Dussehra 2019: మీ వాట్సప్‌లో దసరా స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా...

Dussehra 2019 WhatsApp Stickers | మీరు కూడా కాస్త క్రియేటీవ్‌గా దసరా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? ఇందుకోసం వందలాది వాట్సప్ స్టిక్కర్స్‌‌తో ప్లేస్టోర్‌లో అనేక యాప్స్ ఉన్నాయి.

news18-telugu
Updated: October 7, 2019, 6:18 PM IST
Dussehra 2019: మీ వాట్సప్‌లో దసరా స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా...
Dussehra 2019: మీ వాట్సప్‌లో దసరా స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 7, 2019, 6:18 PM IST
దేశమంతా దసరా సందడి కనిపిస్తోంది. బంధువులకు, కుటుంబ సభ్యుల దసరా విషెస్ చెబుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారంతా. ఏ పండుగ వచ్చినా, ఏ వేడుక చేసుకున్నా విషెస్ చెప్పడానికి వాట్సప్ ప్రధాన వేదిక మారుతుంది. వాట్సప్‌లోనే దసరా పండుగ శుభాకాంక్షల వెల్లువ కనిపిస్తుంది. మరి మీరు కూడా కాస్త క్రియేటీవ్‌గా దసరా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? ఇందుకోసం వందలాది వాట్సప్ స్టిక్కర్స్‌‌తో ప్లేస్టోర్‌లో అనేక యాప్స్ ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుంటే దసరా విషెస్‌ను కాస్త కొత్తగా చెప్పొచ్చు. మరి మీ వాట్సప్‌లో దసరా స్టిక్కర్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.

Dussehra 2019: వాట్సప్‌లో స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా


ముందుగా మీరు మీ వాట్సప్‌లో ఛాట్ విండో ఓపెన్ చేయండి.

టెక్స్ట్ బాక్స్ పక్కన ఉండే స్మైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
కొత్త విండోలో ఎమొజీ, గిఫ్ బటన్స్ పక్కన స్టిక్కర్స్ ఐకాన్ కనిపిస్తుంది.
స్టిక్కర్స్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఇప్పటికే మీరు డౌన్‌లోడ్ చేసుకున్న స్టిక్కర్స్ లిస్ట్ కనిపిస్తుంది.


చివర్లో కనిపించే + గుర్తును క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఉన్న స్టిక్కర్ ప్యాక్‌ల వివరాలుంటాయి.
Loading...
అలాగే కిందకు స్క్రోల్ చేసి చివర్లో 'Get More Stickers' పైన క్లిక్ చేయాలి.
అప్పుడు యాప్ స్టోర్ ఓపెన్ అవుతుంది.
యాప్ స్టోర్‌లో Dussehra Stickers for WhatsApp అని సెర్చ్ చేస్తే స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి.
స్టిక్కర్ ప్యాక్స్‌లో మీకు నచ్చినవి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన స్టిక్కర్ ప్యాక్ ఓపెన్ చేయాలి.
'Add to WhatsApp' పైన క్లిక్ చేస్తే ఆ స్టిక్కర్లు మీ వాట్సప్‌లోకి వచ్చేస్తాయి.
మీరు మళ్లీ వాట్సప్‌లో స్టిక్కర్స్ లిస్ట్‌లోకి వెళ్లి చూస్తే దసరా స్టిక్కర్లు కనిపిస్తాయి.
ఇలా కాకుండా మీరు నేరుగా యాప్ స్టోర్‌లోకి వెళ్లి కూడా దసరా స్టిక్కర్ ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసిన వాటిలో కలర్‌ఫుల్ స్టిక్కర్‌ను మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపొచ్చు.

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Amazon Sale: అమెజాన్‌లో మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్... ఆఫర్స్ ఇవే

Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ మరో సర్‌ప్రైజ్... దీపావళికి ముందే మరో సేల్

Reliance Offers: రిలయెన్స్ డిజిటల్‌లో 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్'... కేజీ బంగారం గెలుచుకునే ఛాన్స్
First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...