• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • DRDO CHIEF SATHISH REDDY SLAMS PAKISTAN MINISTERS FOR MOCKING CHANDRAYAAN 2 BS

Chandrayaan 2: మీకు చేతకాకపోతే మూసుకోండి.. పాక్‌పై డీఆర్‌డీవో చీఫ్ ఫైర్..

Chandrayaan 2: మీకు చేతకాకపోతే మూసుకోండి.. పాక్‌పై డీఆర్‌డీవో చీఫ్ ఫైర్..

ప్రతీకాత్మక చిత్రం

Chandrayaan 2 | ఫవాద్ వ్యాఖ్యలపై డీఆర్‌డీవో చీఫ్ సతీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. చేతకాకపోతే మూసుకోండి అన్నట్లు పాక్‌కు చురక అంటించారు.

  • Share this:
చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగబోయి.. ఇస్రోతో కమ్యూనికేషన్ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రయోగంపై భారత్‌ను హేళన చేసేలా పాకిస్తాన్ పలు వ్యాఖ్యలు చేసింది. కమ్యూనికేషన్ కోల్పోయాక.. ఆ దేశ టెక్నాలజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ట్విట్టర్‌లో ఇండియాఫెయిల్ అని హ్యాష్‌ ట్యాగ్ పెట్టి పోస్ట్ చేశాడు. ఇది ఆ దేశ నీచపు వ్యక్తిత్వానికి నిదర్శనంగా పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా, ఫవాద్ వ్యాఖ్యలపై డీఆర్‌డీవో చీఫ్ సతీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. చేతకాకపోతే మూసుకోండి అన్నట్లు పాక్‌కు చురక అంటించారు. ‘చంద్రయాన్ చాలా కష్టంతో కూడుకున్న మిషన్. ఇలాంటి మిషన్ చేసేవాళ్లు ఆ కష్టాన్ని అభినందిస్తారు. కానీ, జీవితంలో అసలు ఇలాంటి ప్రయోగాలు చేయని వాళ్లకు ఏం అర్థమవుతుంది? అసలు మిషన్ గొప్పతనం ఏంటో కూడా వాళ్లకు అర్థం కాదు’ అని వ్యాఖ్యానించారు.

ఇక, ఇస్రో చైర్మన్ కె.శివన్‌ను ప్రధాని మోదీ కౌగిలించుకుని, ఓదార్చిన సన్నివేశంపైనా సతీష్ రెడ్డి స్పందించారు. ధైర్యాన్ని పెంచే గొప్ప వ్యక్తి మోదీ అని అన్నారు. కాగా, కేంద్ర మంత్రి గిరిరాజ్ కూడా పాక్‌పై నిప్పులు చెరిగారు. ఒకేసారి స్వాతంత్ర్యం తెచ్చుకున్నా భారత్ చంద్రుని వద్దకు వెళ్లిందని, పాక్ మాత్రం ఇంకా గాడిదలను ఎగుమతి చేసుకుంటూనే ఉందని ఎద్దేవా చేశారు.

Published by:Shravan Kumar Bommakanti
First published:

అగ్ర కథనాలు