Home /News /technology /

DONALD TRUMPS TRUTH SOCIAL SOCIAL MEDIA APP NOW AVAILABLE ON IPHONE FEATURES AND MORE GH VB

Donald Trump: యాపిల్ స్టోర్​లో డౌన్​లోడ్​కు ట్రంప్​ ‘ట్రూత్​ సోషల్’ యాప్​.. ట్విట్టర్​కు ధీటైన ఫీచర్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా, ట్రూత్​ సోషల్ పేరుతో ట్విట్టర్​కు ప్రత్యామ్నాయ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ను తీసుకొచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా, ట్రూత్​ సోషల్(Social) పేరుతో ట్విట్టర్​కు ప్రత్యామ్నాయ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ను తీసుకొచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హింసను ప్రేరేపించేలా పోస్టులు చేశారన్న ఆరోపణలతో ట్విట్టర్​ ఆయన ఖాతాను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్​ సొంతంగా ఓ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ను తీసుకొస్తానని ట్విట్టర్​కు సవాల్​ చేశారు. ఎట్టకేలకు నిన్న (ఫిబ్రవరి 21) అర్ధరాత్రి ఈ యాప్​ ఐఓఎస్​ వెర్షన్​ యాపిల్​ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ‘ట్రూత్ సోషల్’ పేరుతో ఇది యాపిల్​ స్టోర్​లో(Apple Store) విడుదలైంది.

ఈ ట్రూత్ సోషల్ యాప్​ ఐఫోన్​ యూజర్లకి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి, యాపిల్​ ఐప్యాడ్​​లో దీన్ని డౌన్​లోడ్​ చేసుకునేందుకు వీలుండదు. ఈ యాప్​ యూజర్లకు నచ్చిన ప్రొఫైల్‌ను సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. యూజర్లు డిస్కవర్ ఫీచర్‌ని ఉపయోగించి ఇతర వ్యక్తుల కోసం సెర్చ్​ చేయవచ్చు. మరోవైపు, ప్లాట్‌ఫారమ్‌లోని ఇతర యూజర్లతో వీడియోలను షేర్ చేసుకోవచ్చు. ట్రూత్ సోషల్ ఇంటర్‌ఫేస్​ ట్విట్టర్‌ని పోలి ఉంటుంది. దాదాపు ట్విట్టర్​తో సమానమైన ఫీచర్లను ఇందులోనూ అందించారు. ట్విట్టర్​ యూజర్​ ఇంటర్‌ఫేస్‌తో దీన్ని రూపొందించారు. అయితే, ట్విట్టర్​లో ట్వీట్లు, రిప్లైస్​, లైక్స్​ మాదిరిగా కాకుండా, దీనిలో ట్రూత్, ట్రూత్స్​ & రిప్లైస్​, మీడియా ఆప్షన్లు ఉంటాయి.

Apple iPhone 13 Mini: యాపిల్​ ఐఫోన్​ 13 మినీపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్​.. అమెజాన్​లో ఏకంగా రూ. 15 వేల వరకు డిస్కౌంట్..


ట్విట్టర్​తో సమానమైన ఫీచర్లు..

ట్రూత్​ సోషల్​ యాప్‌ను డోనాల్డ్ ట్రంప్​కు చెందిన మీడియా హౌజ్ ​‘టీ మీడియా టెక్​ LLC’ డెవలప్​ చేసింది. ట్రూత్ సోషల్ యాప్‌ని ఉపయోగించడానికి మీకు iOS 13 వెర్షన్ లేదా ఆ తర్వాత వెర్షన్‌లో రన్ అవుతున్న ఐఫోన్​ అవసరం. ఈ యాప్ 12.4 MB స్టోరేజ్​ స్పేస్​తో వస్తుంది. దీన్ని యాపిల్​ యాప్​ స్టోర్​ నుంచి ఉచితంగానే డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఐఓఎస్​ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ యాప్​.. రాబోయే వారాల్లో ఆండ్రాయిడ్​ యూజర్లకు సైతం అందుబాటులోకి రానుంది. ప్రతి స్మార్ట్‌ఫోన్ యాప్‌లాగే, ట్రూత్ సోషల్ కూడా యూజర్​ డేటాను యాక్సెస్ చేయగలదు. అయితే, ఈ యాప్ యూజర్ల నుంచి ఎటువంటి డేటా సేకరిస్తుందనే దానిపై యాపిల్​ స్పష్టతనివ్వలేదు. నివేదికల ప్రకారం, ఈ యాప్​ యూజర్ల కాంటాక్ట్ లిస్ట్​లోని సమాచారాన్ని, డివైజ్​లో ఉన్న కంటెంట్‌ని, యూజర్ల బ్రౌజింగ్ హిస్టరీ సేకరించే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: Apple, Donald trump, New apps, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు