యూజర్స్‌ని ఆకర్షించేందుకు రోజుకో కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి డీటీహెచ్ ఆపరేటర్స్. సరికొత్త వ్యాల్యూ ఆఫర్స్‌ని ప్రవేశపెడుతూ తమ పరిధిని విస్తరిపంచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డీటీహెచ్ ఆపరేటర్ల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. టాటా స్కై, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, డీ2హెచ్, సన్‌డైరెక్ట్ వంటి కంపెనీలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఈఈ సమయంలోనే డిష్ టీవీ డీ2హెచ్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 3 నెలల సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ1,292 నుంచి ప్రారంభమౌతోంది.
12 నెలల సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే స్టాండర్డ్ డెఫినేషన్(ఎస్డీ) సెట్ టాప్స్ బాక్స్, ఇన్స్టాలేషన్ ఉచితం. ఈ ఆఫర్లో ఇండియా క్రికెట్ కూడా ఉంటుంది. ఇది యాడ్ ఆన్ సర్వీస్ రూపంలో పొందొచ్చు.
టైర్ 3, టైర్ 4 మార్కెట్లలో చాలామంది ఎంటర్టైన్మెంట్ని కోల్పోతున్నారు. వారి కోసమే ఆఫర్ తీసుకొచ్చినట్లు డిష్ టీవీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో అనిల్ దుయా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: DTH