హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Browsing: సేఫ్ బ్రౌజింగ్ చేయాల‌నుకొంటున్నారా.. అయితే ఇలా చేయండి

Google Browsing: సేఫ్ బ్రౌజింగ్ చేయాల‌నుకొంటున్నారా.. అయితే ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మ‌నం నిత్యం ప‌లు అంశాల స‌మాచారం కోసం బ్రౌజింగ్ (Browsing) చేస్తుంటాం. ఏ వెబ్‌సైట్‌ మాటున ఏ మాల్‌ వేర్‌ ఉందో, ఏ ఎక్స్‌టెన్షన్‌ వెనుక ఏ వైరస్‌ ఉందో, ఏ ఇమేజ్‌ కోడింగ్‌.. ఏ యాడ్‌ వేర్‌ ఉందో ఎవరికీ తెలియడం లేదు. ఈ నేప‌థ్యంలో మీ బ్రౌజ‌ర్‌ సేఫ్‌గా ఉందో లేదో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

బ్రౌజింగ్ (Browsing).. మ‌న జీవితంలో భాగంగా మారింది. ఇంటర్నెట్‌లో మ‌నం బ్రౌజ్‌చేసే స‌మాచారం అంతా సురక్షితం కాదు. మ‌నం ఏదైనా తెలియ‌కుండా వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే అందులో ఏ మాల్‌ వేర్‌ ఉందో, ఏ ఎక్స్‌టెన్షన్‌ (Extension) వెనుక ఏ వైరస్‌ ఉందో, ఏ ఇమేజ్‌ కోడింగ్‌ ఏ యాడ్‌ వేర్‌ ఉందో ఎవరికీ తెలియడం లేదు. ఈ నేప‌థ్యంలో మ‌నం సేఫ్ బ్రౌజింగ్ (Safe Browsing) చేయాలి. లేకుంటే మ‌న ఫోన్ హ్యాక‌ర్ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. మ‌న‌కు తెలియ‌కుండా ఏదైనా ఎక్స్‌టెన్ష‌న్ ఇన్‌స్టాల్ (Install) చేసుకొంటే అది మ‌న పూర్తి స‌మాచారాన్ని దొంగిలించే అవ‌కాశం ఉంది. మ‌నం ఎక్కువ‌గా వాడేది గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్ ఈ నేప‌థ్యంలో మ‌నం ఎటువంటి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాలో తెలుసుకొందాం.

మ‌నం మ‌న గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌ను ఎలా వినియోగించాలి.. ఎలా ఉంటే సేఫ్‌గా ఉంటుందో తెలుసుకొందాం. ఎందుకంటే మ‌న‌లో చాలా మంది క్రోమ్ బ్రౌజ‌ర్ వాడ‌తాం.

Step 1 : ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి.

Step 2 : వ‌చ్చిన పేజీపై కుడివైపు పై భాగంలో త్రీడాట్స్‌పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

Geomagnetic storm: అయ‌స్కాంత తుఫాను భూమిని తాక‌నుందా?


Step 3 : లిస్ట్‌లో కింది భాగంలో "About Chrome" ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అక్క‌డ మీరు వాడుతున్న క్రోమ్ బ్రౌజ‌ర్ వ‌ర్ష‌న్ తెలుపుతుంది.

Step 4 : మీరు వాడుతున్న వ‌ర్ష‌న్ 94.0.4606.61 ఉంటే మీరు వాడే బ్రౌజర్‌ సురక్షితంగా ఉన్నట్లు లేదంటే వెంట‌నే మీ క్రోమ్‌ను అప్డేట్ చేయాలి. లేదంటే మీ బ్రౌజింగ్ సేఫ్ కాద‌ని అర్థం.

ఎన్‌హ్యాన్స్‌డ్‌ సేఫ్‌ బ్రౌజింగ్ ఆప్ష‌న్‌..

మ‌నం సేఫ్‌గా బ్రౌజింగ్ చేయాలంటే మ‌రో ఆప్ష‌న్ ఎన్‌హ్యాన్స్‌డ్‌ సేఫ్‌ బ్రౌజింగ్ (Enhanced Safe Browsing) ఈ ఫీచ‌ర్ వాడ‌డం వ‌ల్ల ఏదైనా స‌మ‌స్యాత్మ‌క ఎక్స్‌టెన్షన్ మ‌న‌కు తెలియ‌కుండా ఉంటే వెంట‌నే అల‌ర్ట్ మెసేజ్ ఇస్తుంది. దీని ద్వారా సుర‌క్షితంగా బ్రౌజింగ్ చేయ‌వ‌చ్చు. ఎన్‌హ్యాన్స్‌డ్‌ సేఫ్‌ బ్రౌజింగ్‌ ఆప్షన్‌ ఎలా యాక్టివ్‌ చేయాలంటే ముందు క్రోమ్‌ బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ప్రైవసీ (Privacy) అండ్ సెక్యూరిటీ సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో సెక్యూరిటీ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే సేఫ్‌ బ్రౌజింగ్‌ అనే సెక్షన్‌లో ఎన్‌ హ్యాన్స్‌డ్‌ ప్రొటక్షన్‌ (Protection) అని ఉంటుంది. దాన్ని యాక్టివ్‌ చేసుకుంటే సరి. లేదంటే సెట్టింగ్స్‌ (Settings) లోకి వెళ్లి పైన సెర్చ్‌లో ఎన్‌హ్యాన్స్‌డ్‌ ప్రొటక్షన్‌ అని సెర్చ్‌ చేయాలి. ఆ తర్వాత ఎనేబుల్ చేసుకోవడమే.

First published:

Tags: Google, Google news, Google Play store, Google search

ఉత్తమ కథలు