Home /News /technology /

DO 5G MOBILE TELEPHONES AND NETWORKS POSE HEALTH RISKS SS GH

5G Technology: 5G మొబైల్ ఫోన్, నెట్‌వర్క్‌ ఆరోగ్యానికి హాని చేస్తాయా?

5G Technology: 5G మొబైల్ ఫోన్, నెట్‌వర్క్‌ ఆరోగ్యానికి హాని చేస్తాయా?
(ప్రతీకాత్మక చిత్రం, image: Reuters)

5G Technology: 5G మొబైల్ ఫోన్, నెట్‌వర్క్‌ ఆరోగ్యానికి హాని చేస్తాయా? (ప్రతీకాత్మక చిత్రం, image: Reuters)

5G Technology | సాధార‌ణంగా సెల్‌ఫోన్ల‌తో పాటు టీవీలు, రేడియోలు, వైఫై.. వంటి ప‌రిక‌రాలు రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. ఈ త‌రంగాలు పెద్ద‌గా ప్ర‌మాద‌క‌రం కాద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

సాంకేతిక పరిజ్ఞానం మానవులతో పాటు పర్యావరణంపైనా ప్ర‌భావం చూపుతోంద‌ని చాలామంది చెబుతుంటారు. తాజాగా 5G మొబైల్ ఫోన్లు, నెట్‌వర్క్‌లు ఆరోగ్యానికి హాని చేస్తాయ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. వివిధ దేశాలలో ఈ సాంకేతిక విస్త‌ర‌ణ‌కు సిద్ధంగా ఉంది. ప్ర‌స్తుత నెట్వ‌ర్క్ టెక్నాల‌జీలో 5జి మెరుగైన సేవ‌లు అందించ‌నుంది. వైర్‌లెస్ డేటా సేవల్లో వేగం, సెల్ఫ్-డ్రైవింగ్ వాహనాల అభివృద్ధి, వర్చువల్ రియాలిటీ, వైద్య సేవ‌లు.. వంటి రంగాల్లో 5G నెట్‌వ‌ర్క్‌ ఉత్త‌మ సేవ‌లు అందించ‌నుంది. ఆ వేగాన్ని పొందడానికి ప్రస్తుత నెట్‌వర్క్‌ల కంటే 5G ఎక్కువ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో సిగ్న‌ళ్లు ఎక్కువ దూరం ప్ర‌యాణించ‌లేవు. ఎత్త‌యిన‌ భవనాలు వాటిని అడ్డుకుంటాయి. అంటే.. ఫోన్లు 5G సిగ్న‌ళ్లు అందుకోవ‌డానికి ఎక్కువ సామ‌ర్థం ఉండే యాంటెనాలు వాడాల్సి ఉంటుంది. సెల్‌ఫోన్‌ టవర్లు, భవనాల‌పై ఏర్పాటు చేసే యాంటెనాల‌పై ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. 5జి సేవ‌లు స‌క్ర‌మంగా అందాలంటే ఇలాంటి మ‌రిన్ని యాంటెనాల‌ను ఏర్పాటు చేయాలి. ఈ నేప‌థ్యంలో 5జి నెట్‌వర్క్‌లు ప్రజలను ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేయ‌వ‌చ్చు. దీంతో ప్రజలు రేడియో తరంగాలకు గుర‌య్యే అవ‌కాశాలు పెరుగుతాయి.

రేడియో తరంగాలు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా?


