టెక్నాలజీ పెరిగిపోతోంది. ఈ రోజుల్లో ఏం కావాలన్నా స్మార్ట్ఫోన్తో సాధ్యమైపోతుంది. ఇంట్లో కూర్చొని అన్ని పనుల్ని చక్కబెట్టుకోవచ్చు. కొత్తగా పుట్టుకొస్తున్న స్టార్టప్స్ కూడా టెక్నాలజీ సాయంతోనే వినూత్న సేవలు అందిస్తున్నాయి. My OmNamo App కూడా అలాంటిదే. మీ ఇంట్లో మీరు పూజ చేయించాలనుకుంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. మీ ఇంట్లో పూజాకార్యక్రమాలకు సంబంధించిన సేవలన్నీ లభిస్తాయి. మీ ఇంట్లో పూజకు పూజారిని, పండితుడిని బుక్ చేసుకోవచ్చు. ఏదైనా ఆలయంలో దర్శనం బుక్ చేసుకోవచ్చు. ఓ వారం రోజులు మీ ఇంట్లో వరుసగా పూజా కార్యక్రమాలు ఉంటే ఓ పూజారిని మాట్లాడుకోవచ్చు. అందులో ఉండే ఇ-స్టోర్లో పువ్వులు, అరిటాకులు, ప్రసాదం ఇతర పూజా సామాగ్రిని కొనుక్కోవచ్చు. ఏదైనా ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలను లైవ్లో చూడొచ్చు. మీ జాతకాన్నీ చూసుకోవచ్చు. ఇలా ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక అంశాలతో రూపొందినదే 'మై ఓంనమో యాప్'.
యూఏఈలో పూజారి కోసం వెతికీవెతికీ విసిగిపోయిన మకరంద్ పాటిల్ తన భార్య సాయంతో 'మై ఓంనమో యాప్'ను ప్రారంభించారు. ఇప్పటికే రూ.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. 2016లో ప్రారంభమైన 'మై ఓంనమో యాప్'ను ఇప్పటికే అనేక మంది డౌన్లోడ్ చేసుకొని సేవల్ని పొందుతున్నారు. 2500 మంది పూజారులు సేవలు అందించేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్లు 12 భాషల్లో 156 రకాల పూజా సేవల్ని అందిస్తారు. గత రెండేళ్లలో ఈ యాప్ ద్వారా భారతదేశంలో 5000 పూజలు నిర్వహించగా, యూఏఈలో 1000 పూజలు నిర్వహించారు. భారతదేశంలోని 10 నగరాలతో పాటు యూఏఈ, స్పెయిన్, ఘనాలో సేవలందిస్తుండటం విశేషం. కొద్ది రోజుల క్రితమే యూఏఈలో 10 లక్షల డాలర్ల ఫండింగ్ పొందారు. మలేషియా, సింగపూర్, బహ్రైన్, ఒమన్, యూకేలో విస్తరించే పనుల్లో ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ విలువ రూ.70 కోట్లు. 2020 నాటికి 10 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా.
Photos: రెడ్మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.