వాట్సాప్ (WhatsApp) తర్వాత ప్రజలు ఎక్కువగా వాడే మెసేజింగ్ యాప్స్‌లో టెలిగ్రామ్ (Telegram) ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ యాప్ చాలా పాపులర్ కావడానికి అది అందించే అద్భుతమైన ఫీచర్లు (Amazing Features) ఒక కారణమైతే.. వాట్సాప్ డేటా పాలసీ కొందరికి నచ్చేలా ఉండకపోవడం మరో కారణం. వాట్సాప్, టెలిగ్రామ్ రెండింటిలో కూడా దాదాపు ఒకే విధమైన ఫీచర్లు ఉంటాయి. టెలిగ్రామ్ వాట్సాప్ అందించని కొన్ని అదిరిపోయే ఫీచర్లు కూడా ఆఫర్ చేస్తోంది. వాటిలో షెడ్యూల్ మెసేజ్ (Schedule Message) ఫీచర్ ఒకటని చెప్పవచ్చు. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తమ మెసేజ్‌లను ఏ టైమ్‌కి పంపించాలో షెడ్యూల్ టైమ్ సెట్ చేయవచ్చు. బర్త్‌డే, మ్యారేజ్ యానివర్సరీ, ఇంకా ఏదైనా ఇతర స్పెషల్ డేస్‌లో సరైన సమయానికి శుభాకాంక్షల మెసేజ్‌లు, ఇంపార్టెంట్ మెసేజ్‌లు పంపించడానికి ఈ ఫీచర్ ఎంతగానో సహాయపడుతుంది. మరి టెలిగ్రామ్‌లో మెసేజ్‌ను ఎలా షెడ్యూల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* టెలిగ్రామ్‌లో మెసేజ్‌ను షెడ్యూల్ చేయడమెలా?
స్టెప్ 1: మొదటగా మీరు మీ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి. ఆపై ఎవరికి పంపే మెసేజ్‌ను మీరు షెడ్యూల్ చేయాలనుకుంటున్నారో వారి చాట్‌ను ఓపెన్ చేయాలి.
స్టెప్ 2: షెడ్యూల్ మెసేజ్ పంపదలుచుకున్న చాట్‌ను ఓపెన్ చేసిన తర్వాత.. మెసేజ్ టైప్ చేయాలి. తరువాత 'సెండ్ మెసేజ్ (Send Message)' బటన్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి.
స్టెప్ 3: ఆ బటన్‌ను ఎక్కువ సేపు ప్రెస్ చేస్తే, ఒక పాప్-అప్ మీకు కనిపిస్తుంది. ఆ పాప్-అప్‌లో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి రిసీవర్ ఫోన్‌కు తెలియజేయకుండా మెసేజ్‌ను సైలెంట్‌గా పంపే వీలు కల్పిస్తుంది. రెండవది మెసేజ్‌ను షెడ్యూల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే రెండో ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: మీరు "షెడ్యూల్ మెసేజెస్"పై క్లిక్ చేసిన తర్వాత, అవతలి వ్యక్తికి మీ మెసేజ్ ఎప్పుడు డెలివరీ కావాలో తేదీ, సమయాన్ని సెట్ చేయాలి.
స్టెప్ 5: అనంతరం మీ మెసేజ్‌ను షెడ్యూల్ చేయడానికి డేట్, టైమ్ సెట్టర్ కింద ఉన్న బ్లూ బటన్‌పై క్లిక్ చేయాలి. అంతే, మీ మెసేజ్ షెడ్యూల్ టైమ్‌కి సెండ్ అయిపోతుంది.
పైన స్టెప్స్ ఫాలో అవుతూ టెలిగ్రామ్‌లోని ఏ చాట్‌కు అయినా మెసేజ్ షెడ్యూల్ చేసి పంపించవచ్చు. మీరు మెసేజ్‌లను షెడ్యూల్ చేసిన చాట్‌లలో క్యాలెండర్, టైమర్ శంకర్ అనిపిస్తుంది. ఈ ఆప్షన్‌పై నొక్కి మీరు ఏ టైమ్‌కి మెసేజ్‌ను షెడ్యూల్ చేశారో చెక్ చేయవచ్చు లేదా టైమ్‌ను ఎడిట్ కూడా చేయవచ్చు. యూజర్లు టెక్స్ట్ మెసేజ్‌లతో పాటు వాయిస్ మెసేజ్‌లను కూడా టెలిగ్రామ్ లో షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందుకు ప్రొఫైల్ పై నొక్కి వాయిస్ చాట్ పై క్లిక్ చేసి షెడ్యూల్ వాయిస్ చాట్ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Messages, New features, Telegram, Whatsapp