అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) కి, ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలకి మధ్య చాలాకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడే ఫేస్‌బుక్ (Facebook), ట్విట్టర్ (twitter) సంస్థలు ట్రంప్ పోస్టులు, వీడియోలను తొలగించాయి. ఇక ఈ ఏడాది జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ (US capital)పై దాడి చేసిన తర్వాత ట్రంప్ ను ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సైట్లు శాశ్వతంగా బ్యాన్ (permanent ban) చేశాయి. అయితే తనను సోషల్ మీడియా కంపెనీలు బహిష్కరించిన తొమ్మిది నెలల తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. సొంతంగా కొత్త మీడియా కంపెనీ (new media company)తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ "ట్రూత్ సోషల్ (Truth Social)"ను లాంచ్ చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు.
గట్టిపోటీ ఇవ్వడానికే..
ఒక లక్ష్యంతో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (Trump Media & Technology Group), ట్రూత్ సోషల్ యాప్ లను లాంచ్ చేయాలని నిర్ణయించినట్టు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. నా నోరు నొక్కేసి.. నా జాతీయ ఎదుగుదలకు ముఖ్య కారణమైన నా సోషల్ మీడియా గొంతుకను తిరస్కరించిన పెద్ద టెక్నాలజీ కంపెనీలకు గట్టిపోటీ ఇవ్వడానికే సొంత సోషల్ నెట్వర్కింగ్ యాప్ (social networking app) తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. " తాలిబన్లు ట్విటర్‌ను యథేచ్ఛగా వాడుతున్న ప్రపంచంలో మనం ఉన్నాం. కానీ అదే ట్విటర్‌లో మీకు ఇష్టమైన అమెరికా అధ్యక్షుడి నోరు నొక్కేశారు. ఇది ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కంపెనీ వ్యాల్యూ 10.7 బిలియన్లు..
Trump Media & Technology గ్రూప్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. టీఎంటీజీని పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీగా మార్చడానికి ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ (TMTG) బ్లాంక్ చెక్ కంపెనీ డిజిటల్ అక్విజిషన్ కార్పొరేషన్ తో విలీనం అవుతుందని ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం టీఎంటీజీ (TMTG) కంపెనీ విలువ 875 మిలియన్ డాలర్లుగా ఉందని.. భవిష్యత్తులో కంపెనీ సంపాదన బట్టి మరో 825 మిలియన్ డాలర్లతో కంపెనీ వ్యాల్యూ 10.7 బిలియన్లకు పెరగొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
ట్రంప్ ను ట్విట్టర్ (Twitter), ఫేస్‌బుక్ (face book) శాశ్వతంగా బహిష్కరించిన సమయం నుంచి తన సొంత సోషల్ మీడియా (social media) సైట్‌ను ప్రారంభిస్తానని చెప్పుకొచ్చారు. ఈ ప్రయత్నంలో భాగంగా తన వెబ్‌సైట్ (website)లో బ్లాగ్‌ను ప్రారంభించారు. కానీ చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ బ్లాగ్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు.
ట్రూత్ సోషల్ యాప్ (truth social app)ను వచ్చే నెలలో కొందరు వ్యక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీఎంటీజీ సంస్థ భావిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ యాప్‌ను యూఎస్ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామింగ్, న్యూస్ (news), పాడ్‌కాస్ట్‌లను అందించే వీడియో-ఆన్-డిమాండ్ (video on demand) సేవను కూడా ప్లాన్ చేస్తున్నట్లు టీఎంటీజీ కంపెనీ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Donald trump, Facebook, New apps, Technology, Twitter