Home /News /technology /

DO YOU WANT 2GB MOBILE DATA DAILY RELIANCE JIO OFFERS PREPAID RECHARGE PLANS FROM RS 249 SS

Jio Daily 2GB Plans: రోజూ 2జీబీ డేటా వాడతారా? జియో నుంచి ఈ ప్లాన్స్ మీకోసమే

Jio Daily 2GB Plans: రోజూ 2జీబీ డేటా వాడతారా? జియో నుంచి ఈ ప్లాన్స్ మీకోసమే
(ప్రతీకాత్మక చిత్రం)

Jio Daily 2GB Plans: రోజూ 2జీబీ డేటా వాడతారా? జియో నుంచి ఈ ప్లాన్స్ మీకోసమే (ప్రతీకాత్మక చిత్రం)

Jio Daily 2GB Plans | రోజూ 2జీబీ డేటా కోరుకునేవారి కోసం రిలయన్స్ జియో రూ.249 నుంచి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Jio Prepaid Recharge Plans) అందిస్తోంది. కొన్ని ప్లాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.

ఇంకా చదవండి ...
ఒకప్పుడు మొబైల్ డేటాను చాలా జాగ్రత్తగా వాడుకునేవారు. కానీ రిలయన్స్ జియో (Reliance Jio) ఎంట్రీతో మొబైల్ డేటా ధరలు భారీగా తగ్గాయి. జియో చవకగా మొబైల్ డేటాను ఇవ్వడంతో స్మార్ట్‌ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. గతంలో నెలంతా కలిపి 2జీబీ డేటా వాడే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఒక రోజులో 2జీబీ డేటా వాడుతున్నారు. ఇలాంటివారి కోసం జియో రోజూ 2జీబీ డేటా (Jio Daily 2GB Plans) ప్లాన్స్ రూపొందించింది. ఈ ప్లాన్స్ రూ.249 నుంచి ప్రారంభం అవుతాయి. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (Disney+ Hotstar Subscription) లభించే ప్లాన్స్ కూడా ఉన్నాయి. మరి ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.

Jio Rs 249 Plan: రిలయన్స్ జియో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 23 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 46జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ లాంటి జియో యాప్స్ సబ్‍స్క్రిప్షన్ ఉచితం.

Mobile Offer: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 108MP కెమెరా ఉన్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై రూ.15,000 వరకు తగ్గింపు

Jio Rs 299 Plan: రిలయన్స్ జియో రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 56జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ లాంటి జియో యాప్స్ సబ్‍స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 533 Plan: రిలయన్స్ జియో రూ.533 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 112జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ లాంటి జియో యాప్స్ సబ్‍స్క్రిప్షన్ ఉచితం.

WhatsApp Groups: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఆ ఫీచర్ వచ్చేసింది

Jio Rs 719 Plan: రిలయన్స్ జియో రూ.719 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 168జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ లాంటి జియో యాప్స్ సబ్‍స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 799 Plan: రిలయన్స్ జియో రూ.799 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 112జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ లాంటి జియో యాప్స్ సబ్‍స్క్రిప్షన్ ఉచితం. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఒక ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Samsung Offer: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... బ్యాంక్ ఆఫర్ కూడా... పవర్‌ఫుల్ ప్రాసెసర్, OIS కెమెరా, మరెన్నో ఫీచర్స్



Jio Rs 1066 Plan: రిలయన్స్ జియో రూ.1066 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 168జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 5జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 173జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ లాంటి జియో యాప్స్ సబ్‍స్క్రిప్షన్ ఉచితం. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఒక ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 2879Plan: రిలయన్స్ జియో రూ.2879 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 730జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ లాంటి జియో యాప్స్ సబ్‍స్క్రిప్షన్ ఉచితం.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Jio, Reliance Jio

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు