Home /News /technology /

DIWALI GIFTING BEST SPEAKER SYSTEMS SOUNDBARS PORTABLE SPEAKERS TO BUY FROM AMAZON SALE NS GH

Amazon Diwali Offers: ఆడియో పరికరాలపై అమెజాన్ లో భారీ తగ్గింపులు.. ఈ ఒక్క రోజే ఛాన్స్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ "ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్" పేరుతో దిపావళి సేల్​ నిర్వహిస్తోంది. ఈ సేల్​లో సౌండ్‌బార్లు, హోమ్ థియేటర్లు, పోర్టబుల్ స్పీకర్లు వంటి అనేక లేటెస్ట్​ ఆడియో ప్రొడక్ట్స్​పై అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది.

అంతా ఎదురుచూస్తోన్న దీపావళి (Diwali 2021) పండుగ సీజన్ వచ్చేసింది. ఈ సీజన్​లో కొత్త వస్తువులను కొనుగోలు చేసి తమ ప్రియమైన వారికి బహుమతులు (Gifts) ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ–కామర్స్ (E-Commerce)​ దిగ్గజం అమెజాన్ (Amazon) ​ "ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్" (Extra Happiness Days) పేరుతో దిపావళి సేల్​ (Diwali Sale) నిర్వహిస్తోంది. ఈ సేల్​లో సౌండ్‌బార్లు, హోమ్ థియేటర్లు, పోర్టబుల్ స్పీకర్లు వంటి అనేక లేటెస్ట్​ ఆడియో ప్రొడక్ట్స్​పై అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఇండస్​ ఇండ్ బ్యాంక్​కు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులు, అమెజాన్ పే (Amazon Pay) ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్​ను కూడా అందిస్తోంది. ఈ సేల్​ నేటితో (అక్టోబర్ 25) ముగియనుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా షాపింగ్​ చేసి.. మీ ప్రియమైన వారికి గిఫ్ట్​గా ఇచ్చేయండి మరి!

బోట్ ఆవంటే బార్ సౌండ్‌బార్(Boat Aavante Bar soundbar):
ప్రముఖ ఆడియో ఉత్పత్తుల సంస్థ బోట్ నుంచి విడుదలైన ఆవంటే బార్ సౌండ్‌బార్ అమెజాన్​లో ఆఫర్​పై లభిస్తోంది. దీని అసలు ధర ధర రూ. 9,990 వద్ద ఉండగా.. అమెజాన్‌లో కేవలం రూ. 3,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ సౌండ్​బార్​ 60 వాట్ RMS అవుట్‌పుట్‌ను అందిస్తుంది. బ్లూటూత్ 4.2, AUX, USB కనెక్టివిటీ సపోర్ట్​తో వస్తుంది.

బ్లాపంక్ట్ SBA01(Boat Aavante Bar soundbar):
బ్లాపంక్ట్ SBA01 సౌండ్‌బార్ అసలు ధర రూ. 9,990 వద్ద ఉండగా.. అమెజాన్​లో దీన్ని రూ .3,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ సౌండ్‌బార్ 100W అవుట్‌పుట్ ఇచ్చే డ్యుయల్ సబ్ వూఫర్‌లతో వస్తుంది. బ్లూపంక్ట్​ SBA01 HDMI ఆర్క్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

జూక్ రాకర్ స్టూడియో(Zook Rocker Studio):
జూక్ రాకర్ స్టూడియో కంపెనీ నుంచి విడుదలైన సౌండ్‌బార్ అసలు ధర రూ. 12,999 వద్ద ఉండగా.. అమెజాన్​లో దీన్ని కేవలం రూ. 4,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 160 వాట్ అవుట్‌పుట్‌తో వస్తుంది. దీనిలో బ్లూటూత్, ఆక్స్, యుఎస్‌బితో సహా మల్టిపుల్​ కనెక్టివిటీ ఆప్షన్లు, 4 ఇక్యూ మోడ్‌లను అందించింది. ఈ సౌండ్‌బార్ డీఎస్​పీ టెక్నాలజీతో వస్తుంది.

జూక్ థండర్ ప్లస్(Zook Thunder Plus):
జూక్ థండర్ ప్లస్ పార్టీ స్పీకర్ అసలు ధర రూ. 5,999 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 3,299 వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనిలో 4000mAh పవర్​ఫుల్​ బ్యాటరీని అందించింది. వైర్‌లెస్ మైక్‌తో వచ్చే ఈ స్పీకర్​ 40W సౌండ్ అవుట్​పుట్​ ఇస్తుంది. హెవీ బాస్ కోసం దీనిలో రెండు 6.5 అంగుళాల డ్రైవర్లను అందించింది.

ఫిలిప్స్​ ఆడియో SPA8140(Philips Audio SPA8140):
ఫిలిప్స్​ కంపెనీ నుంచి విడుదలైన ఆడియో SPA8140 స్పీకర్ సిస్టమ్ అసలు ధర రూ. 5,290 వద్ద ఉండగా.. దీన్ని రూ. 3,899 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్పీకర్ 50W అవుట్‌పుట్‌తో వస్తుంది. ఆకట్టుకునే డిజైన్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్​బీ ఇన్‌పుట్ వంటి ఫీచర్లను అందించింది. మరోవైపు, ఈ సౌండ్​ సిస్టమ్‌లో 18W సబ్ వూఫర్​ను కూడా చేర్చింది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Amazon, Diwali 2021, E-commerce

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు