Home /News /technology /

E SCOOTER FIRE ACCIDENTS THE CENTER HAS MADE A IMPORTENT DECISION ON ELECTRIC VEHICLE ACCIDENTS MINISTER TWEET EVK

E-Scooter Fire Accidents: ఎల‌క్ట్రిక్ వెహికిల్ ప్ర‌మాదాల‌పై.. కేంద్రం కీల‌కం నిర్ణ‌యం.. మంత్రి ట్వీట్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

E-Scooter Fire Accidents | ఇటీవల దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకునే సంఘటనలు పెరుగుతున్న‌నాయి. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై విచారణకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం డిఫాల్ట్ చేసిన కంపెనీలపై అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

ఇంకా చదవండి ...
    ఇటీవల దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకునే సంఘటనలు పెరుగుతున్న‌నాయి. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై విచారణకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం డిఫాల్ట్ చేసిన కంపెనీలపై అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన అనేక ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయని గడ్కరీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ఈ సంర్బంగా ఆయ‌న మాట్లాడుతూ నివేదికల ఆధారంగా డిఫాల్ట్ చేసిన కంపెనీలపై అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని రోడ్డు రవాణా, అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం మేము త్వరలో నాణ్యత-కేంద్రీకృత మార్గదర్శకాలను జారీ చేస్తాంమ‌ని కూడా వెల్ల‌డించారు.

    XLRI Jamshedpur: ప్రముఖ మేనేజ్‌మెంట్ స్కూల్‌ నుంచి ఆన్‌లైన్ కోర్సు.. ఫైనాన్స్‌లో రెండేళ్ల పీజీ డిప్లొమా ప్రారంభం

    ఏదైనా కంపెనీ ఈ విధానంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భారీ జరిమానా విధిస్తామ‌ని అన్నారు. అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేయాలని కూడా ఆదేశిస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే, కంపెనీలు అన్ని లోపభూయిష్ట బ్యాచ్‌ల వాహనాలను వెంటనే రీకాల్ చేయడానికి ముందస్తు చర్యలు తీసుకోవచ్చు, గడ్కరీ ట్వీట్ చేశారు. "ప్రధానమంత్రి శ్రీ @నరేంద్రమోదీ జీ నాయకత్వంలో, ప్రతి ప్రయాణీకుల భద్రతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు.



    నిజామాద్‌లో ఘ‌ట‌న‌..
    తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లాలో ఓ ఇంట్లో ఛార్జింగ్ కోసం ప్లగ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. ఈ ఘ‌ట‌నలో 80 ఏళ్ల వృద్ధుడు మరణించారు. అంతే కాకుండా.. కుటుంబ సభ్యులు ముగ్గురికి కాలిన గాయాల‌య్యారు. వీరిని నిజామాబాద్ పట్టణంలోని ఆసుపత్రిలో చేర్పించారు..

    CUET 2022: సీయూఈటీకి ఆ స్టేట్స్ నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు.. ఈ రాష్ట్ర‌ల్లో అంతంతే..

    , అయితే వృద్ధుడి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలో అతను మరణించాడని పోలీసులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు ఆధారంగా, ఎలక్ట్రిక్ వాహన కంపెనీపై IPC సెక్షన్ 304-A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), 337 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

    పూణేలో..
    మార్చి 26న పూణెలోని లోహెగావ్ ప్రాంతంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి . అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియ‌లేదు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Electric bike, Electric Scooter, Electric Vehicles

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు