WhatsApp Scam: వాట్సప్‌లో కోడ్ వచ్చిందా? మోసపోతారు జాగ్రత్త

WhatsApp Scam | మోసగాళ్లు వాట్సప్ కోడ్, ఓ లింక్ పంపిస్తున్నారు. యూజర్లకు ఈ మోసం గురించి తెలియక క్లిక్ చేస్తున్నారు. బుక్కవుతున్నారు. వారి వాట్సప్ అకౌంట్ హ్యాకర్ల కంట్రోల్‌లోకి వెళ్తోంది.

news18-telugu
Updated: April 23, 2019, 1:12 PM IST
WhatsApp Scam: వాట్సప్‌లో కోడ్ వచ్చిందా? మోసపోతారు జాగ్రత్త
WhatsApp Scam: వాట్సప్‌లో కోడ్ వచ్చిందా? మోసపోతారు జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: April 23, 2019, 1:12 PM IST
కొత్త వాట్సప్‌ స్కామ్ బయటపడింది. మోసగాళ్లు ఫోన్‌కు ఓ వెరిఫికేషన్ కోడ్ పంపి అకౌంట్ బ్లాక్ చేస్తున్నారు. వాట్సప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతో ఇతరులు మీ వాట్సప్ యాక్సెస్ చేయడం సాధ్యం కాదు. కానీ... హ్యాకర్లు ఓ చిన్న టెక్నిక్‌తో మీ వాట్సప్‌ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. యూఏఈకి చెందిన టెలీకమ్యూనికేషన్స్ అథారిటీ ట్విట్టర్‌లో వాట్సప్ యూజర్లను అప్రమత్తం చేసిందంటూ గల్ఫ్ న్యూస్ ఓ కథనాన్ని పబ్లిష్ చేసింది. ఎవరైనా వెరిఫికేషన్ కోడ్స్ పంపిస్తే రిప్లై ఇవ్వొద్దంటూ యూజర్లను అప్రమత్తం చేసింది. ఇప్పటికే మోసగాళ్లు వెరిఫికేషన్ కోడ్ పంపి అనేక మంది వాట్సప్ అకౌంట్స్ హ్యాక్ చేసినట్టు తేలింది.

Read this: SBI Loan: ఎస్‌బీఐలో ఎలక్ట్రిక్ వాహనాల లోన్‌పై డిస్కౌంట్

Whatsapp Scam, WhatsApp verification code, WHATSAPP SCAMMERS, WHATSAPP FAKE VERIFICATION MESSAGES, Telecommunications Authority warning, WhatsApp for Android, వాట్సప్ స్కామ్, వాట్సప్ మోసం, వాట్సప్ ఫేక్ వెరిఫికేషన్ మెసేజ్, వాట్సప్ కోడ్, వాట్సప్ మెసేజెస్
Image: tech2/Anirudh Regidi


సాధారణంగా మీరు వాట్సప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు వాట్సప్ నుంచి మీ ఫోన్ నెంబర్‌కు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ మీదేనా కాదా అన్న విషయం తెలుసుకునేందుకు వాట్సప్ ఈ కోడ్ పంపిస్తుంది. సరిగ్గా ఇలాగే మోసగాళ్లు కూడా వాట్సప్ కోడ్, ఓ లింక్ పంపిస్తున్నారు. యూజర్లకు ఈ మోసం గురించి తెలియక క్లిక్ చేస్తున్నారు. బుక్కవుతున్నారు. వారి వాట్సప్ అకౌంట్ హ్యాకర్ల కంట్రోల్‌లోకి వెళ్తోంది. ఫేక్ వెరిఫికేషన్ మెసేజ్ ఆధారంగా యూజర్ల అకౌంట్లను లాక్ చేస్తున్నారు హ్యాకర్లు. ఇక మోసగాళ్లు ఇతరుల వాట్సప్ యాక్సెస్ చేయడం మాత్రమే కాదు మెసేజెస్ చదవొచ్చు. ఫోటోలు డౌన్‌లోడ్ చేయొచ్చు.



Read this: Jan Dhan Account: జన్ ధన్ అకౌంట్లలో రూ.97 వేల కోట్ల డిపాజిట్లు

Whatsapp Scam, WhatsApp verification code, WHATSAPP SCAMMERS, WHATSAPP FAKE VERIFICATION MESSAGES, Telecommunications Authority warning, WhatsApp for Android, వాట్సప్ స్కామ్, వాట్సప్ మోసం, వాట్సప్ ఫేక్ వెరిఫికేషన్ మెసేజ్, వాట్సప్ కోడ్, వాట్సప్ మెసేజెస్
ప్రతీకాత్మక చిత్రం


మొబైల్ యూజర్లు ఎస్ఎంఎస్‌లో వచ్చిన వెరిఫికేషన్ కోడ్ షేర్ చేయొద్దని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దని యూఏఈకి చెందిన టెలీకమ్యూనికేషన్స్ అథారిటీ హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఛీటర్లు... భారతదేశంలోనే ఇదే పద్ధతిలో వాట్సప్ అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారని తెలుస్తోంది. కాబట్టి మీకు ఏవైనా అనుమానాస్పద లింకులు వస్తే క్లిక్ చేయకూడదు.
Loading...
Realme 3 Pro: రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Jio GigaFiber: నెలకు రూ.600 చెల్లిస్తే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ కనెక్షన్

IRCTC: ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ మీరూ కావొచ్చు... వివరాలు ఇవే

Minimum Balance: బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ లెక్కించేది ఇలాగే...
First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...