మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తున్నారా? అయితే బీ కేర్ ఫుల్

ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్, టాబ్, లాప్ టాప్‌ల ఉపయోగాన్ని పరిమిత సమయంలోనే వినియోగించేలా చూడాలని సూచించారు. సోషల్ మీడియా పై మన నియంత్రణ ఉండాలి కానీ అవే మనను నియంత్రించే స్థాయికి తేవద్దని జూహీ కౌల్ హెచ్చరించారు.

news18-telugu
Updated: July 30, 2020, 12:01 PM IST
మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తున్నారా? అయితే బీ కేర్ ఫుల్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రస్తుతం ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఓ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఫోన్‌ను పిల్లలే ఎక్కువగా వాడుతున్నారు. నిండా మూడేళ్లు కూడా లేని పిల్లలు కూడా యూట్యూబ్‌లో బొమ్మలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇంకొంచెం పెద్దవారైతే గేమ్స్‌లో నిమగ్నమవుతున్నారు. ఐతే చిన్నపిల్లలకు ఫోన్‌లు ఇవ్వకూడదని.. కనీస వయస్సు ఎనిదేళ్లు దాటిన పిల్లలకే మొబైల్ ఫోన్‌లను వినియోగించేందుకు ఇవ్వాలని ఐ.టీ, కమ్యూనికేషన్ రంగ నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో రెండెళ్లు కూడా నిండని వారికి కూడా సెల్ ఫోన్ లు ఇచ్చి, వారిని ఫోన్ వ్యసన పరులుగా చేస్తున్నారని, దీని ద్వారా వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు.

తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సైబ్- హర్ కార్యక్రమంలో భాగంగా "సాంకేతికతకు నేటి తరం పిల్లలు వ్యసనపరులవుతున్నారా" అనే అంశంపై నేడు సాయంత్రం రాష్ట్రంలోని మహిళలు, యువతకు వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. సింబయాసిస్ లా స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ల సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో భారతీయ సైనిక దళాలకు మీడియా శిక్షకురాలుగా ఉన్న జూహీ కౌల్ ప్రధాన వక్తగా ప్రసంగించారు.

కోవిద్ నేపథ్యంలోవిధించిన లాక్ డౌన్ తదనంతర పరిస్థితుల్లో వచ్చిన మార్పులవల్ల ఆన్ లైన్ క్లాసులు అనివార్యమయ్యాయని అన్నారు. అయితే, కనీసం ఎనిమిదేళ్ల పైన వయస్సు ఉన్నపిల్లలకు మాత్రమే ఈ క్లాసులు వర్తింప చేయాలని ఆమె సూచించారు. పదేళ్ల లోపు పిల్లలకు రోజూ కనీసం ఒక గంటకన్నా ఎక్కువ సేపు ఈ ఆన్ లైన్ క్లాసులు ఉండొద్దని, ఈ వయస్సులో పిల్లలకు వివిధ అంశాలపై సహజంగా ఉండే ఆసక్తి, నిశిత పరిశీలన, ఇమాజినేషన్ లకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ఇటీవలి కాలంలో పిల్లలు ముఖ్యంగా యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బానిసలుగా మారి అధిక సమయం ప్రధానంగా అర్ద రాత్రివరకూ మొబైల్ ఫోన్ లను ఉపయోగించడం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడంతో పలు రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారని వివరించారు. పిల్లలు, యువకులు రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోయేవిధంగా పేరెంట్స్ తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్, టాబ్, లాప్ టాప్‌ల ఉపయోగాన్ని పరిమిత సమయంలోనే వినియోగించేలా చూడాలని సూచించారు. సోషల్ మీడియా పై మన నియంత్రణ ఉండాలి కానీ అవే మనను నియంత్రించే స్థాయికి తేవద్దని జూహీ కౌల్ హెచ్చరించారు. టాబ్, మొబైల్, లాప్ టాప్ లలో అనవసరం , ఎప్పుడూ ఉపయోగించని యాప్ లను డిలీట్ చేయాలని అన్నారు. ఎవరైనా రోజుకు నాలుగు గంటలకన్నా అధికంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తే అది వ్యసనం కిందకి వస్తుందని తెలిపారు. అనవసర యాప్లను తొలగించడంతో పాటు కేవలం విద్యా పరమైన అవసరాలకే ఇంటర్నెట్ ఉపయోగించడం, అధికంగా ఉపయోగిస్తే కలిగే అనర్థాలను పిల్లలకు అర్ధమయ్యీట్టు చెప్పడం చేయాలని అన్నారు. ప్రతి రోజూ ఇంట్లోనే యోగా, సంగీత సాధన, వ్యాయామం చేయడం లాంటివి చేయించాలని ఆమె తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.డీ. విభాగానికి చెందిన రవి కుమార్ రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ బాలి, నీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ తో పాటు ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు మూడు వేలమంది విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 30, 2020, 12:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading