Home /News /technology /

Android Phone: గోప్యత కోసం DuckDuckGo ప్లాట్‌ఫాంలో కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ ట్రాకింగ్ ప్రొటక్షన్

Android Phone: గోప్యత కోసం DuckDuckGo ప్లాట్‌ఫాంలో కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ ట్రాకింగ్ ప్రొటక్షన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆండ్రాయిడ్ డివైజెస్‌లో "యాప్ ట్రాకింగ్ ప్రొటక్షన్" సదుపాయాన్ని ప్రారంభించింది ప్రముఖ ప్రైవసీ సెర్చ్ ఇంజిన్ డక్ డక్ గో (DuckDuckGo). థర్డ్ పార్టీ ట్రాకర్లను బ్లాక్ చేయడానికి ప్రస్తుతం బీటా వెర్షన్‌ను (beta version) సరికొత్తగా అప్‌డేట్ చేసినట్లు స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్(Smartphone) కొనుగోలు చేయడం సులభమే. కానీ వాటిని సురక్షితంగా ఉంచుకోవడమే పెద్ద సవాలు. ఎందుకంటే మనం వినియోగించే వివిధ రకాల యాప్స్ వల్ల గోప్యతకు (Privacy) భంగం వాటిల్లే అవకాశముంది. పలు రకాల యాడ్స్ ద్వారా మీ మొబైల్ ఫోన్లో మాల్వేర్ చొరబడే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీ సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కినట్లే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఆండ్రాయిడ్ డివైజెస్‌లో "యాప్ ట్రాకింగ్ ప్రొటక్షన్" సదుపాయాన్ని ప్రారంభించింది ప్రముఖ ప్రైవసీ సెర్చ్ ఇంజిన్ డక్ డక్ గో (DuckDuckGo). థర్డ్ పార్టీ ట్రాకర్లను బ్లాక్ చేయడానికి ప్రస్తుతం బీటా వెర్షన్‌ను సరికొత్తగా అప్‌డేట్ చేసినట్లు స్పష్టం చేసింది. యాపిల్‌కు చెందిన యాప్ ట్రాకింగ్ ట్రాన్స్ పరెన్సీ(ATT) టూల్ నుంచి స్ఫూర్తి పొంది సంస్థ ఈ ఫీచర్‌ను సిద్ధం చేసింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి యాప్ లోని డేటా ట్రాకింగ్‌ను వినియోగదారులు నిలిపివేయవచ్చు.

టెక్నికల్‌గా ఈ టూల్ ప్రకటనలను బ్లాక్ చేయదు. కానీ పెద్ద కంపెనీలు టార్గెటెడ్ యాడ్స్ కోసం డిజిటల్ ప్రొఫైల్ ను సృష్టించకుండా నిరోధిస్తుంది. ఇందుకోసం ఇతర ప్లాట్ ఫాంలో మీ యాక్టివిటీలను దాచిపెడుతుంది. ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో వచ్చే ప్రకటనలు వినియోగదారులకు మెరుగైన గోప్యతా అనుభవాన్ని అందించాలని DuckDuckGo లక్ష్యంగా పెట్టుకుంది. AndroidRank.org ర్యాంకింగ్‌ల ఆధారంగా కంపెనీ పరీక్షించిన 96 శాతం ఉచిత యాప్‌లలో థర్డ్-పార్టీ ట్రాకర్‌లు దాగి ఉన్నాయని ఈ సంస్థ ఓ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. గూగుల్, ఫేస్ బుక్ ఈ ఉచిత యాప్స్ నుంచి అత్యధిక డేటాలను సేకరించినట్లు ఈ కంపెనీ కనుగొంది. అందువల్ల ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం ఈ నూతన యాప్ ట్రాకింగ్ ప్రొటక్షన్ ఫీచర్‌తో సురక్షితమైన ఆన్ లైన్ అనుభవాన్ని అందిస్తామని స్పష్టం చేసింది.
WhatsApp: వాట్సాప్‌లో మరో రెండు కొత్త సేఫ్టీ ఫీచర్లు.. భారత్‌లో ఫ్లాష్ కాల్స్, మెసేజ్ లెవల్ రిపోర్టింగ్ ఆప్షన్ల విడుదల

ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ ను కొంతమంది వినియోగదారుల చూడలేకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఆండ్రాయిడ్ డక్ డక్ గో యాప్ వినియోగదారులు సెట్టింగ్స్>యాప్ ట్రాకింగ్ ప్రొటక్షన్ ఆప్షన్లను ఎంచుకొని.. ప్రైవేట్ వెయిట్ లిస్టులో జాయిన్ అవ్వాలి. కాలక్రమేణా ఈ లిస్టును మరింత తగ్గించడానికి చాలా తక్కువ యాప్స్(without naming them)కు మినహాయింపు ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది.
True Caller: ఇండియానే టాప్‌.. 11 ఏళ్ల‌లో 30 కోట్ల యూజ‌ర్లు ట్రూకాల‌ర్ సొంతం

కొత్త ఫీచర్ ద్వారా ట్రాకింగ్ కదలికలను డక్ డక్ గో ఆండ్రాయిడ్ యాప్ గుర్తిస్తే అది మీ అభ్యర్థనలను బ్లాక్ చేస్తుంది. ఈ యాప్ ట్రాకింగ్ ప్రొటక్షన్ వీపీఎన్‌లో ఒకటిగా గుర్తించినప్పటికీ.. వీపీఎన్ వలే పనిచేయదని కంపెనీ పేర్కొంది. బయటి సర్వర్ ద్వారా రూట్ చేయనప్పటికీ లోకల్ వీపీఎన్ కనెక్షన్‌ను ఉపయోగిస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G Smartphone, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు