Home /News /technology /

DO YOU BUY IT EVEN IF THERE ARE OFFERS BUYING WITH SMART TIPS LIKE THIS HAS MANY BENEFITS UMG GH

Independence Day Offers: ఆఫర్లు ఉన్నాయని ఏదిపడితే అది కొంటున్నారా ? ఇలా స్మార్ట్ టిప్స్ తో కొన్నారంటే బోలెడు బెనిఫిట్స్

 ఆఫర్లు ఉన్నాయని ఏదిపడితే అది కొంటున్నారా ? ఇలా స్మార్ట్ టిప్స్ తో కొన్నారంటే బోలెడు బెనిఫిట్స్

ఆఫర్లు ఉన్నాయని ఏదిపడితే అది కొంటున్నారా ? ఇలా స్మార్ట్ టిప్స్ తో కొన్నారంటే బోలెడు బెనిఫిట్స్

స్వాతంత్య్ర(Independence) దినోత్సం సందర్భంగా అన్ని షాపింగ్(Shopping) మాల్స్‌ ఆఫర్లతో సందడి చేస్తున్నాయి. దాదాపు ప్రతి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ ఈ సందర్భంగా స్పెషల్ ఆఫర్ల(Offers)ను అందిస్తున్నాయి. అయితే తగ్గిపులు ఇస్తున్నారని ప్రతిదీ కొనకుండా, మనకు ఏది అవసరమో తెలుసుకోవడం మంచిది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
స్వాతంత్య్ర(Independence) దినోత్సం సందర్భంగా అన్ని షాపింగ్ మాల్స్‌ ఆఫర్లతో సందడి చేస్తున్నాయి. దాదాపు ప్రతి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ ఈ సందర్భంగా స్పెషల్ ఆఫర్ల(Offers)ను అందిస్తున్నాయి. అయితే తగ్గిపులు ఇస్తున్నారని ప్రతిదీ కొనకుండా, మనకు ఏది అవసరమో తెలుసుకోవడం మంచిది. వివిధ ఆఫర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో, వాటి నుంచి ఎలా బెస్ట్ బెనిఫిట్స్ పొందాలనే వివరాలతో పాటు స్మార్ట్(Smart) షాపింగ్ టిప్స్ తెలుసుకుందాం.

ప్రొడక్ట్ అవసరమా, లేదా అనేది చూడండి..
ఆఫర్‌లో ఏదైనా చౌకగా లభిస్తున్నందువల్ల, దాన్ని తప్పకుండా కొనాలని భావించకూడదు. అవసరం లేని ప్రొడక్ట్స్‌పై ఖర్చు చేయకూడదు. అందుకే ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో షాపింగ్(Shopping) చేయడానికి ముందు మీ అవసరాలు, కోరికలను గుర్తించాలని చెబుతున్నారు చార్టర్డ్ అకౌంటెంట్, NRP క్యాపిటల్స్ వ్యవస్థాపకుడు రిషబ్ పరాఖ్. అవసరాలు తీర్చుకోవడంతో పాటు షాపింగ్ ఖర్చులను అదుపులో ఉంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అందుకే మీరు కొనుగోలు చేయాల్సిన వస్తువుల జాబితాను ముందు సిద్ధం చేసుకోండి. ఈ జాబితాపైనే మీ దృష్టిని ఉంచండి. విండో షాపింగ్ మానుకోండి.

 ప్రొడక్ట్స్ పాతవేమో చూడండి..
కొన్నిసార్లు ఆన్‌లైన్ రిటైలర్లు ఎంపిక చేసిన వస్తువులపై 50-70 శాతం వరకు భారీ ఆఫర్లు అందిస్తాయి. అదికూడా పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే అన్ ఆథరైజ్డ్ సెల్లర్స్ ఆఫర్లో అందించే ప్రొడక్ట్స్ స్మగుల్డ్ గూడ్స్ కావచ్చు. లేదంటే వ్యాపారులు పాత ప్రొడక్ట్స్‌ను వదిలించుకోవాలనుకునే ఉద్దేశంలో ఆఫర్ ఇవ్వొచ్చు. అందుకే ఆన్‌లైన్‌లో ఏదైనా ప్రొడక్ట్ కొనడానికి ముందు దాని తయారీ తేదీ, లేటెస్ట్ మోడల్ వంటివి చెక్ చేయాలి. ఆఫ్‌లైన్ లేదా ఫిజికల్ స్టోర్ అందించే ధరతో పోల్చిన తర్వాతే కొనండి.

ఇదీ చదవండి:  Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


ఆఫ్‌లైన్ డిస్కౌంట్‌, ఆన్‌లైన్ రేట్లను పోల్చండి
ఈ రోజుల్లో ఆఫ్‌లైన్ రిటైలర్లు కూడా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌తో పోటీగా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నారు. అంతేకాదు, ఫిజికల్ స్టోర్‌లలో ఏదైనా కొత్త షర్టు లేదా షూలను ట్రయల్ వేసి, మీకు సెట్ అయ్యేది తీసుకోవచ్చు. కాబట్టి ప్రొడక్ట్ కొనేముందు వాటి ధరలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో పోల్చాలి. ఆఫ్‌లైన్ రిటైలర్ వద్ద కూడా అదే ధరకు లభిస్తే, ఫిజికల్ చెకింగ్‌తో పాటు ట్రయల్ వేసి అక్కడే తీసుకోవడం మంచిది.



డెట్ స్కీమ్స్ వద్దు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు, అలాగే ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లు ఇప్పుడు ‘బై నౌ పే లేటర్’ (BNPL) వంటి ప్లాన్‌లు, నో-కాస్ట్ EMIలు, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు‌పై EMIలు వంటి అనేక డెట్ స్కీమ్స్‌ అందిస్తున్నాయి. అయితే ఈ డెట్ స్కీమ్‌తో అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా వివిధ రకాల ఛార్జీల భారం ఉంటుంది. EMIని ఒక్కసారి డిఫాల్ట్ చేస్తే, క్రెడిట్ స్కోర్‌ కూడా ప్రభావితం కావచ్చు. అందుకే ఇలాంటి డెట్ ఆఫర్లతో కాకుండా మీ బడ్జెట్‌లోనే ఏదైనా వస్తువు కొనుగోలు చేయడం మంచిది.
Published by:Mahesh
First published:

Tags: Amazon Great Indian Festival Sale, Azadi Ka Amrit Mahotsav, Independence Day 2022, Offers

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు