డుకాటీ (Ducati) స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ బైక్ లాంచింగ్ కోసం బైక్ (Bike) లవర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కంపెనీ ఈ బైక్ ఫోటోను అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ ఫొటో బైక్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
ఇటలీకి చెందిన ప్రీమియం బైక్‌ల తయారీ కంపెనీ డుకాటీ (Ducati) ఇండియాలో ఎప్పటికప్పుడు అద్భుతమైన బైక్స్ లాంచ్ చేస్తోంది. ఈ ఏడాది కూడా చాలా బైక్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ అప్‌కమింగ్ బైక్స్‌లో డుకాటీ స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ (2022 Ducati Scrambler Urban Motard) బైక్ లాంచింగ్ కోసం బైక్ లవర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కంపెనీ ఈ బైక్ ఫోటోను అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ ఫొటో బైక్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. అధికారిక లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ బైక్‌ను చాలా త్వరగా ఇండియన్ మార్కెట్లో కంపెనీ రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ఈ బైక్ ఫీచర్లు, ప్రత్యేకతల వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
2022 డుకాటీ స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ బైక్ డ్యూయల్-టోన్ కలర్‌తో చాలా అట్రాక్టివ్‌గా కనిపించనుంది. ఈ బైక్ స్టార్ సిల్క్ వైట్‌తో పాటు డుకాటీ జీపీ 2019 లాగా రెడ్ & బ్లాక్ గ్రాఫిక్స్‌తో అందుబాటులోకి రానుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కంపెనీ ట్విట్టర్లో ఈ బైక్‌ను టీజ్ చేయగా.. దాని డిజైన్ ఎలా ఉంటుందనే దానిపై ఒక స్పష్టత వచ్చింది. ఈ ఫొటోలో బైక్‌కి రెడ్ ఫ్రంట్ మడ్‌గార్డ్ కనిపించింది. అలానే బైక్ ఫ్యూయల్ ట్యాంక్, టెయిల్ ఎండ్లపై రెడ్ కలర్ హైలైట్స్ కనిపించాయి.
2022 స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్లో లాంచ్ అయింది. అయితే ఇండియా-స్పెక్ బైక్ గ్లోబల్ వెర్షన్లో అందించిన అవే ఫీచర్లు, డిజైన్లతో వస్తుందని తెలుస్తోంది. ఇందులో లో-హ్యాండిల్‌బార్, ఫ్లాట్ సీటు, ముందు మడ్‌గార్డ్, సైడ్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ అందించనున్నారు. ఇవన్నీ కూడా బైక్ లుక్‌ను అద్భుతంగా మారుస్తాయి. సూపర్మోటో స్టైల్ మోటార్‌సైకిళ్ల నుంచి స్ఫూర్తి పొంది ఈ బైక్ హ్యాండిల్‌బార్, సీటు డిజైన్‌ను తయారు చేశారు. బైక్ ముందు ఫోర్క్ సస్పెన్షన్, వెనుక మోనో షాక్ సస్పెన్షన్ అందించడం వల్ల కుదుపులు లేని ప్రయాణం సాధ్యమవుతుంది. కార్నరింగ్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో డిస్క్ బ్రేక్‌ల అందించడం వల్ల దీనిపై రైడ్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది.
ఈ మోటార్‌సైకిల్ పిరెల్లీ డయాబ్లో రోసో III టైర్లపై నడుస్తుంది. తారు రోడ్డులపై ఈ టైర్లకు అద్భుతమైన గ్రిప్ ఉంటుంది కాబట్టి రైడర్ చాలా కాన్ఫిడెంట్‌గా దీన్ని రైడ్ చేయవచ్చు. ఫ్యూయల్-లెవెల్ ఇండికేటర్‌తో కూడిన ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్‌ను ఇందులో అందించారు కనుక ఇంటరాక్టివ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ సైతం పొందొచ్చు. కంపెనీ ఈ బైక్‌లో యూఎస్బీ సాకెట్‌ను కూడా ఆఫర్ చేసింది.
2022 స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ బైక్ ఎల్-ట్విన్, డెస్మోడ్రోమిక్ డిస్ట్రిబ్యూషన్ (Desmodromic Distribution)తో కూడిన ఎయిర్-కూల్డ్ 803-సీసీ ఇంజన్ సాయంతో రన్ అవుతుంది. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్-ఇంజెక్ట్ పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 73hp శక్తిని, 49Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. బైక్ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్స్మిషన్, హైడ్రాలిక్ కంట్రోల్డ్ స్లిప్పర్‌తో వస్తుంది. రాబోయే రోజుల్లో లేదా వారాల్లో ఈ న్యూ బైక్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్ ధర రూ.8 లక్షల నుంచి రూ.10.50 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.