క్యూఆర్ కోడ్... ఇది ఇటీవల బాగా పాపులర్ అవుతున్న టెక్నాలజీ. కొంత సమాచారాన్ని ఓ కోడ్ రూపంలో భద్రపరిచేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ కోడ్ స్కాన్ చేస్తే అందులో సమాచారం తెలుస్తుంది. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. ఎక్కడైనా షాపింగ్ చేసినప్పుడు పేమెంట్ చేయడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం మామూలే. ఇటీవల విజిటింగ్ కార్డులు కూడా క్యూఆర్ కోడ్ రూపంలో వస్తున్నాయి. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అందులోని సమాచారం కనిపిస్తుంది. వాట్సప్ వెబ్ లాగిన్ కావాలాన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.ఇక పేమెంట్స్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు ఆ క్యూఆర్ కోడ్‌కు లింక్ అయిన ఉన్న అకౌంట్లోకి వెళ్తాయి. వ్యాపారుల దగ్గర అమెజాన్ పే, పేటీఎం, ఫోన్‌పే లాంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్స్‌కు పేమెంట్ చేయడానికి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఫ్లైట్ టికెట్ డీటెయిల్స్, ఆన్లైన్ ఆర్డర్ ట్రాకింగ్ డీటైల్స్ తెలుసుకోవడానికి కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ క్యూఆర్ కోడ్ భిన్నంగా ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎలాగో తెలుసుకోండి.
Camera App: స్మార్ట్‌ఫోన్ కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. కెమెరాతోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ఈజీ. చాలావరకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ కెమెరా యాప్ లోనే క్యూఆర్ కోడ్ స్కానర్‌ను ఇంటిగ్రేట్ చేస్తున్నాయి. కెమెరా ఓపెన్ చేయడానే క్యూఆర్ కోడ్ ఐకాన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి స్కాన్ చేస్తే చాలు.
Android Feature: స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్... ఇక స్క్రీన్‌షాట్ తీయండి ఇలా
Oppo F17: రూ.16,990 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.1,990 ధరకే... ఎక్స్ఛేంజ్ ఆఫర్ వివరాలివే
Google Lens App: మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ లెన్స్ యాప్ ఉంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 8 కన్నా ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ఫోన్లలో ఈ ఫీచర్ పనిచేస్తుంది. గూగుల్ లెన్స్ యాప్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది.
QR code-scanning App: గతంలో అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు దాదాపు అన్ని స్మార్ట్ఫోన్లలో క్యూఆర్ కోడ్ యాప్ ఉంటోంది. ఈ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు.
Smartphones Under Rs 10,000: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Telegram: టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన 12 కొత్త ఫీచర్స్ ఇవే
Third Party App: ఒకవేళ మీరు పాత వర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్టైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్లేస్టోర్‌లో క్యూఆర్ కోడ్ స్కానర్, క్యూఆర్ కోడ్ స్కానర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి.
మీరు ఏ యాప్ డౌన్లోడ్ చేసినా, డిఫాల్ట్ యాప్ ఉపయోగించినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ప్రాసెస్ దాదాపుగా ఒకేలా ఉంటుంది. అయితే పేమెంట్స్ చేయడానికి ఆ పేమెంట్ యాప్‌లోని క్యూఆర్ కోడ్ స్కాన్ ఉపయోగించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Android 10, Android 11, Android 12, Mobile, Mobile App, Mobile News, Mobiles, Playstore, Smartphone, Smartphones