హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

End-to-end encryption: ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే..

End-to-end encryption: ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే..

దీంతో ఆయా యూజర్లు తమ ఖాతాలను తిరిగి ప్రారంభించడం సులభమవుతుంది. లైవ్​ చాట్ సపోర్ట్​ కేవలం ఇంగ్లీష్​లోనే అందుబాటులో ఉంటుందని ఫేస్​బుక్​ తెలిపింది. ఫేస్​బుక్​ సపోర్ట్​పై క్లిక్​ చేస్తే సంస్థకు చెందిన కస్టమర్ ఎగ్జిక్యూటివ్​తో యూజర్లు చాట్ చేయవచ్చని తెలిపింది.

దీంతో ఆయా యూజర్లు తమ ఖాతాలను తిరిగి ప్రారంభించడం సులభమవుతుంది. లైవ్​ చాట్ సపోర్ట్​ కేవలం ఇంగ్లీష్​లోనే అందుబాటులో ఉంటుందని ఫేస్​బుక్​ తెలిపింది. ఫేస్​బుక్​ సపోర్ట్​పై క్లిక్​ చేస్తే సంస్థకు చెందిన కస్టమర్ ఎగ్జిక్యూటివ్​తో యూజర్లు చాట్ చేయవచ్చని తెలిపింది.

మెటాగా పేరు మార్చుకున్న ఫేస్‌బుక్.. తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు ఇప్పుటికిప్పుడు డిఫాల్ట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ను పరిచయం చేయలేమని తెలిపింది.

మెటాగా పేరు మార్చుకున్న ఫేస్‌బుక్ (Facebook).. తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు ఇప్పుటికిప్పుడు డిఫాల్ట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ (End to end encryption) ఫీచర్‌ను పరిచయం చేయలేమని తెలిపింది. పిల్లల భద్రతా సమస్యలను ఉటంకిస్తూ.. 2023 వరకు ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యాప్‌ల కోసం ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ (E2EE)ను విడుదల చేయట్లేదని పేర్కొంది. ఈ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ చాట్స్, మెసెంజర్‌లను విలీనం చేసి ఒక యూనిఫైడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫాంను రూపొందించింది. తద్వారా అన్ని అనుబంధ సంస్థల సేవలను కేంద్రీకృతం చేసింది. అయితే మెసెంజర్ (messenger), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా సెండ్ చేసే మెసేజ్‌లకు సంబంధించి వినియోగదారులు E2EEని యాక్టివేట్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్‌ డిఫాల్ట్‌ (default option)గా ఆన్ అవ్వదు. 2023లోపు ఈ డిఫాల్ట్ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End to end encryption) ఫీచర్‌ అందుబాటులో ఉండదని నివేదికలు వెల్లడించాయి. మెటా యాజమాన్యంలోని మరో మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (WhatsApp).. ఇప్పటికే డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు సపోర్ట్ చేస్తుంది.

యూజర్ సేఫ్టీకి సంబంధించిన ఆందోళనలే..

దీనిపై మెటా సేఫ్టీ హెడ్ (meta safety head) యాంటిగోన్ డేవిస్ మాట్లాడుతూ.. యూజర్ సేఫ్టీకి సంబంధించిన ఆందోళనలే ఈ ఫీచర్ ఆలస్యం కావడానికి కారణమని తెలిపారు. E2EE డిఫాల్ట్‌ (default)గా ఆన్ అయితే.. మెసేజ్ పంపినవారు, రిసీవర్ మాత్రమే వారి సంభాషణలను చూస్తారు. దీంతో నేర కార్యకలాపాలను (Crime activities) ఆపడంలో సహాయపడే చర్యలను కొన్నిసార్లు ఈ ఫీచర్ (feature) అడ్డుకునే అవకాశం ఉంది. ఇలాంటి సామర్థ్యానికి డిఫాల్ట్ ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్ అంతరాయం కలిగించకుండా చూడాలని మెటా (Meta) భావిస్తుందని డేవిస్ చెప్పారు.

ఎన్‌క్రిప్ట్ చేయని డేటా కాంబినేషన్లను..

E2EE డిఫాల్ట్‌గా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ సంస్థ ఎన్‌క్రిప్ట్ (encrypt) చేయని డేటా కాంబినేషన్లను ఉపయోగిస్తుందని డేవిస్ పేర్కొన్నారు. పబ్లిక్ సేఫ్టీ ప్రయత్నాలకు సహాయం చేయడానికి కంపెనీ పరిధిలోని అన్ని యాప్‌లు (Apps), అకౌంట్ సమాచారం, వినియోగదారుల (users) నుంచి వచ్చే నివేదికల ద్వారా ఎన్‌క్రిప్ట్ చేయని డేటా కాంబినేషన్ల (data combinations)ను ఉపయోగిస్తామని వివరించారు.

2022లో లేదా అంతకు ముందే..

డిఫాల్ట్ E2EE ఫీచర్ త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్ (Instagram), మెసెంజర్‌లో అందుబాటులోకి వస్తుందని మెటా ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. 2022లో లేదా అంతకు ముందే ఈ ఆప్షన్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపింది. కానీ ఇప్పుడు మాత్రం.. సరైన సమయంలో ఈ ఫీచర్‌ (feature)ను అందుబాటులోకి తీసుకువస్తామని మెటా వెల్లడించింది. వివిధ భద్రతా కారణాల వల్ల డిఫాల్ట్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను 2023 వరకు ప్రారంభించలేకపోతున్నామని డేవిస్ తెలిపారు.

UK ఆన్‌లైన్ సేఫ్టీ బిల్లు (Online safety bill) కూడా 2023లో అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో పిల్లలను ప్రమాదం నుంచి రక్షించడానికి, అలాగే దుర్వినియోగ కంటెంట్‌పై ఆన్‌లైన్ కంపెనీలు తక్షణమే చర్యలు తీసుకోవాలి. అయితే డిఫాల్ట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ఆప్షన్ (default ebd to end encryption ) అందుబాటులోకి వస్తే.. ఇలాంటి చర్యలు తీసుకోవడంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. దీంతో ఈ ఫీచర్‌పై UK హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్ సైతం గతంలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి నిర్ణయాలన్నీ E2EEని డిఫాల్ట్‌గా ప్రారంభించాలనే Facebook ప్రణాళికలకు ఆటంకం కలిగించాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.

గత కొన్నేళ్లుగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, భారతదేశం, జపాన్‌ వంటి దేశాలు బ్యాక్‌డోర్ ఎన్‌క్రిప్షన్ యాక్సెస్‌ (backdoor encryption access)ను డిమాండ్ చేస్తున్నాయి. ఏదైనా విషయంపై ఎవరిపైన అయినా వారెంట్ జారీ అయితే.. ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, ఫైల్స్‌ను వీక్షించడానికి అధికారులకు అనుమతి ఇవ్వాలని వివిధ దేశాలు కోరుతున్నాయి. కానీ ఈ విషయంపై సోషల్ మీడియా సంస్థలు స్పందించట్లేదు.

First published:

Tags: Facebook, Instagram, Latest Technology, New feature, Security

ఉత్తమ కథలు