య‌ల‌ను గుర్తించి స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించే వీలు ఉంటుంది. ఈ పోర్ట‌ల్‌ల ఆగ‌స్టు 26 నుంచే రిజిస్ట్రేష‌న్‌(Registration)లు చేసుకొనే వీలు ఉంటుంద‌ని కార్మిక‌శాఖ ప్ర‌క‌టించింది.
    Published by:Sharath Chandra
    First published: