WhatsApp Messages: వాట్సప్‌లో ముఖ్యమైన మెసేజెస్ సేవ్ చేయండి ఇలా

WhatsApp Messages: వాట్సప్‌లో ముఖ్యమైన మెసేజెస్ సేవ్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Messages | వాట్సప్‌లో ముఖ్యమైన మెసేజెస్‌ని సేవ్ చేసుకోవడానికి ఓ ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.

  • Share this:
    వాట్సప్... ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కమ్యూనికేషన్‌కు చాలా ముఖ్యమైన ప్లాట్‌ఫామ్‌గా వాట్సప్ మారిపోయింది. అయితే వాట్సప్ గ్రూప్స్‌లో సర్క్యులేట్ అయ్యే రొటీన్ మెసేజెస్ పక్కన పెడితే, ముఖ్యమైన మెసేజెస్ కూడా వాట్సప్‌లో వస్తుంటాయి. వాటిని దాచుకోవడం యూజర్లకు ఓ పెద్ద టాస్క్. కుప్పలుతెప్పలుగా వచ్చే వాట్సప్ మెసేజెస్‌లో ముఖ్యమైనవి కనిపించకుండా పోతుంటాయి. ఎప్పుడైనా అవసరం అయినప్పుడు వాటిని వెతుక్కోవడం ఓ పెద్ద కష్టమే. ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంది. మీరు ముఖ్యం అనుకునే వాట్సప్ మెసేజెస్‌ని దాచుకోవచ్చు. అవసరమైనప్పుడు వెతుక్కోవాల్సిన పనిలేకుండా వాటిని ఈజీగా చూడొచ్చు. ఇందుకోసం వాట్సప్ ఓ మంచి ఫీచర్ అందించింది. మరి మీకు కావాల్సిన ఇంపార్టెంట్ మెసేజెస్ ఎలా బుక్ మార్క్ చేయాలి? వాటిని ఎక్కడ చూడాలి? తెలుసుకోండి.

    SBI New Feature: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... వెంటనే ఈ ఫీచర్ వాడుకోండి

    Oppo Reno 6 5G: ఒప్పో రెనో 6 సేల్ మొదలైంది... రూ.3,000 డిస్కౌంట్ పొందండి ఇలా

    ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి. అందులో మీరు బుక్ మార్క్ చేయాలనుకునే మెసేజ్ ఉన్న ఛాట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీరు సేవ్ చేయాలనుకునే మెసేజ్‌పై ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. ఆ తర్వాత స్టార్ పైన క్లిక్ చేయండి. ఇలా ముఖ్యమైన మెసేజెస్ అన్నీ బుక్ మార్క్ చేయండి. ఆ తర్వాత మీరు వాట్సప్ ఓపెన్ చేసి త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి. అందులో Starred messages ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. అందులో మీరు సేవ్ చేసిన మెసేజెస్ అన్నీ కనిపిస్తాయి. మీరు సేవ్ చేసిన మెసేజ్ ఇక అవసరం లేదనుకుంటే అన్‌స్టార్ చేయొచ్చు. అంటే బుక్ మార్క్ తొలగించొచ్చు. ఇందుకోసం మెసేజ్‌ని ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. ఆ తర్వాత అన్‌స్టార్ చేయాలి.

    Vivo V19: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి

    Airtel Plans: రూ.299 నుంచి ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ తెలుసుకోండి

    ఇలా ముఖ్యమైనవి కనిపించే మెసేజెస్‌ని వెంటనే బుక్ మార్క్ చేస్తే ఎప్పుడు కావాలన్నా స్టార్డ్ మెసేజెస్‌లో చూడొచ్చు. ఈ ఫీచర్ ద్వారా మెసేజ్ మాత్రమే కాదు ఫోటోలు, వీడియోలు, ఇతర డాక్యుమెంట్ ఫైల్స్, ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోవచ్చు. మీరు సేవ్ చేసిన మెసేజెస్ అన్నీ ఒకే దగ్గర కనిపిస్తాయి. వేర్వేరు ఛాట్స్‌లో మెసేజెస్ సేవ్ చేసినా ముఖ్యమైన మెసేజెస్ ఒకే దగ్గర ఉంటాయి.
    Published by:Santhosh Kumar S
    First published: