Home /News /technology /

DIZO BUDS P EARBUDS LAUNCHED IN INDIA UMG GH

Dizo Earbuds: తక్కువ ధరకే సరికొత్త ఇయర్ బడ్స్.. బెస్ట్ కంపెనీ లాంచ్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రియల్‌మీ సబ్ బ్రాండ్ డిజో (Dizo).. ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్‌ మార్కెట్‌లో మంచి గుర్తింపు సాధించింది. ఈ సంస్థ నుంచి ఇండియాలో కొత్త TWS ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యాయి. డిజో బడ్స్ పి (Dizo Buds P) పేరుతో సరికొత్త బడ్స్ రిలీజ్ అయ్యాయి. బడ్జెట్ ఫోకస్డ్ కస్టమర్లే లక్ష్యంగా ఈ ట్రూ వైర్‌ల?

ఇంకా చదవండి ...
రియల్‌మీ సబ్ బ్రాండ్ డిజో (Dizo).. ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్‌ మార్కెట్‌లో మంచి గుర్తింపు సాధించింది. ఈ సంస్థ నుంచి ఇండియాలో కొత్త TWS ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యాయి. డిజో బడ్స్ పి (Dizo Buds P) పేరుతో సరికొత్త బడ్స్ రిలీజ్ అయ్యాయి. బడ్జెట్ ఫోకస్డ్ కస్టమర్లే లక్ష్యంగా ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ఇవి సిలికాన్ ఇయర్ టిప్స్ లేకుండా లాంగ్ స్టెమ్‌తో వచ్చిన పాత తరం డిజో బడ్స్‌ను పోలి ఉంటాయి. వీటి లాంగ్ స్టెమ్ యూజర్లకు పట్టును అందిస్తాయి. దీని డిజైనింగ్ సరికొత్తగా కనిపిస్తోంది. ఈ ఇయర్‌బడ్స్ IPX4 రేటింగ్‌ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో వస్తాయి. నడుస్తున్నప్పుడు లేదా చెమట పట్టే పనులు, వ్యాయామాలు చేస్తున్నప్పుడు కూడా వీటిని ధరించవచ్చు.

 ధర ఎంత?
ఇండియాలో Dizo Buds P ఇయర్‌బడ్స్ రూ. 1,599 ధర వద్ద లభిస్తున్నాయి. అయితే వీటిపై కంపెనీ ప్రీ-సేల్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్, డిజో అధికారిక వెబ్‌సైట్‌లో వీటిని రూ.1,299కే అందించనుంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. కొత్త బడ్స్ బ్లాక్, వైట్, బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటి సేల్స్ జూలై 5 మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. త్వరలో ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కూడా ఇయర్‌బడ్స్ అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

స్పెసిఫికేషన్లు
డిజో బడ్స్ పి 'హాఫ్-ఇన్-ఇయర్' డిజైన్‌తో వస్తాయి. అయితే ఇయర్‌బడ్స్ పాత యాపిల్ ఎయిర్‌పాడ్‌ డిజైన్‌ను పోలి ఉంటాయి. బాస్-హెవీ కస్టమర్ల కోసం బాస్ బూస్ట్+ టెక్నాలజీని అందించారు. 13 మిమీ పెద్ద ఆడియో డ్రైవర్‌లను పొందుపరిచారు. ఈ బడ్స్‌తో PU+PEEK డయాఫ్రాగమ్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తున్నట్లు డిజో పేర్కొంది. ఇయర్‌బడ్స్ ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్‌ (ENC) ఫీచర్‌ను అందిస్తాయి. ఈ ఫీచర్ పరిసర శబ్దాలను తొలగిస్తుంది. కానీ ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) మాదిరిగా పని చేయదు.

ఈ ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ కేస్ 480mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 40 గంటల బ్యాకప్‌ని అందజేస్తుంది. ప్రతి డిజో బడ్స్ P ఏడు గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందించగలదు. వీటి కేస్ USB-C పోర్ట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు అదే కనెక్టివిటీ ఆప్షన్‌తో వస్తున్నాయి కాబట్టి, కస్టమర్‌లు దీన్ని ఇష్టపడతారు. డిజో ఇయర్‌బడ్స్ 10 నిమిషాల ఛార్జ్‌తో నాలుగు గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. Dizo Buds P ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, యాపిల్ ఐఫోన్‌లతో కంపాటబుల్‌గా పని చేస్తుంది. మ్యూజిక్ ప్లే చేయడానికి లేదా పాజ్ చేయడానికి, కాల్స్ ఆన్సర్ చేయడానికి టచ్ కంట్రోల్స్‌తో వస్తాయి.
Published by:Mahesh
First published:

Tags: Ear buds, Features, New features, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు