హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Longest Phone Call: ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ ఇదే... ఎన్ని గంటలు మాట్లాడారో తెలుసా?

Longest Phone Call: ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ ఇదే... ఎన్ని గంటలు మాట్లాడారో తెలుసా?

Longest Phone Call: ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ ఇదే... ఎన్ని గంటలు మాట్లాడారో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

Longest Phone Call: ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ ఇదే... ఎన్ని గంటలు మాట్లాడారో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

Longest Phone Call | ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ ఏది, కాల్ కట్ చేయకుండా ఎక్కువ సేపు ఎవరు మాట్లాడారు, ఎన్ని గంటలు మాట్లాడారు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? దీనిపై ఇంట్రెస్టింగ్ రికార్డ్ ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ప్రస్తుతం అందరి జీవితంలో మొబైల్ ఫోన్ ముఖ్యమైన భాగం అయిపోయింది. గతంలో ఒకరికొకరు కమ్యూనికేట్ చేయాలనుకుంటే ఉత్తరాలే ఉండేవి. ఆ తర్వాత ల్యాండ్‌లైన్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్ వరకు టెక్నాలజీ విప్లవాన్ని చూస్తున్నాం. ఎవరికైనా ఏదైనా పనిమీద ఫోన్ కాల్ (Phone call) చేస్తే రెండుమూడు నిమిషాలు మాట్లాడతాం. ముఖ్యమైన టాపిక్ అయితే ఓ పావుగంటో, అరగంటో మాట్లాడతాం. ఇక చాలారోజుల తర్వాత ఆత్మీయులకు ఫోన్ చేస్తే ఓ గంటసేపు మాట్లాడినా సరిపోదు. అసలు ఇప్పటివరకు ఒకే ఫోన్ కాల్‌లో ఎక్కువ సేపు మాట్లాడింది ఎవరు? అన్న సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ (Longest Phone Call) ఏది అని మీరు ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా? ఆ రికార్డ్ గురించి తెలుసుకోండి.

ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. గత పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడే స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువగా ఉంది. అయితే ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ మాట్లాడింది 2012లో. అవును. సుదీర్ఘమైన ఫోన్ కాల్ అంటే రెండుమూడు గంటలో, ఐదారు గంటలో అనుకుంటే పొరపాటే. ఏకంగా 46 గంటలపాటు ఈ ఫోన్ కాల్ కొనసాగడం విశేషం.

Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్... ఛార్జీలు ఎంతంటే

ఇంత సుదీర్ఘమైన ఫోన్ కాల్ ఎవరిమధ్య నడిచిందో తెలుసా? హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎరిక్ ఆర్ బ్రూస్టర్, అవెరీ ఏ.లియోనార్డ్ మధ్య ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. వీరిద్దరూ 46 గంటల 12 నిమిషాల 52 సెకండ్ల 228 మిల్లీ సెకండ్లు మాట్లాడుకున్నారు. మధ్యలో ఒక్కసారి కూడా కాల్ కట్ చేయలేదు. ఈ ఫోన్ కాల్‌లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే. కాల్ కొనసాగుతున్న సమయంలో వీరిద్దరు 10 సెకండ్ల కన్నా ఎక్కువ సేపు మౌనంగా ఉండకూడదని షరతు కూడా పెట్టారట. అంటే నాన్ స్టాప్‌గా మాట్లాడుతూ ఉండాలని కండీషన్ పెట్టారు.

అయితే అంతసేపు ఆపకుండా ఫోన్ కాల్ మాట్లాడితే మానసిక ఒత్తిడికి గురవుతారని ప్రతీ గంటకు 5 నిమిషాల విరామం ఇచ్చారట. వారు తిరిగి శక్తిని పొంది సంభాషణ కొనసాగించడానికి గంటకు 5 నిమిషాల చొప్పున బ్రేక్ ఇచ్చారు. వీరిద్దరూ ఓ చిట్ చాట్ షోలో ఇలా 46 గంటలపైనే మాట్లాడారు. ఇక 2009లో మరో రికార్డ్ కూడా ఉంది. సునీల్ ప్రభాకర్ అనే వ్యక్తి 51 గంటల పాటు నాన్ స్టాప్‌గా ఫోన్ కాల్స్ మాట్లాడాడు. అయితే అతను ఒకరితోనే అన్ని గంటలు మాట్లాడలేదు. వేర్వేరు వ్యక్తులకు కాల్ చేసి 51 గంటల సేపు ఫోన్ కాల్ మాట్లాడాడు.

Price Cut: ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది... లేటెస్ట్ రేట్స్ ఇవే

సునీల్ ప్రభాకర్ మొదట కార్డియాలజిస్ట్ కేకే అగర్వాల్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత వేర్వేరు వ్యక్తులకు ఈ కాల్ కొనసాగింది. ఇలా వేర్వేరు వ్యక్తులతో ఇన్ని గంటలు మాట్లాడిన రికార్డులు కొన్ని ఉన్నాయి. కానీ ప్రపంచంలోనే సుదీర్ఘమైన ఫోన్ కాల్ రికార్డ్ మాత్రం హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎరిక్ ఆర్ బ్రూస్టర్, అవెరీ ఏ.లియోనార్డ్ పేర్లపై ఉంది.

First published:

Tags: Mobile News, Smartphone

ఉత్తమ కథలు