హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Free Food Drinks: ఫుడ్ డెలివరీ యాప్‌లో ఉచితంగా ఫుడ్, డ్రింక్స్... పోటాపోటీగా ఆర్డర్లు

Free Food Drinks: ఫుడ్ డెలివరీ యాప్‌లో ఉచితంగా ఫుడ్, డ్రింక్స్... పోటాపోటీగా ఆర్డర్లు

Free Food Drinks: ఫుడ్ డెలివరీ యాప్‌లో ఉచితంగా ఫుడ్, డ్రింక్స్... పోటాపోటీగా ఆర్డర్లు
(ప్రతీకాత్మక చిత్రం)

Free Food Drinks: ఫుడ్ డెలివరీ యాప్‌లో ఉచితంగా ఫుడ్, డ్రింక్స్... పోటాపోటీగా ఆర్డర్లు (ప్రతీకాత్మక చిత్రం)

Free Food Drinks | ఫుడ్ డెలివరీ యాప్‌లో సాంకేతిక సమస్య కారణంగా వందలాది కస్టమర్లు ఉచితంగా ఫుడ్, డ్రింక్స్ ఆర్డర్ చేశారు. ఫుడ్ డెలివరీ (Food Delivery) సంస్థ ఈ సమస్య గుర్తించేసరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.

సాఫ్ట్‌వేర్‌తో నడిచే ఏ సర్వీస్ అయినా అప్పుడప్పుడు చిన్నచిన్న లోపాలు తలెత్తడం మామూలే. అమెరికాలో కూడా ఇలాంటిదే జరిగింది. ఇండియాలో జొమాటో, స్విగ్గీ లాగా అమెరికాలో డోర్‌డ్యాష్ (DoorDash) పేరుతో ఫుడ్ డెలివరీ యాప్ ఒకటి ఉంది. ఈ యాప్‌లో సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా వందలాది మంది ఉచితంగా ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఫుడ్, డ్రింక్స్ తెప్పించుకున్నారు. జూలై 7న ఇదంతా జరిగింది. డోర్‌డ్యాష్ కస్టమర్లు ఎప్పట్లాగే ఫుడ్ ఆర్డర్ చేద్దామని ఫుడ్ డెలివరీ యాప్ (Food Delivery App) ఓపెన్ చేస్తే అన్ని ఆర్డర్లు ఉచితంగా ప్లేస్ అవుతున్నాయి. అంతే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా మిగతా కస్టమర్లకు కూడా తెలియడంతో ఆర్డర్ల మీద ఆర్డర్లు చేశారు. ప్రముఖ రెస్టారెంట్లకు కుప్పలుతెప్పలుగా ఆర్డర్స్ వచ్చాయి. తాము చేసిన ఆర్డర్ల గురించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు కస్టమర్లు.

పేమెంట్ గేట్‌వేలో వచ్చిన సమస్య కారణంగా డోర్‌డ్యాష్ కస్టమర్లు ఉచితంగా ఆర్డర్స్ ప్లేస్ చేశారు. పేమెంట్ పేజీ దగ్గరకు వచ్చేసరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి. డోర్‌డ్యాష్ పేమెంట్ గేట్‌వేలో ఉన్న లోపాన్ని గుర్తించేలోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. వేల డాలర్ల ఆర్డర్స్‌ని ఉచితంగా ప్లేస్ చేశారు. ఆ ఫోటోలను పోస్ట్ చేశారు. అటు రెస్టారెంట్లలో కూడా వందల సంఖ్యలో పార్శిళ్లు డెలివరీ సిద్ధమయ్యాయి. ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

43 inches Smart TV: 43 అంగుళాల స్మార్ట్ టీవీ... ఆఫర్ ధర రూ.18,999 మాత్రమే

డోర్‌డ్యాష్ పేమెంట్ గేట్‌వేలో ఉన్న సమస్యను అవకాశంగా తీసుకొని ఉచితంగా ఆర్డర్స్ ప్లేస్ చేసినవారంతా, ఆ సంస్థ ఉద్యోగులకు టిప్స్ ఇవ్వాలని ఎందుకు అనుకోవట్లేదని కొందరు ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఇక ఇంకొందరు ఫన్నీగా మీమ్స్ షేర్ చేశారు.

Airtel 1.5 GB Plans: రోజూ 1.5జీబీ మొబైల్ డేటా అందించే ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే

ఇలాంటి ఆర్డర్‌ల వల్ల నష్టపోయిన వ్యాపారులకు పరిహారం అందేలా చూస్తామని డోర్‌డాష్ అధికార ప్రతినిధి మీడియాకి తెలిపారు. ఇలాంటి ఆర్డర్లను గుర్తించి రద్దు చేశామని, ఆర్డర్లు తీసుకొని ఫుడ్ డెలివరీ చేసిన వ్యాపారులకు పరిహారం చెల్లిస్తామని అన్నారు.

ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్, ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఇలాంటి సాంకేతిక సమస్యలు రావడం మామూలే. ఈ సమస్యలతో ఎక్కువ ధర ఉన్న వస్తువుల్ని తక్కువ ధరకే కొనడం లేదా ఉచితంగా ఆర్డర్ చేయడం లాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Food delivery, Online food delivery

ఉత్తమ కథలు