Home /News /technology /

DO YOU SUSPECT SOMEONE READING YOUR WHATSAPP CHATS KNOW HOW TO PROTECT YOUR WHATSAPP ACCOUNT SS

WhatsApp: మీ వాట్సప్ మెసేజెస్ లీకవుతున్నాయని డౌటా? ఇలా చేయండి

WhatsApp: మీ వాట్సప్ మెసేజెస్ లీకవుతున్నాయని డౌటా? ఇలా చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp: మీ వాట్సప్ మెసేజెస్ లీకవుతున్నాయని డౌటా? ఇలా చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Features | వాట్సప్ అనే ప్రైవసీ ఫీచర్స్ అందిస్తోంది. అయితే వాటి గురించి తెలియక యూజర్లు పట్టించుకోరు. యూజర్లు తమ వాట్సప్ ఛాట్స్, వాట్సప్ అకౌంట్‌ను (WhatsApp Account) సురక్షితంగా మార్చుకోవడం కోసం ఈ ఫీచర్స్ ఉపయోగపడతాయి.

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా పరిచయం అయిన వాట్సప్ అనేక ఫీచర్స్‌ని (WhatsApp Features) అందించింది. కొత్తకొత్త ఫీచర్స్‌ని ప్రతీ నెలా రిలీజ్ చేస్తోంది. ఒకప్పుడు వాట్సప్ కేవలం ఛాటింగ్ కోసమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ షేర్ చేయడం, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయడం లాంటి అనేక సర్వీసెస్ వాట్సప్ ద్వారా లభిస్తున్నాయి. ఇక ఇటీవల మరో అద్భుతమైన ఫీచర్ వాట్సప్ నుంచి వచ్చింది. ఇన్నాళ్లూ ఒక వాట్సప్ అకౌంట్ (WhatsApp Account) ఒక డివైజ్‌లో మాత్రమే ఉపయోగించే అవకాశం ఉండేది. వాట్సప్ వెబ్ ద్వారా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో కూడా వాట్సప్ ఓపెన్ చేయొచ్చు. కానీ ప్రస్తుతం ఒకే వాట్సప్ అకౌంట్‌ను నాలుగు డివైజ్‌లకు కనెక్ట్ చేయొచ్చు. ఇందుకోసం తమ ఫోన్ లింక్ చేస్తే చాలు.

నాలుగు డివైజ్‌లకు వాట్సప్ అకౌంట్ లింక్ చేసిన తర్వాత ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. వాట్సప్ లింక్ చేసిన ఏదైనా డివైజ్‌లో 14 రోజుల పాటు యాక్టీవ్‌గా లేకపోతే ఆటోమెటిక్‌గా లాగౌట్ అవుతుంది. అయితే ఈ ఫీచర్ ఉపయోగించుకోవడంలో కాస్త ఏమరుపాటుగా ఉంటే మీ వాట్సప్ ఛాట్స్ లీక్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఏదైనా డివైజ్‌లో మీ వాట్సప్ అకౌంట్ లాగిన్ చేసి మర్చిపోతే ఆ డివైజ్‌లో మీ వాట్సప్ అకౌంట్ ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి ఛాట్స్ ఎవరైనా చూడొచ్చు.

Jio Offer: ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే జియో నుంచి రూ.7,200 బెనిఫిట్స్

అందుకే వాట్సప్ యూజర్లు కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం. మీరు ఏ డివైజ్‌లో వాట్సప్ ఉపయోగించినా వెంటనే లాగౌట్ చేయడం మర్చిపోకూడదు. వాట్సప్ వెబ్ వాడుతున్నట్టైతే మెనూ ఓపెన్ చేసి లాగౌట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా డివైజ్‌లో వాట్సప్ అకౌంట్ ఓపెన్ చేసి, లాగౌట్ చేయడం మర్చిపోయినట్టైతే కంగారుపడాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్ నుంచే ఆ డివైజ్‌లో మీ వాట్సప్ లాగౌట్ చేయొచ్చు. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి.

Vivo Discount Offer: మూడు పాపులర్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన వివో

Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేయండి.

Step 2- టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి.

Step 3- Linked devices పైన క్లిక్ చేయాలి.

Step 4- మీ వాట్సప్ అకౌంట్ మీ ఫోన్‌లో కాకుండా ఇంకా ఏ డివైజ్‌లో ఓపెన్ చేసి ఉందో లిస్ట్ కనిపిస్తుంది.

Step 5- ఆ లిస్ట్‌లో ఉన్న డివైజ్ ఓపెన్ చేసి LOG OUT పైన క్లిక్ చేస్తే వాట్సప్ అకౌంట్ లాగౌట్ అవుతుంది.

ఈ స్టెప్స్‌తో మీ స్మార్ట్‌ఫోన్‌లో కాకుండా ఇతర డివైజ్‌లో మీ వాట్సప్ అకౌంట్ లాగిన్ చేసినట్టైతే సులువుగా లాగౌట్ చేయొచ్చు. మీ వాట్సప్ ఛాట్స్ లీక్ కాకుండా జాగ్రత్త పడొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Android, Whatsapp

తదుపరి వార్తలు