హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Disney+ Hotstar Down: డిస్నీ+ హాట్ స్టార్ యూజర్లకు షాక్.. సాంకేతిక సమస్యలతో డౌన్.. వివరాలివే

Disney+ Hotstar Down: డిస్నీ+ హాట్ స్టార్ యూజర్లకు షాక్.. సాంకేతిక సమస్యలతో డౌన్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డిస్నీ+ హాట్ స్టార్ (Disney+ Hotstar) సేవలు ఇండియాలో డౌన్ అయ్యాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమకు యాప్ ఓపెన్ కావడం లేదని చాలా మంది యూజర్లు సోషల్ మీడియాలో (Social Media) పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

డిస్నీ+ హాట్ స్టార్ (Disney+ Hotstar) సేవలు ఇండియాలో డౌన్ అయ్యాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమకు యాప్ ఓపెన్ కావడం లేదని చాలా మంది యూజర్లు సోషల్ మీడియాలో (Social Media) పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. Downdetector.in సైతం ఈ విషయాన్ని నివేదించింది. వేలాదిగా యూజర్లు సైతం ఎర్రర్ స్క్రీన్ షాట్లను ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. డిస్నీ+ హాట్‌స్టార్ ఈ విషయంపై స్పందించింది. యాప్‌లు మరియు వెబ్‌లో సేవలో ఊహించని సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు తెలిపింది. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి తమ టెక్ బృందం పని చేస్తున్నట్లు వెల్లడించింది. భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ సందర్భంగా OTT మరియు లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ సేవలు నిలిచిపోయాయి.

Recharge Plan: రూ.151కే డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్.. ఇంకా 8 జీబీ డేటా!

ఎక్కువ మంది యూజర్లు ఒకే సారి లాగిన్ కావడంతోనే ఈ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. సేవలు డౌన్ కావడం పట్ల వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ , జైపూర్, లక్నో, కోల్ కత్తా, నాగ్ పూర్, హైదరాబాద్ , ముంబై తదితర ప్రాంతాలకు చెందిన యూజర్లు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది. తమకు 45 నిమిషాల పాటు ఈ సమస్య తలెత్తిందని కొందరు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

First published:

Tags: Disney+ Hotstar, Ott

ఉత్తమ కథలు