ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్ళాక ట్విట్టర్ రోజూ వార్తల్లో నిలుస్తుంది. తరచూ ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువు అవుతుంది. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన మస్క్ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక ఇన్ని రోజులు సజావుగా సాగిన ట్విట్టర్ కార్యకలాపాలు ఇప్పుడు కుదుపులకు లోనవుతుంది. ఉద్యోగులను తొలగించడం, కొత్త ఉద్యోగాలు నిలిపివేయడం వంటి నిర్ణయాలతో వార్తల్లోకెక్కింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు సామూహిక రాజీనామాలు కూడా చేశారు. ఇదిలా ఉంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ట్విట్టర్ ఖాతాను పాత యజమాన్యం శాశ్వతంగా రద్దు చేసింది. అమెరికా అధ్యక్షా ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే కేపిటల్ భవనంపై దాడి జరగడంతో ట్రంప్ (Donald Trump) ఖాతాను నిషేధించారు. ఇక తాజాగా ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
The people have spoken.
Trump will be reinstated. Vox Populi, Vox Dei. https://t.co/jmkhFuyfkv — Elon Musk (@elonmusk) November 20, 2022
ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అనే దానిపై ట్విట్టర్ పోల్..
అయితే డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ట్విట్టర్ ఖాతాను పునరుద్దరించాలా వద్దా అనే అంశంపై ఎలాన్ మస్క్ ట్విట్టర్ పోల్ నిర్వహించారు. ఈ పోల్ లో మెజారిటీ యూజర్లు ట్రంప్ (Donald Trump) ట్విట్టర్ అకౌంట్ ను పునరుద్దరించడం వైపే మొగ్గు చూపారు. ట్రంప్ కు అనుకూలంగా 51.8 శాతం మంది ఓటు వేయగా..48.2 శాతం మంది దీనిని వ్యతిరేకించారు. మొత్తం 1,50,85,458 మంది వినియోగదారులు ఈ పోల్ లో పాల్గొన్నారు. దీనితో ట్రంప్ అకౌంట్ ను పునరుద్దరించినట్టు మస్క్ తెలిపారు. realDonaldTrump అనే అకౌంట్ ఇప్పుడు ట్విట్టర్ లో కనిపిస్తుంది.
Reinstate former President Trump
— Elon Musk (@elonmusk) November 19, 2022
గతంలో వేటు పడిన క్యాథె గ్రిఫిన్, జోర్దాన్ పీటర్సన్, బాబిలోన్ బి అకౌంట్లను కూడా పునరుద్దరించినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. కాగా 2022 జనవరి 6వ తేదీన మద్దతు దారులు, సానుభూతి పరులు ఆ దేశ పార్లమెంట్ భవనంపై దాడి చేశారు. అయితే ఈ ఘటనకు కారణం ట్రంప్ (Donald Trump) చేసిన ట్వీట్లే కారణమని అప్పట్లో ఆయన అకౌంట్ ను పాత యాజమాన్యం బ్లాక్ చేసింది. తాజాగా దాన్ని ఎలాన్ మస్క్ పునరుద్దరించినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Donald trump, Elon Musk, Twitter