కరోనా మహమ్మారి వల్ల జిమ్‌లు, ఫిట్నెస్ స్టూడియోలు మూసివేశారు. సామాజిక దూరం నిబంధనలు ఉన్న నేపథ్యంలో పార్కులు, ఇతర ఓపెన్ ప్లేస్‌లలో కసరత్తులు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఫిట్నెస్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలు వివిధ యాప్‌ల సాయంతో వ్యాయామాలు చేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో హెల్త్, ఫిట్నెస్ యాప్‌ల డౌన్లోడ్లు ప్రపంచవ్యాప్తంగా 46 శాతం పెరిగినట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెప్టెంబరులో విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. భారత్‌లో ఇలాంటి యాప్‌ల డౌన్లోడ్లు అత్యధికంగా 156 శాతం పెరిగాయని ఆ సంస్థ పేర్కొంది. వీటి ద్వారా దాదాపు 58 మిలియన్ల మంది కసరత్తులు చేస్తున్నారని అంచనా. MoEngage అనే సంస్థ నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
ఇళ్లలో వ్యాయామాలు చేసేందుకు అవసరమైన సామగ్రికి ఖర్చు చేయడం, వర్చువల్ క్లాసులను అనుసరించడానికి బదులుగా ప్రజలు ఫిట్నెస్ యాప్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి యాప్‌లకు ఇంకా ఆధరణ పెరగవచ్చు. వినియోగదారుల అవసరాలకు తగట్టు ఫిట్నెస్ యాప్‌లు వివిధ సేవలను అందిస్తున్నాయి. ఈ జాబితాలో ఉన్న టాప్-5 యాప్‌లు మీకోసం.
Flash Sale: ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ... ఫ్లాష్ సేల్ ఎప్పుడంటే
Amazon Great India Festival: అమెజాన్ సేల్‌లో ఈ 18 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
1. నైకీ ట్రైనింగ్ క్లబ్
నైక్ ట్రైనింగ్ క్లబ్లో సుమారు 190కి పైగా వ్యాయామాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. యోగా, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) వంటి వివిధ రకాల వ్యాయామాలను ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. అవసరమైతే నైక్ మాస్టర్ ట్రైనర్స్ సేవలను ఉపయోగించుకోవచ్చు. మీరు రోజూ చేయాల్సిన కసరత్తుల గురించి దీంట్లో మార్గదర్శకాలు ఉంటాయి. ఈ యాప్‌తో పాటు నైక్ రన్ క్లబ్ కూడా ఫిట్‌నెస్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. Android, iOSల ద్వారా ఈ యాప్‌లు పనిచేస్తాయి.
2. హోమ్ వర్కవుట్ నో ఎక్యూప్మెంట్ యాప్
ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా జిమ్‌లో వర్కవుట్లు చేయాల్సిన అవసరం లేకుండా హోమ్ వర్కవుట్ యాప్ ద్వారా వ్యాయామాలు చేసుకోవచ్చు. ఈ యాప్‌లో శరీర బరువు ఆధారిత వ్యాయామాల(బాడీ వెయిట్ ఎక్ససైజ్లు)ను రూపొందించారు. వీడియోలు, యానిమేటెడ్ గైడ్ సేవల ద్వారా సులభంగా మీకు అవసరమైన కసరత్తులు చేసుకోవచ్చు. శరీరంలోని వివిధ భాగాలకు ప్రత్యేకంగా అవసరమైన వ్యాయామాలు, వాటిల్లో వివిధ స్థాయులను యాప్‌లో పొందుపరిచారు. దీని ద్వారా బిగినర్స్, అడ్వాన్స్డ్ వర్కౌట్లను ఎంచుకోవచ్చు. Android, iOSలతో ఈ యాప్ పనిచేస్తుంది.
3. 30 డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్-వర్కవుట్ ఎట్ హోమ్
ఈ యాప్‌లో రోజువారీ వర్కవుట్ అవసరాలకు తగ్గట్లు ట్రైనింగ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఒక్కొక్క ట్రైనింగ్ ప్లాన్ 30 రోజుల వరకు ఉంటుంది. యానిమేటెడ్ వర్కవుట్ గైడ్స్ ద్వారా సులువుగా కసరత్తులు చేసేలా దీన్ని రూపొందించారు. ఇది మీ ఫిట్నెస్ ప్రోగ్రెస్‌ను రికార్డు చేస్తుంది. రోజువారీ లక్ష్యాలను చేరుకుంటే, వర్కవుట్ల తీవ్రతను క్రమంగా పెంచేలా శిక్షణ ఉంటుంది. దీన్ని కూడా బాడీ వెయిట్ ఆధారిత వ్యాయామాలను దృష్టిలో పెట్టుకునే రూపొందించారు. ఈ యాప్ ద్వారా కసరత్తులు చేయడానికి ఎలాంటి ఫిట్నెస్ సామగ్రి అవసరం లేదు. Android, iOS లలో అందుబాటులో ఉంటుంది.
Redmi Smartphone offers: ఈ రెడ్మీ స్మార్ట్ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్
Realme Smartphone offers: రియల్మీ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డిస్కౌంట్ పొందండిలా
4. సెవెన్ - 7 మినిట్ వర్కవుట్
కోవిడ్19 ప్రభావం వల్ల చాలామంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీంతో అన్ని పనులనూ చక్కబెట్టుకొని ఉద్యోగం చేయడానికే ఉన్న ఖాళీ సమయం అంతా సరిపోతుంది. ఈ బిజీ షెడ్యూల్లో మీ శరీరానికి అవసరమైన వ్యాయామాలను సెవన్ మినిట్స్ వర్కవుట్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. ప్రతిరోజూ కేవలం ఏడు నిమిషాలు అధిక తీవ్రత ఉండే వర్కవుట్లు చేసేలా దీన్ని రూపొందించారు. ఈ యాప్ ద్వారా 200 కంటే ఎక్కువ వ్యాయామాలను ప్రయత్నించవచ్చు. సొంతంగా వర్కవుట్ ప్లాన్‌ను రూపొందించుకోవచ్చు. ర్యాండమ్ వర్కవుట్ ఫీచర్ ద్వారా వివిధ రకాల కసరత్తులు రోజూ చేయవచ్చు. ఇందుకు ఎలాంటి ఫిట్నెస్ సామగ్రి అవసరం లేదు. ఇది కూడా Android, iOSలలో లభిస్తుంది
5. యాప్టీవ్
మ్యూజిక్, ఆడియో బేస్డ్ వర్కవుట్ల వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. సంగీతం వింటూ, కెలొరీలను ఖర్చు చేసే వర్కవుట్లు చేయడం మీకు అలవాటైతే యాప్టివ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆడియో గైడెడ్ వర్కవుట్ యాప్. ఈ యాప్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిట్నెస్ ట్రైనర్ల నుంచి ఆడియో గైడెడ్ వర్కౌట్లు అందుబాటులో ఉంటాయి. యాప్టివ్ ప్లాట్‌ఫాంలో ప్రతి వారం 30 కొత్త క్లాసులను యాడ్ చేస్తారు. దీంట్లో రన్నింగ్, రేస్ ట్రైనింగ్, స్ట్రెన్త్ ట్రైనింగ్, స్ట్రెచింగ్ వంటి వివిధ రకాల వర్కవుట్లకు సంబంధించిన ఆడియో సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ కూడా Android, IOSలలో పనిచేస్తుంది.