సాధార‌ణంగా సెల్‌ఫోన్ల‌తో పాటు టీవీలు, రేడియోలు, వైఫై.. వంటి ప‌రిక‌రాలు రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. ఈ త‌రంగాలు పెద్ద‌గా ప్ర‌మాద‌క‌రం కాద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన‌ పరిశోధనల్లో వైర్‌లెస్ టెక్నాలజీ ప్ర‌జ‌ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిన‌ట్లు తేల‌లేద‌ని ఆ సంస్థ పేర్కొంది. 5G ఉపయోగించాల్సిన ఫ్రీక్వెన్సీల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన ప‌రిశోధ‌న‌లు చేయ‌లేద‌ని దీని ద్వారా తెలుస్తోంది. మొబైల్ ఫోన్ల‌ను అతిగా ఉప‌యోగించేవారు, తలకు దగ్గరగా ఫోన్ల‌ను పెట్టేవారికి క్యాన్స‌ర్ సోకే అవ‌కాశం ఉంద‌ని WHO 2011లో తెలిపింది. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు, నెట్వ‌ర్క్‌తో ప‌నిచేసే బొమ్మలు పిల్లల మాన‌సిక‌ సామర్థ్యంపై ప్రభావం చూపుతాయనే ఆందోళనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప‌రిక‌రాలు, ఫోన్ల‌కు పిల్ల‌ల‌కు దూరంగా ఉంచాల‌ని ఫ్రాన్స్కు చెందిన‌ ANSES సేఫ్టీ ఏజెన్సీ 2016లో సూచించింది.

Realme Narzo 20A: తక్కువ ధరలో ఫోన్ కావాలా? కాసేపట్లో రియల్‌మీ నార్జో 20ఏ సేల్

Motorola E7 Plus: ఈరోజే మోటోరోలా ఈ7 ప్లస్ సేల్... యాక్సిస్, ఐసీఐసీఐ కార్డులపై ఆఫర్స్

బ‌యోలాజిక‌ల్ ఎఫెక్ట్‌


రేడియో తరంగాలు మ‌నుషుల‌ను తాకినప్పుడు, శరీర జీవ క‌ణాలు వేడెక్కే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ప‌రిశోధ‌న‌ల స‌మాచారం ప్ర‌కారం, రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్స్పోజర్ స్థాయులు మానవ శరీరంలో అతితక్కువ ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవుతున్నాయ‌ని WHO తన వెబ్‌సైట్‌లో తెలిపింది. అంత‌ర్జాతీయ మార్గ‌ద‌ర్శ‌కాలకంటే త‌క్కువ స్థాయిలో ఈ త‌రంగాలు వెలువ‌డుతున్నాయ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. వీటి కార‌ణంగా ఆరోగ్య ముప్పును అంచ‌నా వేయ‌లేమ‌ని పేర్కొంది. కానీ నిద్ర, ఒత్తిడి వంటి కొన్ని ప్యారామీట‌ర్ల‌పై ఈ త‌రంగాలు ప్ర‌భావం చూపుతాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలిన‌ట్లు ANSES సంస్థ‌కు చెందిన‌ నిపుణుడు ఆలివర్ మెర్కెల్ చెబుతున్నారు. 2012లో ANSES విమానాశ్రయాల్లో ఉప‌యోగించే బాడీ స్కానర్‌లపై ప‌రిశోధ‌న‌లు చేసింది. అవి కూడా ఎక్కువ ఫ్రీక్వెన్సీని ఉప‌యోగిస్తున్నాయ‌ని ఆ సంస్థ లేల్చింది. కానీ అవి ఆరోగ్యానికి ప్రమాద‌క‌రం కాద‌ని కనుగొన్నారు.

Smartphone Under Rs 10,000: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.10,000 లోపు లేటెస్ట్ మోడల్స్ ఇవే

Samsung: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన సాంసంగ్

5జి గురించి ఆందోళనలు ఎందుకంటే


5జి ఉపయోగించే అధిక ఫ్రీక్వెన్సీల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన‌ సమాచారం లేదు. ప్రస్తుతం వై-ఫై బాక్సులు ఉప‌యోగించే ఫ్రీక్వెన్సీలకు దాదాపుగా స‌మాన‌మైన ఫ్రీక్వెన్సీని 5జి నెట్‌వర్క్‌లు ఉపయోగిస్తున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ అవి అంత‌కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీల‌ను ఉపయోగిస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ, రేడియో తరంగాలు శరీరంలోకి ప్రవేశించే అవ‌కాశం పెరుగుతుంది. చర్మం, కళ్లు ఈ త‌రంగాల‌కు ప్ర‌భావిత‌మ‌వుతాయి. 5జి నెట్‌వర్క్‌ల విస్తరణతో వాటి యూజర్లు, వాటిని ఉప‌యోగించ‌నివారు కూడా వివిధ రకాల రేడియో తరంగాలకు గురయ్యే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G, Internet, Network, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు