హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Dosa Printer: దోశల్ని ప్రింట్ చేసే ప్రింటర్ వచ్చేసింది... నెటిజన్ల సెటైర్లు (Video)

Dosa Printer: దోశల్ని ప్రింట్ చేసే ప్రింటర్ వచ్చేసింది... నెటిజన్ల సెటైర్లు (Video)

Dosa Printer: దోశల్ని ప్రింట్ చేసే ప్రింటర్ వచ్చేసింది... నెటిజన్ల సెటైర్లు  (Image: Twitter/@NaanSamantha)

Dosa Printer: దోశల్ని ప్రింట్ చేసే ప్రింటర్ వచ్చేసింది... నెటిజన్ల సెటైర్లు (Image: Twitter/@NaanSamantha)

Dosa Printer | ప్రింటర్ అంటే పేపర్ పైన అక్షరాలు ప్రింట్ చేసే ప్రింటర్ గురించి తెలుసు. మార్కెట్లోకి దోశల్ని ప్రింట్ చేసే ప్రింటర్ వచ్చింది. ఈ ప్రింటర్ చూసి అవాక్కవుతున్నారు అంతా.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇంట్లో దోశ చేసుకోవాలంటే ముందు రోజే పిండి రుబ్బి నానబెట్టుకోవాలి. మార్కెట్లో ఇన్‌స్టంట్ దోశ పిండి కూడా లభిస్తోంది. ఆ పిండి తెచ్చుకొని ప్యాన్ పైన దోశలు వేసుకుంటే చాలు. కానీ టెక్నాలజీ పెరిగిపోయినకొద్దీ దోశలు చేసుకోవడం ఇంకా సులభమైపోయింది. పిండిని ప్యాన్ మీద వేయాల్సిన అవసరం లేకుండా దోశలు చేసుకోవచ్చు. ఇందుకోసం దోశ ప్రింటర్ (Dosa Printer) వచ్చేసింది. షాకయ్యారా? మీరే కాదు... నెటిజన్లు కూడా ఇలాగే షాకవుతున్నారు. ఓ కంపెనీ దోశలు వేసుకోవడానికి కిచెన్ గ్యాడ్జెట్ ఒకటి తయారు చేసింది. ఆ గ్యాడ్జెట్ చూడ్డానికి ప్రింటర్ లాగానే ఉంది. అందులో ఓవైపు పిండి పోస్తే మరోవైపు నుంచి దోశలు ప్రింటయి వస్తాయి. ఈ ప్రింటర్ ద్వారా కరకరలాడే దోశలు ప్రింట్ అవుతున్నాయి.


ఇలా ప్రింట్ అయిన దోశల్ని ప్లేట్‌లో పెట్టుకొని చట్నీతో తినేస్తే సరి. ఈ ఐడియా ఏదో బాగుందని అనిపిస్తుంది కానీ ఈ టెక్నాలజీపై ఆన్‌లైన్‌లో సెటైర్లు వస్తున్నాయి. ఇలాంటి గ్యాడ్జెట్స్, మెషీన్లు మానవ జీవితం సులభతరం చేస్తుందన్న విషయం తెలుసుకానీ, మరీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే రోటీ మేకర్స్ నుంచి డిష్ వాషర్స్ వరకు అనేక గ్యాడ్జెట్స్, అప్లయెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి దోశ ప్రింటర్ రావడం షాకిస్తోంది. సమంతా పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ అయిన వీడియో ఇక్కడ చూడొచ్చు.


Motorola Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.17,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్... స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే
ఈ మెషీన్‌తో ఎంత మందం దోశలు కావాలో, ఎన్ని దోశలు కావాలో సెట్ చేయొచ్చు. సెట్టింగ్స్ ప్రకారం దోశలు వస్తాయి. ఈ వీడియో చూసినవారంతా షాకవుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 1.1 మిలియన్ వ్యూస్ వస్తే, 3,536 రీట్వీట్స్, 1,324 కామెంట్స్, 19.8K లైట్స్ వచ్చాయి. ఈ ప్రింటర్ టెస్ట్ చేసేప్పుడు మినీ ఉతప్పం వస్తుందా అని ఒకరు కామెంట్ చేస్తే, ఒకవేళ దోశ జామ్ అయితే ఏం చేయాలని అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఈ దోశ దారుణంగా ఉంటుందని తెలిసినా, ఓసారి టేస్ట్ చేయాలని ఉంది అంటూ మరొకరు రియాక్ట్ అయ్యారు. ఆ ట్వీట్స్ ఇక్కడ చూడొచ్చు.


WhatsApp: పొరపాటున డిలిట్ చేసిన వాట్సప్ మెసేజెస్ మళ్లీ పొందొచ్చుఇవోషెఫ్ కంపెనీ ఈసీ ఫ్లిప్ పేరుతో ఈ కిచెన్ గ్యాడ్జెట్‌ను తయారుచేసింది. ధర రూ.15,999. నాలుగు కలర్స్‌లో దీన్ని కొనొచ్చు. భారతదేశంలో దోశ ప్రతీ ఇంట్లో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దోశ లవర్స్ ఎక్కువ. భారతదేశంలోని ప్రతీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌లో దోశ తప్పనిసరిగా ఉంటుంది. హైదరాబాద్‌లో అయితే బేగంబజార్ దోశ, బటర్ దోశ, బటర్ పన్నీర్ దోశ, మసాలా దోశ ఫేమస్. దోశలో పదుల రకాల వెరైటీస్ ఉన్నాయి. కానీ ఈ దోశ ‌ప్రింటర్‌లో కేవలం ప్లెయిన్ దోశలు మాత్రమే వస్తాయి. మరి మిగతా వెరైటీల సంగతేంటో?

First published:

Tags: Dosa, Gadget, Gadgets

ఉత్తమ కథలు