Diwali best gift: దీపావళికి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా?.. బడ్జెట్​ ధరలోనే లభిస్తున్న వీటిపై ఓ లుక్కేయండి..

Diwali best gifts

Diwali best gift: పండుగ సమీపిస్తుండటంతో ప్రతి ఒక్కరు ఏ గిఫ్ట్​తో సర్​ప్రైజ్​ చేయాలని ప్లాన్​ చేసుకుంటున్నారు. అయితే, ఏ గిఫ్ట్ ఇవ్వాలనే దానిపై స్పష్టత లేక కొంతమంది సతమతమవుతుంటారు.

  • Share this:
దేశంలో దీపావళి (Diwali) పండుగ సీజన్​ ప్రారంభమైంది. దీపావళి పర్వదినాన ప్రియమైన వారికి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పండుగ సమీపిస్తుండటంతో ప్రతి ఒక్కరు ఏ గిఫ్ట్​తో సర్​ప్రైజ్​ చేయాలని ప్లాన్​ చేసుకుంటున్నారు. అయితే, ఏ గిఫ్ట్ ఇవ్వాలనే దానిపై స్పష్టత లేక కొంతమంది సతమతమవుతుంటారు. అటువంటి వారి కోసమే 10 బెస్ట్​ గిఫ్ట్​లను మీ ముందుకు తెస్తున్నాం. బడ్జెట్​ ధరలోనే వీటిని కొనుగోలు చేసి మీ ప్రియమైన వారిని సర్​ప్రైజ్​ చేయవచ్చు. మరోవైపు, దీపావళి పండగు సీజన్​ను దృష్టిలో పెట్టుకొని ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లు అనేక ఎలక్ట్రానిక్​ ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించాయి. అమెజాన్​ ఇప్పటికే దీపావళి సేల్​ ప్రారంభించగా.. ఫ్లిప్​కార్ట్​ రేపటి (అక్టోబర్ 2)8 నుండి పండుగ సేల్​ను ప్రారంభించనుంది. ఈ సేల్స్​లో బడ్జెట్​ ధరలోనే కొనగలిగే ఉత్తమ గిఫ్ట్​లను పరిశీలిద్దాం.

బడ్జెట్​ ధరలోనే10 ఉత్తమ దివాళి బహుమతులు

బోట్ బాస్ హెడ్స్ 220 ఇయర్‌ఫోన్లు

మీరు బడ్జెట్​ ధరలోనే వైర్డు ఇయర్‌ఫోన్​ సెట్ కోసం చూస్తున్నట్లయితే, బోట్​ బాస్​ హెడ్స్​ 220 ఇయర్‌ఫోన్‌ బెస్ట్​ ఆప్షన్​. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 499 ధర వద్ద అందుబాటులో ఉంది. ఇందులో మైక్రోఫోన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు కాల్స్​ కోసం కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ ఇయర్‌ఫోన్లు ఎరుపు, ఆకుపచ్చ, నలుపు సహా వివిధ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.

రియల్​మీ కోబుల్​ స్పీకర్

బడ్జెట్​ ధరలోనే మంచి స్పీకర్లను కొనాలనుకునే వారకిఇ రియల్​మీ కోబుల్​ స్పీకర్లు బెస్ట్ ఆప్షన్​. రియల్​మీ కోబుల్​ స్పీకర్ ప్రస్తుతం రూ. 1,799 వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్ దీపావళి 2021 సేల్​లో దీనిపై భారీ డిస్కౌంట్​ అందించనుంది.

వన్​ప్లస్​ బడ్స్ Z

ఈ దీపావళికి రూ. 3,000లోపు బెస్ట్ గిఫ్ట్​ కోసం చూస్తున్నారా?.. అయితే, వన్​ప్లస్​ బడ్స్​ జెడ్​ బెస్ట్​ ఆప్షన్​. వన్​ప్లస్​ బడ్స్​ జెడ్​ 20 గంటల బ్యాటరీ బ్యాకప్​ను అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్​ IP55 రేటింగ్​తో వస్తాయి. ఇవి స్వెట్​, వాటర్​ రెసిస్టన్స్​ను కలిగి ఉంటాయి.

అమెజాన్ ఎకో డాట్ (3వ జనరేషన్​)

ఈ దీపావళికి, మీరు మీ ప్రియమైన వ్యక్తికి అమెజాన్​ స్మార్ట్ స్పీకర్లను కొని గిఫ్ట్​గా ఇవ్వవచ్చు. అమెజాన్ ఎకో డాట్ (3వ జనరేషన్​) స్పీకర్ రూ. 2,149 ధర వద్ద లభిస్తుంది. మీ వాయిస్​ కమాండ్స్​తో మ్యూజిక్​ను కంట్రోల్​ చేయవచ్చు. లేదా అలెక్సా సహాయంతో లేటెస్ట్​ అప్​డేట్స్​ను పొందవచ్చు.

షియోమి ఎంఐ బ్యాండ్ 6

షిమోమి ఎంఐ బ్యాండ్ సిరీస్ బడ్జెట్ రేంజ్​లో మీకు అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తుంది. మీరు మీ ప్రియమైన వ్యక్తి కోసం ఎంఐ బ్యాండ్​ 6ని కొనుగోలు చేయవచ్చు. ఇది Mi.com, Amazon కేవలం రూ. 3,499 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ బ్యాండ్ 1.56 -అంగుళాల AMOLED డిస్​ప్లేతో వస్తుంది. దీనిలో SpO2 ట్రాకింగ్, హార్ట్​ రేట్ మానిటరింగ్​, ఒత్తిడి, నిద్ర పర్యవేక్షణ, 30 స్పోర్ట్స్ మోడ్‌లు, 5 ఏటీఎం వాటర్ -రెసిస్టెంట్ రేటింగ్ వంటి ఫీచర్లను అందించింది.

డీజేఐ ఓమ్​ 4 ఎస్​ఈ గింబాల్

ఈ దీపావళికి అమెజాన్ గింబాల్‌ను గిఫ్ట్​గా ఇవ్వడం బెస్ట్ ఆప్షన్​గా పరిగణించవచ్చు. మీరు బ్లాగర్ అయితే లేదా స్థిరమైన, షేక్-ఫ్రీ వీడియోను అప్‌లోడ్ చేయాలనుకుంటే, మీరు గింబాల్‌ని ఎంచుకోవచ్చు. ఇది కాంపాక్ట్ గ్రిప్ ట్రైపాడ్‌ని కలిగి ఉంటుంది. రిమోట్‌తో దీన్ని నియంత్రించవచ్చు. అమెజాన్ ఈ పరికరాన్ని రూ.8,599 వద్ద విక్రయిస్తోంది.

యాంకర్ సౌండ్‌కోర్ లిబర్టీ ఎయిర్ 2 ప్రో

యాంకర్ సౌండ్‌కోర్ లిబర్టీ ఎయిర్ 2 ప్రో ప్రస్తుతం మంచి ఆడియో యాక్సెసరీ సెట్‌గా పేరొందింది. మీరు దీన్ని మీ ప్రియమైన వారి కోసం కొనుగోలు చేసి గిఫ్ట్​గా ఇవ్వవచ్చు. ఇది యాక్టివ్​ నాయిస్ క్యాన్సిలేషన్​తో వస్తుంది. తద్వారా క్వాలిటీ సౌండ్‌ అవుట్​పుట్​ను అందిస్తుంది. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్​ రూ.9,951 ధర వద్ద లభిస్తాయి.

శామ్సంగ్​ గెలాక్సీ వాచ్​ యాక్టివ్​ 2

మీరు రూ. 15 వేలలోపు బెస్ట్​ ఫిట్‌నెస్ వాచ్​ను గిఫ్ట్​గా ఇవ్వాలనుకుంటే శామ్సంగ్​ గెలాక్సీ వాచ్​ యాక్టివ్​ 2 బెస్ట్ ఆప్షన్​గా చెప్పవచ్చు. వాస్తవానికి ఈ స్మార్ట్ వాచ్ రూ. 35,990 వద్ద విడుదలవ్వగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్​ కింద కేవలం రూ.11,990 ధర వద్ద లభిస్తుంది. ఇది AMOLED డిస్‌ప్లే, రౌండ్ డయల్‌తో వస్తుంది. 5ATM, IP68 వాటర్ -రెసిస్టెంట్ రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ డివైజ్​ మొత్తం ఐదు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇది కూడా చదవండి : Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.25 వేల లోపు 10 బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే

డైసన్ వీ8 వాక్యూమ్​ క్లీనర్​

దీపావళి పండుగ సేల్​లో భాగంగా డైసన్ తన ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీ ప్రియమైన వారికి డైసన్ V8 అబ్సొల్యూట్ ప్లస్​ వాక్యూమ్​ క్లీనర్​ని గిఫ్ట్​గా ఇవ్వవచ్చు. వాస్తవానికి డైసన్​ వీ8 భారత్​లో రూ. 39,990 వద్ద విడుదలైంది. ఈ వాక్యూమ్ క్లీనర్ 40 నిమిషాల రన్‌టైమ్‌ను అందిస్తుంది.
Published by:Sridhar Reddy
First published: