హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus 9 Pro తో ఏకంగా యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీశారు.. ఇప్పుడు OTTలో ప్రసారమవుతోంది..

OnePlus 9 Pro తో ఏకంగా యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీశారు.. ఇప్పుడు OTTలో ప్రసారమవుతోంది..

2024 Movie

2024 Movie

OnePlus 9 Pro : వన్‌ప్లస్‌ 9 ప్రొతో చిత్రీకరించిన ఈ సినిమాను డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా విడుదల చేశారు. 2024 అనే పేరుతో రూపొందించిన ఈ ఫీచర్‌ సినిమా 60 నిమిషాలపాటు సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రాన్ని వన్‌ప్లస్‌, విక్రమాదిత్య మోట్‌వానే సంయుక్తంగా తెరకెక్కించారు.

ఇంకా చదవండి ...

  ఒకప్పుడు మొబైల్‌ ఫోన్‌ అంటే కేవలం దూరంగా ఉన్న వారితో సంభాషించడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే. కానీ ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ చేయలేని పనంటూ ఏది లేదు. మారుతోన్న కాలానికి అనుగుణంగా స్మార్ట్‌ ఫోన్లలో ఫీచర్లు కూడా పెరుగుతున్నాయి. కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండడంతో అధునాతన ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌లు ఎన్నో గ్యాడ్జెట్ల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చాయి. అందులో కెమెరా ఒకటి. స్మార్ట్‌ ఫోన్‌లో హై క్వాలిటీ కెమెరాలు ఉండడంతో కెమెరా స్థానాన్ని స్మార్ట్‌ ఫోన్‌ భర్తీ చేసేసింది. ఇదిలా ఉంటే తాజాగా స్మార్ట్‌ ఫోన్‌తో ఏకంగా సినిమాను చిత్రీకరించి ఆశ్చర్యపరిచారు కొందరు ఔత్సాహిక ఫిలిమ్‌ మేకర్స్‌.

  వన్‌ప్లస్‌ 9 ప్రొతో చిత్రీకరించిన ఈ సినిమాను డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా విడుదల చేశారు. 2024 అనే పేరుతో ఇక్కడ రూపొందించిన ఈ ఫీచర్‌ సినిమా 60 నిమిషాలపాటు సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రాన్ని వన్‌ప్లస్‌, విక్రమాదిత్య మోట్‌వానే సంయుక్తంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను చూస్తే అసలు స్మార్ట్‌ ఫోన్‌లో చిత్రీకరించారు అంటే నమ్మడం అసాధ్యం. హెచ్‌డీ కెమెరాల్లో చిత్రీకరించిన సినిమాలకు ఏమాత్రం తీసుపోదీ ఫీచర్‌ ఫిలిమ్‌. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. C-24 అనే ఒక వైరస్ దేశంలో ఒక్కసారిగా విజృంభిస్తుంది. ప్రజలకు ఒక్కొక్కరిగా ఈ వైరస్‌ బారిన పడుతుంటారు.

  చేతి వేళ్లు నీలి రంగు మారడం లక్షణంగా ఉండే ఈ వైరస్‌ సోకిన ప్రజలంతా.. జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం అలర్ట్‌ జారీ చేస్తుంది. ఇంతకీ ఈ వైరస్‌ ఎలా పుట్టింది.? దీనిని ఎలా అధిగమించారు.? ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా.? అన్న ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా చూసినంత సేపు ఈ చిత్రాన్ని మొబైల్లో చిత్రీకరించారు అన్న ఆలోచన రాదు అంత అద్భుతంగా హెచ్ డి కెమెరాకు తీసిపోకుండా తెరకెక్కించారు మేకర్స్.

  ఇదొక అద్భుతమైన కథ.. మరియు ఇందులో అద్భుతమైన నటీనటులు నటించారు. మిస్ మ్యాచ్ డ్, కోటా ఫ్యాక్టరీ వంటి సినిమాల్లో నటించిన ముస్కాన్ జాస్ఫరీ, మయూర్ ఇందులో నటించారు. వీరితో పాటు తేజస్వి సింగ్ అహ్లవత్, శారూల్ భరద్వాజ్, మిహిర్ అహుజ్ కూడా నటించారు. ఈ అద్భుతమైన కథను అవినాష్ సంపత్ రాశాడు. అలోక్ నందా దాస్ గుప్తా మ్యూజిక్ డైరక్టర్ కాగా, లినేష్ దేశాయ్ డైరక్టర్ ఆఫ్ పోటోగ్రఫీగా ఈ సినిమాకు పనిచేశారు.

  ఈ ఏడాది తొలిభాగంలో వన్​ప్లస్​ 9 ప్రోను సంస్థ విడుదల చేసింది​. ఈ ఫోన్​లో హాసెల్​బ్లాడ్​ కెమెరాలు ఉంటాయి. హాసెల్​బ్లాడ్​ అనేది కెమెరాలు, లెన్స్​లు తయారు చేయడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ. ఇక వన్​ప్లస్​ 9 ప్రోను 48ఎంపీ ఎఫ్​/1.8 సోనీ ఐఎం​ఎక్స్​689 సెన్సార్​, 50ఎంప్​ ఎఫ్​/2.2 సోనీ ఐఎంఎక్స్​766 అల్ట్రా వైడ్​ సెన్సార్​(ఫ్రీఫోం లెన్స్​తో కలిపి), 2ఎంపీ మోనోక్రోమ్​ లెన్స్​తో రూపొందించారు. 8కే లిజల్యూషన్​లో 30ఎఫ్​పీఎస్​(ఫ్రేమ్స్​ పర్​ సెకండ్​) వరకు ఇందులో వీడియోలు రికార్డ్​ చేయవచ్చు.


  సాధారణంగా.. యాడ్​ల రూపంలో తమ ప్రోడక్ట్​లకు ప్రచారాలు చేస్తూ ఉంటాయి సంస్థలు. కానీ వన్​ప్లస్​ 9ప్రోను ప్రమోట్​ చేసేందుకు సంస్థ ఏకంగా తన ఫోన్​తోనే సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. వన్ ప్లస్ 9 ప్రో పనితీరు చూస్తుంటే భవిష్యత్తులో సినిమా కెమెరాలను స్మార్ట్ ఫోన్లు రిప్లేస్ చేసేలా ఉన్నాయ్. చ్‌డీ కెమెరాల్లో చిత్రీకరించిన సినిమాలకు ఏమాత్రం తీసుపోదీ ఫీచర్‌ ఫిలిమ్‌. మనలో అంతర్గతంగా ఉన్న చిత్ర నిర్మాతలను బయటకు తీయడానికి ఇప్పుడు ఇక ఎలాంటి అడ్డంకులు లేవు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cinema, Disney+ Hotstar, ONE PLUS

  ఉత్తమ కథలు