OTT Platforms| ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఓటీటీ (ఓవర్ ద టాప్) ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే చాలా డబ్బులు (Money) పెట్టుకోవాలి. అలాగే అన్నింటి సబ్స్క్రిప్షన్ వివరాలను గుర్తు పెట్టుకోవడం కూడా కష్టమే. అందుకే ఓటీటీ (OTT) అగ్రిగేషన్ సర్వీసులు పొందొచ్చు. కస్టమర్లు వీటి ద్వారా ప్రయోజనం పొందొచ్చు. దేశంలో చాలా సంస్థలు ఓటీటీ అగ్రిగేషన్ సర్వీసులను అందిస్తున్నాయి. వీటిల్లో టాటా ప్లే కూడా ఒకటి.
టాటా ప్లే బింగ్ అనేది టాటా ప్లే కంపెనీకి చెందిన ఓటీటీ అగ్రిగేషన్ సర్వీస్. టాటా ప్లే బింగ్ యూజర్లు తక్కువ ధరకే పలు రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. టాటా ప్లే బింగ్ అనది పలు రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కలిగి ఉంది. రూ. 59, రూ. 125, రూ. 175, రూ. 299, రూ. 999 వంటి ప్లాన్స్ ఉన్నాయి. వీటన్నింటిలోకెల్లా రూ. 175 ప్లాన్‌కు యూజర్ల నుంచి ఆదరణ బాగుంది. ఈ ప్లాన్ కింద తక్కువ ధరలోనే పలు రకాల ప్లాట్‌ఫామ్స్ యాక్సెస్‌ను సొంతం చేసుకోవచ్చు.
అదిరే ఆఫర్.. వాషింగ్ మెషీన్‌పై 50 శాతం డిస్కౌంట్, నెలకు రూ.600 చెల్లిస్తే చాలు!
రూ. 175 ప్లాన్‌లో ఎపిక్ ఆన్, ఎంఎక్స్ ప్లేయర్, డోకుబే, వూట్ కిడ్స్, చౌపల్, డిస్నీ హాట్‌స్టార్, ప్లానెట్ మరాఠీ, హోయ్ చోయ్, వూట్ సెలెక్ట్, జీ5, ఈరోస్ నౌ, షెమారూమీ, హంగామా, నామఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫామ్స్ యాక్సెస్ లభిస్తుంది. ఈ 14 ప్లాట్‌ఫామ్స్‌కు నెలకు రూ. 175 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు టాటా ప్లే సబ్‌స్క్రైబర్ కాకున్నా కూడా మీరు ఈ ప్లాన్ పొందొచ్చు. టాటా ప్లే బింగ్ ప్లస్ సెటప్ బాక్స్ లేకున్నా కూడా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు.
వారెవ్వా.. రూ.43 వేల డిస్కౌంట్, రూ.9,500కే 43 ఇంచుల స్మార్ట్ టీవీ కొనేయండి!
టాటా ప్లే బింగ్ మొబైల్ యాప్ ఉంది. ఈ యాప్‌ను మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ యూజర్లకు కూడా ఈ యాప్ అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకొని రీచార్జ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయొచ్చు.
అంతేకాకుండా ఒకవేళ మీరు ప్రతి నెలా రీచార్జ్ చేసుకోవడం ఇష్టం లేదనుకుంటే.. మీరు రూ. 999 ఏడాది ప్లాన్ ఎంచుకోవచ్చు. సంవత్సరం అంతా రీచార్జ్‌తో పని ఉండదు. ఈ ప్లాన్ ఎంచుకుంటే 11 ప్లాట్‌ఫామ్స్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మీరు మొబైల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వీక్షించొచ్చు. అలాగే వెబ్ ఆప్షన్లో కూడా ప్లాట్‌ఫామ్స్ కంటెంట్‌ను చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disney plus hotstar, Ott, Ott platform, Tata Play