• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • DO YOU KNOW HOW MANY MOBILE NUMBERS ISSUED ON YOUR NAME CHECK IN THIS WEBSITE BA GH

మీ పేరు మీద ఎన్ని మొబైల్​ నంబర్లున్నాయో తెలుసా?.. మీ ఫస్ట్ మొబైల్ నెంబర్ గుర్తుందా? ఇక్కడ చెక్ చేసుకోండి..

మీ పేరు మీద ఎన్ని మొబైల్​ నంబర్లున్నాయో తెలుసా?.. మీ ఫస్ట్ మొబైల్ నెంబర్ గుర్తుందా? ఇక్కడ చెక్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది ఎప్పటికప్పుడు కొత్త కొత్త నెంబర్లు తీసుకుంటూ ఉంటారు. గతంలో మీరు ఏ నెంబర్ వాడారో కూడా గుర్తుండదు. అయితే, మీ పేరు మీద ఎన్ని నెంబర్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

  • Share this:
డ్యూయల్​ సిమ్​ ​ఫోన్ల రాకతో ఇప్పుడు ప్రతి ఒక్కరు రెండు మొబైల్​ నెంబర్లను మెయింటెయిన్​ చేస్తున్నారు. కొందరైతే, ఫ్రీ సిమ్​ అని ప్రకటించగానే పాత సిమ్​ పక్కనేసి కొత్త సిమ్ కార్డు తీసుకుంటున్నారు. ఇలా, ఒకరి పేరు మీద ఎన్ని సిమ్​ కార్డులు​ ఉన్నాయో కూడా చెప్పడం కష్టం. అయితే, ఆఫర్​ కోసం ఎగబడి సిమ్​లను తీసుకుంటే మొదటికే మోసం రావొచ్చు. ఆఫర్​ పేర్లతో కొంతమంది సైబర్​ నేరగాళ్లు మన ఐడీ ఫ్రూఫ్స్ తీసుకొని మనకు తెలియకుండానే సిమ్ కార్డు​లు తీసుకుంటున్నారు. ఆయా నెంబర్లను వారి అనైతిక, అసాంఘీక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో, మనకు సంబంధం లేకున్నా సరే.. మన ఐడీ వివరాలతో ఆ నంబర్​ ఉండటంతో కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కవయ్యాయని సైబర్​ క్రైమ్​ పోలీసులు చెబుతున్నారు. అందుకే, మన పేరు మీద లేదా మన వివరాలతో ఎవరైనా సిమ్​ తీసుకుంటే వాటిని బ్లాక్​ చేసే సదుపాయాన్ని తాజాగా అందుబాటులోకి తెచ్చింది భారత టెలికమ్యూనికేషన్ శాఖ. ఉపయోగంలో లేని సిమ్​లను కట్టడి చేసేందుకు డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలికమ్యూనికేషన్​ (డిఓటి) ఒక సరికొత్త పోర్టల్​ను ఆవిష్కరించింది. https://www.tafcop.dgtelecom.gov.in ను సందర్శించి ఒకరి ఐడీపై ఎన్ని మొబైల్​ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చని తెలిపింది. అంతేకాక, ఉపయోగంలో లేని నంబర్లను డీయాక్టివేట్​ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఒకరి ఐడీ మీద 9 సిమ్​లు మాత్రమే..
కాగా, మీ పేరుపై ఎన్ని నెంబర్లు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడం చాలా సులభం. మీరు https://www.tafcop.dgtelecom.gov.in వెబ్​సైట్​ ఓపెన్​ చేయగానే అందులో మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్​ నంబర్​ ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఇచ్చిన మొబైల్​ నంబర్​కు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్​ చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్​ నంబర్​ వివరాలన్నీ చూపిస్తుంది. వాటిలో ప్రస్తుతం వాడుకలో లేని లేదా తెలియకుండా మీ పేరు మీద ఉన్న నంబర్లను సెలక్ట్​ చేసి రిపోర్ట్​ చేస్తే టెలికాం శాఖ తగు చర్యలు తీసుకుంటుంది. కాగా, ఒకరి పేరు మీద అత్యధికంగా 9 మొబైల్ నంబర్లు మాత్రమే ఉండేందుకు వీలుందని డిఓటి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎ. రాబర్ట్ రవి పేర్కొన్నారు.

కొంతమంది వినియోగదారుల పేర్లలో తొమ్మిది కంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని తమ దృష్టికి వచ్చింది. అందుకే ఈ పరిస్థితిని చక్కదిద్దేందకు ఈ పోర్టల్​ను ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ పోర్టల్​ ద్వారా అనధికారికంగా వినియోగిస్తున్న మొబైల్​ నెంబర్లకు చెక్​ పెట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల టెలికాం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని, త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మీ ఐడీపై ఎన్ని నంబర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు, మీ ఐడీతో వేరే ఎవరైనా సిమ్​ తీసుకున్నట్లు అనుమానంగా ఉంటే వెంటనే ఈ పోర్టల్​ ద్వారా చెక్​ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు