Video Games: ఈ షాకింగ్ విషయం తెలిస్తే మీ పిల్లల్ని వీడియో గేమ్స్ ఆడనివ్వరు

Video Games: ఈ షాకింగ్ విషయం తెలిస్తే మీ పిల్లల్ని వీడియో గేమ్స్ ఆడనివ్వరు (ప్రతీకాత్మక చిత్రం)

Video Games | వీడియో గేమ్స్ ఆడుకుంటామంటే మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ ఇస్తున్నారా? ఈ షాకింగ్ విషయం తెలిస్తే మీ పిల్లల్ని వీడియో గేమ్స్ ఆడనివ్వరు.

  • Share this:
కరోనా తరువాత పిల్లలు బయటకు వెళ్లి గడపడం, స్నేహితులతో ఆడుకోవడం కుదరట్లేదు. దీంతో వారికి తల్లిదండ్రులు ఇండోర్ గేమ్స్‌ను అలవాటు చేస్తున్నారు. మహమ్మారి వెలుగు చూసిన తరువాత వీడియో గేమ్స్, ఇతర గేమింగ్ యాక్టివిటీలతో బిజీగా గడుపుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. వీడియో గేమ్స్ వల్ల లాభాలు, నష్టాలను గత పరిశోధనలు విశ్లేషించాయి. హింసాత్మకంగా ఉండే కొన్ని రకాల వీడియో గేమ్స్ పిల్లల్లో హింసను ప్రోత్సహిస్తాయని కొంతమంది తల్లిదండ్రులు నమ్ముతారు. ఇది నిజమే కావచ్చు. కానీ వీడియో గేమ్స్ ఆడేవారిలో సమస్యలు పరిష్కరించే ధోరణి, వివిధ రకాల నైపుణ్యాలు మెరుగుపడతాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

వీడియో గేమ్స్, ఇతర గేమింగ్ విధానాలు పిల్లల మనో వికాసానికి, వారి తెలివితేటలు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. కానీ గేమింగ్ సవాళ్లను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఎక్కువ సమయం గేమింగ్‌ ప్లాట్‌ఫాంలలో గడపడం వల్ల పిల్లలు భావోద్వేగపరమైన సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఈ సమస్యలను గేమింగ్ డిజార్డర్స్ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ డిజార్డర్ తీవ్రమైన సమస్యగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో తెలిపింది. గేమింగ్ అలవాట్లు పిల్లల్లో ఎపిలెప్సీ (epilepsy) అనే మెదడు సంబంధ అనారోగ్యానికి కారణమవుతోందని ఆ సంస్థ పేర్కొంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరించింది.

WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్ చాలా ముఖ్యం... వెంటనే మార్చేయండి

Free Wifi: రైల్వే స్టేషన్‌లో వైఫై ఫ్రీగా పొందండి ఇలా

ఎపిలెప్సీ అంటే ఏంటి?


ఎపిలెప్సీ అనేది ఒక నాడీ సంబంధ వ్యాధి. మెదడులో సహజంగా ఉండే ఎలక్ట్రికల్ యాక్టివిటీలో లోపాలు ఏర్పడటాన్ని ఎపిలెప్సీ అంటారు. దీని బారిన పడిన పిల్లలు తరచుగా మూర్ఛపోతారు. మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిటర్ల అసమతుల్యత వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. పిల్లలు, మహిళలు ఈ సమస్య బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితికి నిర్ధిష్టమైన చికిత్స అందుబాటులో లేదు. కానీ ఈ వ్యాధి లక్షణాలను, ప్రతికూల ప్రభావాలను కొన్ని రకాల మందులతో కట్టడి చేయవచ్చు.

వీడియో గేమ్స్‌ ఎపిలెప్సీకి కారణమవుతాయా?


వీడియో గేమ్స్ ఆడేటప్పుడు మూర్ఛలు వచ్చే ప్రమాదాలకు, ఎపిలెప్సీ వ్యాధికి సంబంధం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. కానీ ఫోటోసెన్సిటివ్ ఎపిలెప్సీతో బాధపడుతున్న వ్యక్తుల్లో వీడియో గేమ్స్ ఆడేటప్పుడు మూర్ఛలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్లాషింగ్ లైట్లు, వైబ్రెంట్ ప్యాటర్న్, కాంట్రాస్టింగ్ వల్ల మూర్ఛలు రావడాన్ని ఫోటోసెన్సిటివ్ ఎపిలెప్సీ అంటారు. ఫ్లాషింగ్ లైట్లు, వైబ్రెంట్ ప్యాటర్న్, ఇతర లక్షణాలన్నీ వీడియో గేమ్స్ ఆడేటప్పుడు ఎదురవుతాయి. అంటే ఈ రెండింటికీ సంబంధం ఉన్నట్లు భావించాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రకమైన ఎపిలెప్సీని 'వీడియో గేమ్ ఇండ్యూజ్డ్ సీజర్స్‌' (VGS) అంటారు.

Poco X3 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎక్స్3 ప్రో వచ్చేసింది... ధర ఎంతంటే

Poco M3: నిమిషానికి 8 ఫోన్లు అమ్మిన పోకో ఇండియా... ఈ ఫోన్ ఎందుకంత స్పెషల్?

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


వీడియో గేమ్స్ ఆడేటప్పుడు మూర్ఛ వస్తే, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ఎవరికైనా మూర్ఛ వచ్చినప్పుడు శరీర కండరాలు బిగుతుగా మారుతాయి. మూత్రాశయం నియంత్రణ కోల్పోవడం, అపస్మారక స్థితిలో ఉండటం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు... వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఒకసారి ప్రారంభమైన మూర్ఛను ఆపలేం. కానీ ఒకవేళ ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు మూర్ఛలు ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి. మూర్ఛ వచ్చినప్పుడు బాధితులకు శ్వాస ఆడేలా చూడాలి. వారి తలను శరీరానికి సమాతరంగా ఉంచి, సరిగ్గా ఊపిరి తీసుకునే అవకాశం కల్పించాలి. ఆ సమయంలో వారికి నీరు తాగించడం, తినిపించడం వంటివి చేయకూడదు. మూర్ఛ వచ్చినవారి శరీరానికి గాయాలు కాకుండా చూడాలి. ఆ సమయంలో వారి కాళ్లు చేతులు కొట్టుకుంటాయి. అలాంటప్పుడు వారిని బలవంతంగా నేలపై అదిమి ఉంచకూడదు.
Published by:Santhosh Kumar S
First published: