హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Personal Information: గూగుల్ నుంచి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిమూవ్ చేయాలంటే.. ఈ స్టెప్స్ ఫాల్ అవ్వండి..

Google Personal Information: గూగుల్ నుంచి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిమూవ్ చేయాలంటే.. ఈ స్టెప్స్ ఫాల్ అవ్వండి..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

గూగుల్ వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని (Personally Identifiable Information-PII) తీసివేస్తామని తాజాగా ప్రకటించింది. డాక్సింగ్ (Doxxing) అయిన ఇన్ఫర్మేషన్‌ను కూడా రిమూవ్ చేస్తామని గూగుల్ తెలిపింది.

మన పేరు, అడ్రస్(Address), ఫోన్ నంబర్(Phone Number), ఈ-మెయిల్ అడ్రస్(E Mail Address), క్రెడిట్ కార్డు నంబర్(Credit Card Number) వంటి వ్యక్తిగత సమాచారం గూగుల్ (Google) వంటి సెర్చ్ ఇంజన్ల రిజల్ట్స్‌లో(Results) కనిపిస్తే చాలా ప్రమాదం. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అందరికీ కనిపిస్తే ఐడెంటిటీ తెఫ్ట్, బ్యాంకింగ్ మోసం వంటివి జరిగే ప్రమాదముంది. అయితే ఈ ప్రమాదాలను గుర్తించిన గూగుల్(Google) వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని (Personally Identifiable Information-PII) తీసివేస్తామని తాజాగా ప్రకటించింది. డాక్సింగ్ (Doxxing) అయిన ఇన్ఫర్మేషన్‌ను కూడా రిమూవ్ చేస్తామని గూగుల్ తెలిపింది. డాక్సింగ్(Doxing) అంటే ఎవరైనా ఇతరులకు హాని చేయాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ఇన్ఫర్మేషన్(Private Information) లేదా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్(Contact Information) ఇంటర్నెట్ లో షేర్ చేయడం. మరి మనం వ్యక్తిగత సమాచారం గూగుల్ రిజల్ట్స్ నుంచి ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Shocking: వీడిని ఏం చేసినా పాపం లేదు..సొంత చెల్లెళ్లపై అత్యాచారం..అడ్డొచ్చిన కన్న తల్లిని కూడా..

పర్సనల్లీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ తీసివేయడానికి ముందు నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ప్రతి రిక్వెస్ట్‌ను మూల్యాంకనం చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ రిమూవల్ ప్రాసెస్‌లో భాగంగా, గూగుల్ అన్ని సెర్చెస్ లో అందించిన యూఆర్ఎల్స్ (URLs) నుంచి మీ ఇన్ఫర్మేషన్ రిమూవ్ చేయవచ్చు. లేదా మీ పేరుతో ఉన్న యూఆర్ఎల్స్ (URLs)ని రిజల్ట్స్ నుంచి తీసివేయవచ్చు. అలానే ఇన్ఫర్మేషన్ రిమూవ్ చేయాలని మీరు పెట్టుకున్న రిక్వెస్ట్‌ను గూగుల్ తిరస్కరించవచ్చు. PII వివరాలు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ నుంచి మాత్రమే రిమూవ్ అవుతాయి కానీ ఇంటర్నెట్ నుంచి రిమూవ్ కావని గమనించాలి. అలానే గూగుల్ ప్రకారం, మీ రిక్వెస్ట్ నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే మీ ఇన్ఫర్మేషన్ రిమూవ్ అవుతుంది.

* పర్సనల్లీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం రిమూవ్ అవుతుంది

- యూఎస్ సోషల్ సెక్యూరిటీ నంబర్, అర్జెంటీనా సింగిల్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ వంటి ప్రైవేట్ గవర్నమెంట్ ఐడెంటిటీ (ID) నంబర్లు.

- బ్యాంక్ అకౌంట్ నంబర్లు

- క్రెడిట్ కార్డ్ నంబర్లు

- హ్యాండ్ రిటెన్ సిగ్నేచర్ కి సంబంధించిన ఇమేజెస్

- ఐడీ డాక్స్ ఇమేజెస్

- వైద్య రికార్డుల వంటి వ్యక్తిగత, అధికారిక రికార్డులు

- ఫిజికల్ అడ్రస్, ఫోన్ నంబర్లు ఈమెయిల్ అడ్రస్ వంటి పర్సనల్ కాంటాక్ట్ ఇన్ఫో

- కాన్ఫిడెన్షియల్ లాగిన్ క్రెడెన్షియల్

* డాక్సింగ్ కంటెంట్‌ను గూగుల్ ఎప్పుడు రిమూవ్ చేస్తుంది

మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, స్పష్టమైన లేదా అపరిచిత వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చినప్పుడు, హాని కలిగించే లేదా వేధించే స్పష్టమైన లేదా అపరిచిత కాల్స్ వచ్చినప్పుడు రిమూవ్ చేస్తుంది.

మీరైనా లేదా ఒక అథారైజ్డ్ రిప్రజెంటేటివ్ సాయంతోనైనా మీ కంటెంట్‌ను చూపించే లింక్‌లను గూగుల్ సెర్చ్ నుంచి రిమూవ్ చేయమని రిక్వెస్ట్ చేయవచ్చు.

* PII లేదా doxxing రిమూవ్ రిక్వెస్ట్‌ను ఎలా సబ్మిట్ చేయాలి

- రిక్వెస్ట్‌ ఫారమ్‌ను ఓపెన్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(https://support.google.com/websearch/troubleshooter/9685456#ts=2889054%2C2889099).

- ఇక్కడ, మీరు మూడు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.

Viral Video : ఇంగ్లీష్ మాట్లాడే వాడినే పెళ్లి చేసుకుంటా..పీటలపై వరుడికి షాక్ ఇచ్చిన వధువు

- మీరు ఏం చేయాలనుకుంటున్నారు?

- మీరు రిమూవ్ చేయాలనుకుంటున్న సమాచారాన్ని మీరు ఎక్కడ చూశారో మాకు తెలియజేయండి.

- మీరు తీసివేయాలనుకుంటున్న సమాచారం ఏదో పేర్కొనాలి.

- అవసరమైన మొత్తం సమాచారాన్ని ఫిల్ చేసి ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ వంటి పర్సనల్ డీటెయిల్స్ అందించాలి.

రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేశాక ఆటోమేటెడ్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ అందుతుంది. తర్వాత, గూగుల్ మీ రిక్వెస్ట్‌ను పరిశీలించి, మీరు చెప్పిన కారకాలపై మూల్యాంకనం చేస్తుంది. అది పై ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చెక్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, గూగుల్ మరిన్ని వివరాలను అందించమని అది అడగవచ్చు. ప్రతిదీ పూర్తయిన తర్వాత, ఈమెయిల్ నోటిఫికేషన్ అందుతుంది. మీ రిక్వెస్ట్ రిజెక్ట్ అయితే, అందుకు కారణమేంటో గూగుల్ మీకు క్లుప్త వివరణ ఇస్తుంది. ఆ వివరణ ప్రకారం మీరు మళ్లీ సరైన రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. రిక్వెస్ట్ అప్పుడు అయితే URLs గూగుల్ సెర్చ్ ఇండెక్స్ నుంచి రిమూవ్ అవుతాయి.

Published by:Veera Babu
First published:

Tags: Google, Google Chat, Tech news

ఉత్తమ కథలు