DOOSRA MOBILE APP DESIGNED BY A TELUGU YOUTH IS USEFUL TO PREVENT UNNECESSARY MOBILE CALLS BK PRV
Doosra App: మీ ఫోన్‌కు అనవసర కాల్స్ వస్తున్నాయా? అయితే ఈ తెలుగు కుర్రాడు రూపొందించిన యాప్‌తో చెక్ పెట్టొచ్చు.. వివరాలివే..
(ప్రతీకాత్మక చిత్రం)
మన ఫోన్ కి చాలాసార్లు అనవసరమైన కాల్స్ వస్తుంటాయి. మనం ఎదో ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఎదో బ్యాంక్ నుంచో లేదా ఇతర వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కాల్స్ వస్తూ ఉంటాయి. ఇపుడు ఈ కాల్స్‌కు ఈ పద్దతిలో చెక్ పెట్టొచ్చు.
మన ఫోన్ కి చాలాసార్లు అనవసరమైన కాల్స్ (Unwanted calls) వస్తుంటాయి. మనం ఎదో ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఎదో బ్యాంక్ నుంచో లేదా ఇతర వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ కాల్స్ కు ఎవరు అతీతులు కాదు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ట్రూ కాలర్ కొంత వరకు సేవలు అందిస్తున్న ఈ వేస్ట్ కాల్స్ ను మాత్రం సరైన పరిష్కారం చూపించలేకపోతున్నాయి. అయితే సరిగ్గ ఇదే సమస్యకు పరిష్కారం చూపించడానికి హైదరాబాద్ (Hyderabad) కు చెందిన యువకుడు (Telugu youth) ఒక వినూత్న యాప్ (Application) ను రూపొందించాడు. హైదరాబాద్ కు చెందిన ఆదిత్య వుచి ఈ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. దూస్రా (Doosra) అనే స్టార్టప్ తో ఎక్కడైనా ఉపయోగించగల వర్చువల్ సెకండరీ నంబర్‌ను స్పేస్‌కు క్లౌడ్ టెలిఫోనీని అండ్ ఆఫ్‌లైన్ లో ఈ వర్చవల్ సిమ్ పనిచేస్తోంది అంటున్నారు ఆదిత్య (Aditya) . దూస్రా వినియోగదారులకు 10-అంకెల వర్చువల్ సిమ్‌ను అందిస్తుంది, ప్రస్తుతం మీరు వాడుతున్న వ్యక్తిగత మొబైల్ నంబర్‌లను ఇతర ప్లాట్ ఫామ్స్ లో వాడడం బదులుగా మీరు నిత్యం వాడే స్వీగ్గీ, జోమోటో, ఓలా, ఊబర్ మొదలగు ప్లాట్‌ఫారమ్‌లో ఈ నెంబర్ ను మీరు వాడొచ్చు. దీంతో మీ వ్యక్తిగత నెంబర్ కనిపించడకుండా మనం అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ వాడుకొవచ్చు.
aditya doosra app
రెండో నంబర్ (Second number)ను కిరాణా దుకాణాలు, ఫార్మసీలు, కార్ డీలర్‌షిప్‌లు, రెస్టారెంట్‌లు, షాపింగ్ మాల్స్, డెలివరీ అండ్ టికెటింగ్ సేవలు, డేటింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లు, నెట్‌వర్కింగ్ ఈవెంట్‌లు మొదలైన వాటిలో షేర్ చేయవచ్చు. “దూస్రా నెంబర్ సేవాలు టెలిఫోన్ సేవలతో సంబంధం లేకుండా పబ్లిక్‌గా షేర్ చేయగల నంబర్ ను మీ ఆన్ లైన్ అవసరాల కోసం అందిస్తోంది. ఈ నెంబర్ ను UPI మినహా ప్రతిచోటా దీన్ని ఉపయోగించవచ్చు, ”అని స్టార్టప్ వ్యవస్థాపకుడు ఆదిత్య న్యూస్ 18 కి తెలిపారు.
తమకు నచ్చిన అంకెలు నంబర్‌గా..
వర్చువల్ 10 నెంబర్ల తో సిస్టమ్ లేకుండా మీ సిమ్ ను అందిస్తోంది. అయితే ఇక్కడ మీరు మీకు ఏ నెంబర్ కావాలో అది మీరే 10 అంకెల నెంబర్ ను జనరేట్ చేసుకోవచ్చు అంటున్నారు యాప్ నిర్వాహకులు. ‘‘చాలా మంది తమకు నచ్చిన అంకెలను నెంబరు ను ఎన్నుకునే అవకాశం కల్పిస్తోంది ఎందుకంటే ముఖ్యమైన తేదీలు పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ఇతర ముఖ్యమైన తమ జీవితంలో ఉన్న తేదీలను నెంబర్ గా పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అదే ఉద్దేశంతో వినియోగదారులకు తమకు నచ్చిన నెంబర్ (Favorite Number)ను ఎన్నుకునే అవకాశం కల్పిస్తున్నాం అంటున్నారు ఆదిత్య. ఇప్పటి వరకు క్లౌడ్ టెలిఫోన్ ఎక్కువగా ఎంటర్‌ప్రైజ్ విభాగంగా స్టార్టప్ చాలా పరిమితంగా ఉన్నాయి.
ఎక్సోటెల్, కాలర్‌డెస్క్, కాల్‌హిప్పో, నాలెరిటీ అండ్ ఇతర వ్యాపారాలను అందించే స్టార్టప్‌లు ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నప్పటికి. B2C మార్కెట్ లో సాంకేతికతను తీసుకువచ్చిన దేశంలోని మొదటి స్టార్టప్‌లలో దూస్రా ఒకటి. గత ఏడాది మే 2020లో దూస్రా కార్యకలాపాలను ప్రారంభించారు. సెప్టెంబర్‌లో దాని మొబైల్ యాప్‌ను విడుదల చేసింది.
కేటీఆర్‌తో ఆదిత్య
స్పోర్ట్స్ షాప్‌లో అనుభవం..
గూగుల్ ప్లే స్టోర్ (Google Play store)లో దూస్రా యాప్ 10,000 డౌన్‌లోడ్‌లతో 4.9 యూజర్ రేటింగ్‌ను పొందింది. ఈ ఆలోచన నా వ్యక్తిగత అనుభవం నుండి పుట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం, నేను బే ఏరియాలోని ఒక స్పోర్ట్స్ షాప్‌లో ఉన్నప్పుడు ఈ స్టోర్ మేనేజర్ నా మొబైల్ నంబర్ ఇస్తే తప్ప నాకు బిల్లు ఇవ్వడానికి నిరాకరించాడు. లావాదేవీని ప్రాసెస్ చేస్తున్నప్పుడు మొబైల్ నంబర్‌లను అడగడం స్టోర్ పాలసీ అని చెప్పారు. ప్రస్తుతం చాలా వ్యాపారాలు తమ సేవను మరింత చేరువ చేయడానికి మీ మొబైల్ నంబర్‌ను తీసుకుంటాయి. కాని ఇలా సేకరించిన నెంబర్ల డేటాతో వ్యాపారం చేయవచ్చు ఈ నెంబర్లను దుర్వినియోగం కూడా చేయవచ్చు. కాబట్టి, ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈయాప్ ను రూపొందించాను’’ అని న్యూస్ 18 కి తెలిపారు ఆదిత్య. ప్రస్తుతం ప్లే స్టోర్ లో ఉన్న ఈ యాప్ అవాంచిత కాల్స్ నుంచి మిమ్మల్సి రక్షిస్తోంది అంటున్నారు యాప్ నిర్వహకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.