Home /News /technology /

DO YOU WANT TO BUY AIR COOLER IN THIS SUMMER KNOW ABOUT WATER CAPACITY TYPES AND FEATURES SS

Air Cooler: సమ్మర్‌లో ఎయిర్ కూలర్ కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి

Air Cooler: సమ్మర్‌లో ఎయిర్ కూలర్ కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Air Cooler: సమ్మర్‌లో ఎయిర్ కూలర్ కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Air Cooler Tips | మీరు సమ్మర్‌లో ఎయిర్ కూలర్ కొనాలనుకుంటున్నారా? వాటర్ కెపాసిటీ ఎంతుండాలి? ఎలాంటి కూలర్ సెలెక్ట్ చేయాలి? ఏఏ ఫీచర్స్ ఉండాలి? తెలుసుకోండి.

    సమ్మర్ వచ్చేసింది. ఎండలు ఇప్పుడే భగ్గుమంటున్నాయి. ఇక ఏప్రిల్, మేలో ఎండలు (Summer Effect) మరింత మండిపోనున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో ఎయిర్ కండీషనర్లు (AC), ఎయిర్ కూలర్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్లాన్లకు డిమాండ్ పెరిగింది. మరి మీరు కూడా వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం వేసవిలో ఎయిర్ కూలర్ (Air Cooler) కొనాలనుకుంటున్నారా? ఎయిర్ కూలర్ కొనే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎయిర్ కూలర్ కొనే ముందు మీ గది సైజ్, వాటర్ ట్యాంక్ కెపాసిటీ లాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మీరు మార్కెట్‌లో కొనాలనుకున్నా, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలన్నా మీ అవసరాలకు సరిపడా ఎయిర్ కూలర్ సెలెక్ట్ చేయాలి. మరి మీకు ఎలాంటి ఎయిర్ కూలర్ అయితే బాగుంటుందో, కూలర్ కొనే ముందు ఏఏ అంశాలు చెక్ చేయాలో తెలుసుకోండి.

    ఎయిర్ కూలర్ టైప్


    ఏసీల్లో రకాలు ఉన్నట్టుగానే ఎయిర్ కూలర్‌లో కూడా వేర్వేరు రకాలుంటాయి. పర్సనల్ కూలర్, విండో కూలర్, డిసర్ట్ కూలర్ అని వేర్వేరుగా ఉంటాయి. మీ గది చిన్నగా ఉన్నా, ఇంట్లో ఒకరిద్దరు మాత్రమే ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేప్పుడు ఉపయోగించాలన్నా పర్సనల్ కూలర్ చాలు. ఈ చిన్న కూలర్ 200 నుంచి 300 స్క్వేర్ ఫీట్ గదిని కవర్ చేస్తుంది.

    ఇక బెడ్‌రూమ్‌లో లేదా హాల్‌లో కిటీకీ దగ్గర్లో పెట్టాలనుకుంటే విండో ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. ఇది పర్సనల్ కూలర్ కన్నా కాస్త పెద్దదిగా ఉంటుంది. ఇక మీ రూమ్ సైజ్ పెద్దగా ఉంటే డిసర్ట్ కూలర్ తీసుకోవడం మేలు. డిసర్ట్ కూలర్ పెద్ద గది మొత్తాన్ని కవర్ చేస్తుంది.

    Rent AC Online: సమ్మర్ కోసం ఏసీ కొంటారా? ఆన్‌లైన్‌లో అద్దెకు తీసుకోండిలా

    వాటర్ కెపాసిటీ


    కూలర్ ఎంచుకునే సమయంలో వాటర్ కెపాసిటీ కూడా చూడాలి. చిన్న రూమ్‌కు 15 నుంచి 25 లీటర్లు, మీడియం సైజ్ గదికి 25 నుంచి 40 లీటర్లు, పెద్ద హాల్ కోసం 40 లీటర్ల కన్నా ఎక్కువ వాటర్ కెపాసిటీ ఉన్న కూలర్ ఎంచుకోవాలి. కూలర్‌కు ఆటో ఫిల్ ఆప్షన్ ఉంటే మంచిది. కూలర్‌లో నీళ్లు అయిపోగానే మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ట్యాప్ కనెక్షన్ ఇచ్చి వదిలేస్తే ఆటోమెటిక్‌గా నీళ్లు వస్తాయి. కొన్ని కూలర్లలో ఐస్ ఛాంబర్స్ కూడా ఉంటాయి. ఎక్కువ చల్లగా గాలి కావాలనుకుంటే ఐస్ ఛాంబర్స్‌లో ఐస్ క్యూబ్స్ వేస్తే సరిపోతుంది.

    కూలర్ సౌండ్


    కూలర్ నుంచి వచ్చే సౌండ్ నిద్రను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అందుకే నాయిస్ లెవెల్ ఎంతో చెక్ చేయాలి. తక్కువ సౌండ్ వచ్చే కూలర్ తీసుకోవాలి. కూలర్ నుంచి సౌండ్ ఎంత వస్తుందో తెలుసుకోవడానికి షోరూమ్‌కు వెళ్లి డెమో చూడొచ్చు.

    Aadhaar Card Update: మీ ఆధార్ కార్డులో ఈ వివరాలు లేకపోతే ఇబ్బందులు తప్పవు

    ఇతర ఫీచర్స్


    బేసిక్ ఎయిర్ కూలర్ కన్నా కాస్త ఎక్కువ ఫీచర్స్ ఉన్న కూలర్ తీసుకోవడం మంచిది. కూలర్ ప్యాడ్స్ విషయానికి వస్తే హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్, వూల్ వుడ్, యాస్పెన్ ప్యాడ్స్ ఉంటాయి. హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఉన్న కూలర్లకు డిమాండ్ ఎక్కువ. మీ ఏరియాలో పవర్ కట్స్ ఎక్కువగా ఉన్నా, మీరు ఇన్వర్టర్ వాడుతున్నా ఇన్వర్టర్ టెక్నాలజీ సపోర్ట్ చేసే ఎయిర్ కూలర్ ఎంచుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Summer

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు