హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google: గూగుల్ లో ఈ విషయాల గురించి వెతికితే జైలుకే.. అవేంటంటే?

Google: గూగుల్ లో ఈ విషయాల గురించి వెతికితే జైలుకే.. అవేంటంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గూగుల్ (Google) లో కొన్ని విషయాల గురించి వెతికితే జైలుకు సైతం వెళ్లే పరిస్థితి రావొచ్చు. అవేంటో తెలుసుకుందాం.

  ఈ రోజుల్లో ఇంటర్ నెట్ (Inter Net) వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరూ ఇంటర్ నెట్ వాడుతున్నారు. ఏ విషయం గురించి సమాచారం కావాలన్నా గూగుల్ ని అడిగి తెలుసుకుంటున్నారు. గూగల్ సెర్చ్ (Google Search) లో దొరకని సమాచారమే లేని పరిస్థితి. అయితే.. అనేక మంది గూగుల్ (Google) ని సమాచారం తెలుసుకోవడానికి వాడుతుంటే.. మరికొంత మంది మాత్రం గూగుల్ ను దుర్వినియోగం చేస్తున్నారు. గూగుల్ లో చూసి బాంబులు తయారు చేసిన వారు కూడా ఉన్నరని వార్తల్లో మనం చూసే ఉంటాం. ఇంకా కొందరైతే ఆపరేషన్లు కూడా గూగుల్ లో చూసి చేస్తున్నారంటే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లిందో ఊహించవచ్చు. అయితే గూగుల్ లో కొన్ని అంశాలను వెతికితే ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తించి మిమ్ములను గుర్తించి జైలుకు పంపిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

  బాంబు తయారీ..

  బాంబు తయారీ చేయడం ఎలా? లాంటి ప్రశ్నలను గూగుల్ లో అస్సలు వెతకొద్దు. ఇలా చేస్తే ఐపీ అడ్రస్ ఆధారంగా మీ ల్యాప్ టాప్, ఫోన్ ను గుర్తిస్తాయి ప్రభుత్వ సంస్థలు. మిమ్ములను ట్రాక్ చేసి జైలుకు కూడా పంపే ప్రమాదం ఉంది.

  అబార్షన్.. మన దేశంలో అభార్షన్లు నేరమనే విషయం తెలిసిందే. అబార్షన్ ఎలా జరుగుతుంది?, అబార్షన్ ఎలా చేయాలి? ఇలాంటి కీ వర్డ్స్ ను కూడా మీరు గూగుల్ లో అస్సలు వెతకొద్దు. ఇలాంటివి చేసిన వారిని కూడా నిఘా సంస్థలు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాయి.

  చైల్డ్ పోర్నోగ్రఫీ.. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి కూడా భారత ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అములు చేస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ కోసం అస్సలు వెతకొద్దు. ఒక వేర మీరు చైల్డ్ పోర్నోగ్రఫీని వెతికితే POSCO యాక్ట్ కింద జైలుకు వెళ్లే అవకాశం ఉంటుందని మరిచిపోవద్దు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Google

  ఉత్తమ కథలు