ఐపీఎల్ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఐపీఎల్ ప్రేమికుల కోసం క్రికెట్ ప్లాన్స్ ప్రకటించింది రిలయెన్స్ జియో. క్రికెట్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా 4జీ డేటాతో పాటు వాయిస్, టెక్స్ట్ బెనిఫిట్స్ అందిస్తోంది. అంతేకాదు... స్మార్ట్‌ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. దీంతో జియో కస్టమర్లు ఐపీఎల్ మ్యాచ్‌లు లైవ్‌లో చూడొచ్చు. డేటా సరిపోకపోతే డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 1 ఏడాది వేలిడిటీతో ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. మరి జియో క్రికెట్ ప్లాన్స్‌లో ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఏ బెనిఫిట్స్ వస్తాయి తెలుసుకోండి.
Jio Rs 401 Plan: జియో రూ.401 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వేలిడిటీ 28 రోజులు. అంటే 84జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. వీటితో పాటు రూ.399 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం.
Jio Rs 598 Plan: జియో రూ.598 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వేలిడిటీ 56 రోజులు. అంటే 112జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. వీటితో పాటు రూ.399 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం.
Redmi 9i: తక్కువ ధరకే మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన షావోమీ... రెడ్మీ 9ఐ ప్రత్యేకతలివే
Poco M2: పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్... తక్కువ ధరకే 6GB+64GB స్మార్ట్‌ఫోన్
Jio Rs 777 Plan: జియో రూ.777 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వేలిడిటీ 84 రోజులు. అంటే 126జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. వీటితో పాటు రూ.399 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం.
Jio Rs 2599 Plan: జియో రూ.2599 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వేలిడిటీ 365 రోజులు. అంటే 730జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. వీటితో పాటు రూ.399 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం.
Jio Rs 499 Data Add-on Plan: జియో రూ.499 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వేలిడిటీ 56 రోజులు. అంటే 84జీబీ డేటా వాడుకోవచ్చు. రూ.399 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం. ఇది కేవలం డేటా యాడ్ ఆన్ ప్లాన్ మాత్రమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Disney+ Hotstar, Hotstar, IPL, IPL 2020, Jio, Reliance Jio