Disney+ Hotstar: హాట్‌స్టార్ వాడుతున్నారా? కొత్త ఛార్జీలు ఇవే

Disney+ Hotstar: హాట్‌స్టార్ వాడుతున్నారా? కొత్త ఛార్జీలు ఇవే

Disney+ Hotstar | మీరు హాట్‌స్టార్ వాడుతున్నారా? ఏప్రిల్ 3న హాట్‌స్టార్ మారిపోనుంది. డిస్నీ+హాట్‌స్టార్ పేరుతో కొత్త సేవలు ప్రారంభం కానున్నాయి.

  • Share this:
    భారతదేశంలో ఏప్రిల్ 3న డిస్నీ ప్లస్ లాంఛ్ కానుంది. హాట్‌స్టార్‌తో కలిసి ఇండియాలో అడుగుపెడుతోంది డిస్నీ. శుక్రవారం నాడు 'డిస్నీ+హాట్‌స్టార్' ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా లాంఛ్ కానుంది. అంటే ఇప్పుడు ఉన్న హాట్‌స్టార్ రీబ్రాండెడ్‌ వర్షన్ 'డిస్నీ+హాట్‌స్టార్' పేరుతో కనిపించనుంది. 'డిస్నీ+హాట్‌స్టార్' తెలుగు, తమిళ్‌ సహా 8 భారతీయ భాషల్లో కంటెంట్‌ని అందించనుంది. ఇందులో మార్వెల్ సినిమాటిక్ మూవీస్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్నవారు ఆటోమెటిక్‌గా కొత్త సబ్‌స్క్రిప్షన్‌కు మారిపోతారు. రెన్యువల్ సమయంలో కొత్త ఛార్జీల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.

    భారతదేశంలో 'డిస్నీ+హాట్‌స్టార్' రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అందిస్తోంది. డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ ధర ఏడాదికి రూ.399. ఇందులో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌తో పాటు ది అవెంజర్స్, ఐరన్ మ్యాన్ లాంటి సూపర్‌హీరో సినిమాలు చూడొచ్చు. దీంతో పాటు ది లయన్ కింగ్, ఫ్రోజెన్ 2, అలాద్దీన్, టాయ్ స్టోరీ 4 లాంటివి అందుబాటులో ఉంటాయి. హాట్‌స్టార్ ఒరిజినల్స్, లైవ్ స్పోర్ట్స్ మ్యాచెస్, బాలీవుడ్ మూవీస్, రీజనల్ కంటెంట్ ఉంటుంది. గతంలో ఈ ప్యాకేజీ ధర రూ.365 మాత్రమే.


    వీఐపీతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం కూడా ఉంది. ఈ ప్లాన్ ధర రూ.1,499. ఇందులో వీఐపీ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. దాంతో పాటు ఇంగ్లీష్ కంటెంట్ చూడొచ్చు. 29 డిస్నీ+ ఒరిజినల్స్ చూడొచ్చు. హెచ్‌బీఓ, ఫాక్స్, షోటైమ్ లాంటి అమెరికన్ షోస్ కూడా యాక్సెస్ చేయొచ్చు. గతంలో హాట్‌స్టార్ ప్రీమియం ధర రూ.999 మాత్రమే.

    ఇక ఫ్రీ యూజర్లు బీసీసీఐ క్రికెట్ సిరీస్, ఐపీఎల్, ప్రీమియర్ లీగ్, ఐఎస్ఎల్, పీకేఎల్ మ్యాచ్ హైలైట్స్, ఇండివిజువల్ పర్ఫామెన్స్, మ్యాచ్ అనాలిసిస్ చూడొచ్చు. కొన్ని డైలీ టీవీ షోస్, మూవీస్, ఆన్ డిమాండ్ న్యూస్ కూడా ఎనిమిది భాషల్లో చూడొచ్చు.

    ఇవి కూడా చదవండి:

    EPF Withdrawal: మీ పీఎఫ్ డబ్బులు 3 రోజుల్లో మీ అకౌంట్‌లోకి... విత్‌డ్రా చేయండి ఇలా

    Driving Licence: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

    Banks Merger: బ్యాంకుల విలీనం నేటి నుంచే అమలులోకి... మిగిలేవి ఈ బ్యాంకులే
    Published by:Santhosh Kumar S
    First published: