హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Dyson’s Zone: హెడ్‌సెట్‌లో కూడా ఎయిర్ ప్యూరిఫయర్‌ ఫీచర్‌.. త్వరలో లాంచ్ చేయనున్న డైసన్ కంపెనీ

Dyson’s Zone: హెడ్‌సెట్‌లో కూడా ఎయిర్ ప్యూరిఫయర్‌ ఫీచర్‌.. త్వరలో లాంచ్ చేయనున్న డైసన్ కంపెనీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డైసన్ కంపెనీ ఎయిర్ ఫ్యూరిఫయర్‌ ఫీచర్‌తో హెడ్‌ఫోన్స్‌ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. జోన్(Zone) పేరుతో వచ్చే ఏడాది మార్చిలో అమెరికాలో ఈ ఎయిర్ ఫ్యూరిఫయర్ హెడ్‌సెట్‌ను లాంచ్ చేయనుంది.  

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ పుణ్యమా అని కొత్త ఫీచర్లతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మార్కెట్‌లో అడుగుపెడుతున్నాయి. కంపెనీలు తమ ప్రొడక్టులకు అదనపు హంగులను జోడిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా డైసన్ కంపెనీ ఎయిర్ ఫ్యూరిఫయర్‌ ఫీచర్‌తో హెడ్‌ఫోన్స్‌ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. జోన్(Zone) పేరుతో వచ్చే ఏడాది మార్చిలో అమెరికాలో ఈ ఎయిర్ ఫ్యూరిఫయర్ హెడ్‌సెట్‌ను లాంచ్ చేయనుంది. డైసన్ జోన్ హెడ్‌సెట్ ధర సుమారు 949 డాలర్లు. ఇండియా కరెన్సీలో దాదాపు రూ.78 వేలు ఉంటుంది. ఇది AirPods Max కంటే దాదాపు రెండు రెట్లు ఖరీదైంది. ఇప్పుడు ఈ లేటెస్ట్‌ ఫీచర్‌ వివరాలు ఏంటో పరిశీలిద్దాం.

అపాయింట్‌మెంట్ ద్వారా ప్రీ ఆర్డర్స్

డైసన్.. అమెరికాలో, ఇతర డెమో స్టోర్స్‌లో ఈ హెడ్‌ఫోన్స్ అందుబాటులోకి రాకముందే అపాయింట్‌మెంట్ ద్వారా ప్రీ ఆర్డర్స్ చేయడానికి అవకాశం కల్పించనుంది. ఈ హెడ్‌సెట్‌అల్ట్రా బ్లూ/ప్రష్యన్ బ్లూ, ప్రష్యన్ బ్లూ/బ్రైట్ కాపర్ వంటి రెండు కలర్ ఆప్షన్స్‌తో అమెరికాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రష్యన్ బ్లూ/బ్రైట్ కాపర్ కలర్ హెడ్‌సెట్‌ను నేరుగా కంపెనీ నుంచే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కొన్ని అదనపు ఫీచర్స్‌తో రానుంది. సెకండ్ ఎలక్ట్రోస్టాటిక్ కార్బన్ పిల్టర్, సాఫ్ట్ పౌచ్, ఇన్‌ఫ్లైట్ అడాప్టర్ కిట్‌ వంటి వాటితో లభిస్తుంది.

Tecno Pova 4: టెక్నో పోవా 4 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు

డ్యూయల్-లేయర్ డిజైన్‌‌తో ఫిల్టర్స్

జోన్ హెడ్‌సెట్ స్టాండర్ట్, డైరెక్ట్ వంటి రెండు మోడల్స్‌లో రానున్నాయి. ఇవి జోన్ సిగ్నేచర్ వైజర్‌తో పాటు డెడికేటెడ్ స్లీవ్, క్లీనింగ్ బ్రష్‌తో అందుబాటులోకి వస్తాయి. ఈ హెడ్‌సెట్‌లోని ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్టర్స్ ను 12 నెలల వరకు ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత వాటిని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిల్టర్స్ డ్యూయల్-లేయర్ డిజైన్‌‌తో ఉంటాయి. పొటాషియం అధికంగా ఉన్న కార్బన్ ఈ ఫిల్టర్స్‌లో ఉంటుంది. దీంతో నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్ వంటి ఆమ్ల వాయువులను ఈ ఫిల్టర్స్ పీల్చుకుంటాయి. ఈ ఫిల్టర్లు 99 శాతం కాలుష్య కణాలను బ్లాక్ చేస్తాయని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా 0.1 మైక్రాన్ల సైజ్‌లో ఉన్న కణాలను సైతం బ్లాక్ చేస్తాయని కంపెనీ వెల్లడించింది.

2,600mAh బ్యాటరీ

ఎయిర్ ఫిల్ట్రేషన్ ఫీచర్‌ను ఉపయోగించే దాన్ని బట్టి జోన్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఇందులో 2,600mAh బ్యాటరీ ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫైర్ ఫీచర్‌తో సంబంధం లేకుండా దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 50 గంటల వరకు లిజనింగ్ టైమ్‌ను అందిస్తుంది. USB-C ఛార్జింగ్‌ ద్వారా మూడు గంటల్లో పూర్తిగా 100 శాతం ఛార్జ్‌ అవుతుంది.

త్రీ ఆడియో ఈక్వలైజేషన్ మోడ్స్‌

జోన్ హెడ్‌ఫోన్స్ 38 డెసిబుల్స్ వరకు నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో రానున్నాయి. ఈ హెడ్‌సెట్‌లో 40-మిల్లీమీటర్ నియోడైమియం డ్రైవర్స్ ఉంటాయి. MyDyson కంపానియన్ యాప్‌‌ను ఉపయోగిస్తూ డైసన్ EQ, బాస్ బూస్ట్, న్యూట్రల్ వంటి మూడు ఆడియో ఈక్వలైజేషన్ మోడ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ హెడ్‌ఫోన్స్ SBC, AAC, LHDC ఆడియో కోడెక్‌లతో పాటు బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తాయి.

First published:

Tags: Head phones

ఉత్తమ కథలు