హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart Offer: రూ.9,999 ఫోన్ రూ.539కే అందుబాటులో! ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్!

Flipkart Offer: రూ.9,999 ఫోన్ రూ.539కే అందుబాటులో! ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్!

రూ.9,999 ఫోన్ రూ.539కే అందుబాటులో! ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్!

రూ.9,999 ఫోన్ రూ.539కే అందుబాటులో! ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్!

Smartphone Offer | మీరు కొత్తగా ఫోన్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మీకోసం ఇప్పుడు ఒక సూపర్ డీల్ అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డు ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి లభిస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Flipkart Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సేల్‌లో భాగంగా చాలా ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు లభించనునాయి. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇప్పటికే పలు రకాల డిస్కౌంట్ వివరాలను వెల్లడించింది. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days) వరకు ఆగకుండానే ఇప్పుడు ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి కూడా ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు రెడ్‌మి ఫోన్‌పై ఎలాంటి డీల్ అందుబాటులో ఉందో తెలుసుకోబోతున్నాం.

    రెడ్‌మి 9ఐ స్పోర్ట్ స్మార్ట్‌ఫోన్‌పై పలు రకాల ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 9999గా ఉంది. దీన్ని బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 3 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫోన్ ధర రూ. 6,999కు తగ్గుతుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అదనంగా 10 శాతం తగ్గింపు అందుబాటులో ఉంటుంది. దీంతో వీరికి మరింత తక్కువకే ఈ ఫోన్ లభిస్తుంది.

    థ్రిల్లింగ్ ఆఫర్.. రూ.2,000కే టీవీ కొనొచ్చు.. పూర్తి వివరాలు!

    ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు చూస్తే ఈ ఫోన్ ధర రూ. 7,999గా ఉంది. అంటే ఫోన్ రేటు రూ. 9,999తో పోలిస్తే ఇప్పుడు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 2 వేల తగ్గింపు ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 1500 తగ్గింపు వస్తుంది. లేదంటే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కూడా ఇదే ఆఫర్ ఉంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఇలాంటి తగ్గింపు ఆఫర్‌నే పొందొచ్చు. అయితే ఈ కార్డులపై ఆఫర్లు పొందాలంటే మాత్రం కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ. 5 వేలు ఉండాలి.

    అమెజాన్‌లో ధమాకా ఆఫర్.. 55 అంగుళాల స్మార్ట్‌టీవీపై రూ.52 వేల తగ్గింపు!

    అంతేకాకుండా రెడ్‌మి 9ఐ స్పోర్ట్ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 7,460 మేర ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. అంటే ఈ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకుంటే కేవలం రూ. 539కే రెడ్‌మి 9ఐ స్పోర్ట్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే మీ ఫోన్ మోడల్ ప్రాతిపదికన మీకు లభించే ఎక్స్చేంజ్ విలువ మారుతుంది. దీన్ని బట్టి మీరు చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీ వద్ద ఉన్న పాత ఫోన్‌కు ఎంత ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తుందో తెలుసుకోండి. మంచి విలువ వస్తే.. పాతది ఇచ్చేసి కొత్తది కొనొచ్చు. లేదంటే ఇతర ఆఫర్లతో కొత్త ఫోన్ కొంటే సరిపోతుంది.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Amazon Great Indian Festival Sale, Flipkart, Flipkart Big Billion Days, Mobile offers, Smartphone

    ఉత్తమ కథలు