Smartphone Tips: కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నారా? ఫోన్ నెంబర్స్ ఇలా ట్రాన్స్‌ఫర్ చేయండి

Smartphone Tips: కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నారా? ఫోన్ నెంబర్స్ ఇలా ట్రాన్స్‌ఫర్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Smartphone Tips | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నారా? పాత మొబైల్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌కు కాంటాక్ట్స్ (Transfer Contacts) ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్న తర్వాత పాత మొబైల్ నుంచి డేటా, కాంటాక్ట్స్, ఫైల్స్ ఎలా ట్రాన్స్‌ఫర్ (File Transfer) చేయాలన్న అనుమానం చాలామందిలో ఉంటుంది. ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఒకప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ (Third Part Apps) వాడాల్సిన అవసరం ఉండేది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఈ ఫీచర్స్‌ని తమ మొబైల్స్‌లో అందిస్తున్నాయి. గూగుల్ కూడా యూజర్లు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండా తమ డేటాను, ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్‌ని అందిస్తోంది. ఆ ఫీచర్స్‌తో సులువుగా డేటా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో ఏఏ యాప్స్ ఉన్నాయో వాటన్నింటినీ కొత్త ఫోన్‌లో వాడుకోవచ్చు. మరి ఇకపై మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు ఈ ఫీచర్స్‌ని వాడుకోండి. మరి పాత మొబైల్‌లోని కాంటాక్ట్స్‌ని (Contacts Transfer) కొత్త స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

    Mi 11x 5G: ఎస్‌బీఐ కార్డు ఉందా? రూ.27,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.5,399 ధరకే కొనండి ఇలా

    Transfer Contacts Online: ఆన్‌లైన్‌లో కాంటాక్ట్ నెంబర్స్ ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా


    Step 1- ముందుగా మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
    Step 2- అందులో అకౌంట్స్‌లో గూగుల్ అకౌంట్ క్లిక్ చేయండి
    Step 3- ఆ తర్వాత Sync పైన క్లిక్ చేయండి.
    Step 4- కింద ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేసి Sync now పైన క్లిక్ చేయండి.
    Step 5- కాంటాక్ట్స్‌తో పాటు క్యాలెండర్, డ్రైవ్, జీమెయిల్, కీప్ నోట్స్ లాంటివన్నీ సింక్ అవుతాయి.
    Step 6- ఆ తర్వాత మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ అకౌంట్ లాగిన్ చేయండి.
    Step 7- పైన చెప్పిన సెట్టింగ్స్ ప్రకారం Sync now పైన క్లిక్ చేయండి.
    Step 8- మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫోన్ నెంబర్స్ అన్నీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చేస్తాయి.

    Airtel New Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ వచ్చేశాయి

    Transfer Contacts Offline: ఆఫ్‌లైన్‌లో కాంటాక్ట్ నెంబర్స్ ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా


    Step 1- ఆఫ్‌లైన్‌లో కాంటాక్ట్ నెంబర్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే మీ కాంటాక్ట్స్ యాప్ ఓపెన్ చేయండి.
    Step 2- ఆప్షన్స్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
    Step 3- Export పైన క్లిక్ చేయండి.
    Step 4- మీరు ఏఏ కాంటాక్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేయాలో ఆ కాంటాక్ట్స్ సెలెక్ట్ చేయండి.
    Step 5- Export to .vcf ఆప్షన్ క్లిక్ చేయండి.
    Step 6- ఎక్కడ సేవ్ చేయాలో ఫోల్డర్ సెలెక్ట్ చేయాలి.
    Step 7- మీరు సేవ్ చేసిన ఫైల్‌ను బ్లూటూత్, ఇమెయిల్, వాట్సప్ ద్వారా కొత్త స్మార్ట్‌ఫోన్‌కు పంపాలి.
    Step 8- కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫైల్ డౌన్‌లోడ్ చేయాలి.
    Step 9- ఆ తర్వాత కాంటాక్ట్స్ యాప్ ఓపెన్ చేయాలి.
    Step 10- Import పైన క్లిక్ చేసి మీరు ఫైల్‌ని సెలెక్ట్ చేయాలి.
    Step 11- కాంటాక్ట్స్ అన్నీ ఇంపోర్ట్ అవుతాయి.

    మీరు ఏ మోడల్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నా ఇదే పద్ధతిలో కాంటాక్ట్స్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇది కాకుండా మొత్తం ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే మీరు కొత్త మొబైల్ రీసెట్ చేసే సమయంలోనే Transfer Files from Old Android Phone అనే మెసేజ్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఫైల్స్, డేటా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: