DISPOSABLE COFFEE CUPS RELEASE TRILLIONS OF MICROPLASTIC PARTICLES IN YOUR DRINK KNOW DETAILS HERE GH VB
Disposable Cups: డిస్పోజబుల్ కప్పులను వాడుతున్నారా..? అవి ఎంత డేంజరో చూడండి.. రిసెర్చ్ లో షాకింగ్ నిజాలు..
ప్రతీకాత్మక చిత్రం
ఒకసారి వినియోగించి పడేసే డిస్పోజబుల్ కప్పుల ద్వారా మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో బయటపడింది. వాటి నుంచి అందులో పోసిన డ్రింక్‌లోకి పెద్ద సంఖ్యలో మైక్రోస్కోపిక్ ప్లాస్టిక్ కణాలు విడుదలవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.
మట్టిలో కలిసిపోని ప్లాస్టిక్(Plastic) వస్తువులతో పర్యావరణానికి పెను ముప్పు పొంచి ఉంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. అయితే ఒకసారి వినియోగించి పడేసే డిస్పోజబుల్(Disposal) కప్పుల ద్వారా మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో బయటపడింది. వాటి నుంచి అందులో పోసిన డ్రింక్‌లోకి(Drinks) పెద్ద సంఖ్యలో మైక్రోస్కోపిక్(Microscopic) ప్లాస్టిక్ కణాలు విడుదలవుతున్నాయని పరిశోధకులు(Scientists) గుర్తించారు. అవి మానవుల శరీరంలోని కణాలలోకి ప్రవేశించే అంత చిన్నవిగా ఉన్నాయని చెప్పారు. వీటితో ఆరోగ్యానికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
డిస్పోజబుల్(Disposable) కంటైనర్లు, కప్పులు మానవాళికి శాపం. వాటి సన్నని ప్లాస్టిక్ లైనింగ్ ద్వారా అవి పూర్తిగా మట్టిలో కలిసిపోవడం దాదాపు అసాధ్యం. తాజా అధ్యయనం ప్రకారం.. డిస్పోజబుల్ కప్‌లోని డ్రింక్‌లో ట్రిలియన్ల కొద్దీ మైక్రోస్కోపిక్ ప్లాస్టిక్ పార్టికల్స్(Microscopic Plastic Particles) ఉంటాయని కనుగొన్నారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ నిపుణులు.. తక్కువ సాంద్రత కలిగిన పాలిథిన్‌తో పూసిన సింగిల్ యూజ్ హాట్ డ్రింక్స్ కప్పులను పరిశోధించారు. కప్పులో 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిని పోశారు. లీటరుకు ట్రిలియన్ల నానోపార్టికల్స్ విడుదలవడం గమనించారు. నీటిలోకి విడుదలైన పార్టికల్స్ గురించి తెలుసుకొనేందుకు.. పరిశోధకులు కప్పులోని నీటిని తీసుకొని దానిని చక్కటి పొగమంచులోకి పిచికారీ చేసి, పొడిగా ఉంచారు. అనంతరం మిగిలిన ద్రావణం నుంచి నానోపార్టికల్స్‌ను వేరు చేశారు.
పొగమంచు ఆరిపోయిన తర్వాత, దానిలోని నానోపార్టికల్స్‌ను పరిమాణం, ఛార్జ్ ద్వారా విభజించారు. అయితే అవి మానవశరీరంలోని కణాలలోకి ప్రవేశించి ప్రభావితం చేయగలిగేంత చిన్నవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట పరిమాణం ప్రకారం వాటిని పార్టికల్స్ కౌంటర్‌లోకి పంపారు. నానోపార్టికల్స్ ఒక రకమైన ఆల్కహాల్, త్వరగా చల్లబడే గుణం ఉన్న బ్యూటానాల్ వేడి ఆవిరికి బయటపడ్డాయి.
ఆల్కహాల్ ఘనీభవించినప్పుడు పార్టికల్స్ నానోమీటర్ల పరిమాణం నుండి మైక్రోమీటర్ల వరకు ఉబ్బుతాయి. అప్పుడు వాటిని సులువుగా గుర్తించే ఆస్కారం ఉంటుంది.
ఈ ప్రక్రియ ఆటోమేటిక్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా అమలు చేశారు. నానోపార్టికల్స్‌ను ఉపరితలంపై ఉంచడం ద్వారా, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీగా పిలువబడే సాంకేతికతతో పరిశీలించడం ద్వారా వాటి రసాయన కూర్పును గుర్తించే అవకాశం కూడా పరిశోధకులకు ఉంది. కొన్ని విశ్లేషణల తరువాత పరిశోధకులు నానోపార్టికల్ సగటు పరిమాణం 30 నానోమీటర్లు, 80 నానోమీటర్లు, కొన్ని 200 నానోమీటర్ల కంటే పెద్దవిగా ఉన్నట్లు కనుగొన్నారు.
దీనిపై పరిశోధకులు మాట్లాడుతూ..‘ప్రజలు అంటార్కిటికాలోని మంచును చూశారు. హిమనదీయ సరస్సుల దిగువన సుమారు 100 నానోమీటర్ల కంటే పెద్ద మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు. అంటే అవి సెల్‌లోకి ప్రవేశించి శారీరక సమస్యలను కలిగించేంత చిన్నవి కావు. మా అధ్యయనం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నానోపార్టికల్స్ నిజంగా చిన్నవి. పెద్ద విషయం ఎందుకంటే అవి సెల్ లోపలికి ప్రవేశించి, దాని పనితీరుకు అంతరాయం కలిగించవచ్చు.’ అని వివరించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.