ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌లో మీరేం కొంటున్నారు?

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇ-కామర్స్ సైట్లన్నీ ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకటించాయి. మరి ఏఏ సైట్‌లో ఎలాంటి ఆఫర్లున్నాయో తెలుసుకోండి.

news18-telugu
Updated: August 8, 2018, 12:35 PM IST
ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌లో మీరేం కొంటున్నారు?
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇ-కామర్స్ సైట్లన్నీ ఫెస్టివల్ ఆఫర్స్ ప్రకటించాయి. మరి ఏఏ సైట్‌లో ఎలాంటి ఆఫర్లున్నాయో తెలుసుకోండి.
news18-telugu
Updated: August 8, 2018, 12:35 PM IST
ఏవైనా పండుగలు, ప్రత్యేక సందర్భాలు వచ్చాయంటే చాలు... ఇ-కామర్స్ సైట్లు వారం పది రోజుల ముందుగానే రెడీ అయిపోతాయి. ఫలానా పండుగ సందర్భంగా మా దగ్గర బోలెడు ఆఫర్లున్నాయంటూ నాలుగైదు రోజులు సేల్స్ ప్రకటిస్తుంటాయి. వారం రోజుల్లో ఇండిపెండెన్స్ డే ఉండటంతో చాలావరకు ఇ-కామర్స్ సైట్లన్నీ భారీ ఆఫర్లతో సేల్స్ ప్రకటించాయి. గత నెలలో 'ప్రైమ్ డే' సేల్‌తో కస్టమర్లను ఆకట్టుకున్న అమెజాన్... ఇండిపెండెన్స్ డే సందర్భంగా 'ఫ్రీడమ్ సేల్' ప్రకటించింది. ఆగస్ట్ 9 నుంచి 12 వరకు ఈ సేల్ జరగనుంది. వన్‌ ప్లస్ 6, రియల్‌మీ1, హానర్ 7ఎక్స్, మోటో జీ6, సాంసంగ్ గెలాక్సీ నోట్ 8, వివో ఎక్స్21, హువావే పీ20 లైట్ లాంటి ఫోన్లపై ఆఫర్లున్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లార్జ్ అప్లయెన్సెస్, టీవీలపై మొత్తం 20,000 డీల్స్ ఉన్నాయి. వీటితో పాటు అమెజాన్ ఇకో డివైజ్‌లు, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్ ఇ-రీడర్స్‌లపై భారీ డిస్కౌంట్లున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కి స్పెషల్ డీల్స్, డిస్కౌంట్స్ లభిస్తాయి. ప్రైమ్ మెంబర్స్‌కు పీసీ యాక్సెసరీస్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం అదనంగా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అర్హులైన కస్టమర్లు పలు బ్యాంకుల నుంచి ఈఎంఐ సదుపాయం పొందొచ్చు. మొత్తంగా మొబైల్స్‌, యాక్సెసరీస్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 50 శాతం, ఫ్యాషన్‌పై 50-80 శాతం, హోమ్, ఔట్‌డోర్ పరికరాలపై 70 శాతం తగ్గింపు లభిస్తుంది.

Amazon India Announces 'Freedom Sale' From August 9: Here's Everything You Need To Need To Know

ఇక అమెజాన్ 'ఫ్రీడమ్ సేల్‌'కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ ఫ్రీడమ్ సేల్‌' ప్రకటించింది. ఆగస్ట్ 10 నుంచి 12 వరకు 'ది బిగ్ ఫ్రీడమ్ సేల్' ప్రారంభం జరగనుంది. ఫ్లిప్‌కార్ట్ వెబ్, యాప్, ఫ్లిప్‌కార్ట్ లైట్‌లో ఈ సేల్ నిర్వహిస్తారు. సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 'లార్జెస్ట్ డెమొక్రసీ, లెజండరీ డీల్స్'లో కనీసం 71శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 30 కేటగిరీల్లోని మిగతా ప్రొడక్ట్స్‌పై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇక బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్స్ అయిన మోటో జీ5 ప్లస్, షావోమీ మిడ్-రేంజ్ ఫోన్లపై ఆఫర్లుంటాయి. యాపిల్, డెల్, హెచ్‌పీ, ఏసుస్, ఏసర్ లాంటి బ్రాండ్ల నోట్‌బుక్స్, టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్స్, టూ-ఇన్-వన్ ట్యాబ్లెట్స్, అల్ట్రాబుక్స్, ఇతర గ్యాడ్జెట్లపై డీల్స్ ఉంటాయి. వీటితో పాటు స్మార్ట్ టీవీలు, డీఎస్ఎల్ఆర్ కెమెరాలపై ఆఫర్లు ఉంటాయి. ప్రతీ 8 గంటలకు బ్లాక్‌బస్టర్ డీల్స్, ప్రైస్ క్రాష్, ఆగస్ట్ 10న అర్థరాత్రి 12-2 గంటల మధ్య రష్ హవర్, మూడు రోజుల పాటు సాయంత్రం 7.47 నుంచి 8.18 వరకు ప్రైస్ డ్రాప్స్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

Flipkart Announces 'The Big Freedom Sale' From August 10: Here's Everything You Need To Need To Knowమరోవైపు మరో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం మాల్ కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆగస్ట్ 15 వరకు కొనసాగనుంది. పేటీఎం వ్యాలెట్‌లో కేవైసీ పూర్తిచేసుకున్నవారికే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పేటీఎం మాల్ యాప్‌లోనే ఆఫర్లు వర్తిస్తాయి. క్యాష్‌బ్యాక్ ఓచర్స్ పొందేందుకు జిగ్‌సా పజిల్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక పేటీఎం క్యాష్‌బ్యాక్ ఓచర్లతో పాటు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం అదనంగా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కనీసం రూ.5,000 కొన్నవారికి మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. అది కూడా రూ.1,250 వరకు మాత్రమే. ఎలక్ట్రానిక్స్‌పై రూ.20,000 వరకు, స్మార్ట్‌ఫోన్లపై రూ.10,000 వరకు, గ్రాసరీస్‌పై 60 శాతం వరకు, ఫ్యాషన్‌ అప్పారెల్‌పై 40 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కొన్ని స్మార్ట్‌ఫోన్లపై నో-కాస్ట్ ఇఎంఐ వర్తిస్తుంది. యాపిల్ ఐఫోన్లపై రూ.10,000, నోకియా 3.1పై 12 శాతం, సాంసంగ్ గెలాక్సీ జే8పై రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి.

ఇలా ఇ-కామర్స్ సైట్లు ఆఫర్లపై ఆఫర్లు ప్రకటించడం కస్టమర్లకు పండగే. మరి ఈ ఇండిపెండెన్స్‌ డే సీజన్‌లో ఏఏ ఇ-కామర్స్ సైట్ ఎంతెంత బిజినెస్ చేస్తుందో చూడాలి.
First published: August 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...