హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioFiber-discovery+: జియో ఫైబర్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వివరాలివే..

JioFiber-discovery+: జియో ఫైబర్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డిస్కవరీ + ఇప్పుడు జియో ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. డిస్కవరీ+ కు చెందిన సైన్స్, అడ్వంచర్, ఫుడ్, లైఫ్ స్టైల్ మరియు యానిమేషన్ కు సంబంధించిన 40 రకాల కాంటెంట్ జీయో ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

భారత దేశం యొక్క మొట్టమొదటి లీడింగ్ రియల్ టైం ఎంటర్టైన్మెంట్ మరియు లెర్నింగ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అయిన డిస్కవరీ+ యాప్ ప్రారంభం నుంచి మంచి డిమాండ్ ను కలిగి ఉంది. డిస్కవరీ + ఇప్పుడు జియో ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. డిస్కవరీ+ కు చెందిన సైన్స్, అడ్వంచర్, ఫుడ్, లైఫ్ స్టైల్ మరియు యానిమేషన్ కు సంబంధించిన 40 రకాల కంటెంట్ జీయో ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. డిస్కవరీ+ ప్రారంభం నుంచి ప్రేక్షకుల కోసం అత్యధిక నాణ్యమైన నాన్-ఫిక్షన్ కంటెంట్‌ను తీసుకురావడానికి మరియు సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. ఈ స్ట్రీమింగ్ యాప్ 60 వేర్వేరు ఉప-శైలుల్లో మరియు హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు బెంగాలీతో సహా పలు భాషలలో వందలాది మార్క్యూ షోల యొక్క అద్భుతమైన లైనప్‌తో జియోఫైబర్‌లో ప్రారంభమవుతుంది.

ఈ భాగస్వామ్యం జియోఫైబర్ వినియోగదారులకు డిస్కవరీ నెట్‌వర్క్ యొక్క ప్రీమియం షోలు మరియు సూపర్ స్టార్స్ రజనీకాంత్ మరియు అక్షయ్ కుమార్, మ్యాన్ వర్సెస్ వైల్డ్, గోల్డ్ రష్, ఎక్స్‌పెడిషన్ అన్ నౌన్, 90 డే ఫైనాన్స్, హౌ ది యూనివర్స్ వర్క్స్ వంటి ప్రత్యేకమైన వాటిని యాక్సెస్ చేయడానికి అవకాశం ఇస్తుంది. వీటితో పాటు బ్రేకింగ్ పాయింట్, రివీల్డ్: రాష్ట్రపతి భవర్, హిమాలయన్ సునామీ, ఇండియా 2050 వంటి ప్రముఖ భారతీయ సిరీస్ లు సైతం జియో ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. దానికి తోడు, జియోఫైబర్ వినియోగదారులు వందే భారత్ ఫ్లైట్ IX1344: హోప్ టు సర్వైవల్, సీక్రెట్స్ ఆఫ్ సినౌలి, మిషన్ ఫ్రంట్‌లైన్, సూపర్ సోల్ మరియు లడఖ్ వారియర్ తదితర సిరీస్ లను కూడా యాక్సెస్ చేయవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం

రూ.999 మరియు అంతకన్నా ఎక్కవ ప్లాన్ కలిగి ఉన్న జియో ఫైబర్ యొక్క పాత మరియు నూతన యూజర్లు ఈ కంటెంట్ ను జియో యాప్ స్టోర్ ద్వారా డిస్కవరీ+ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని పొందొచ్చు. ఈ సందర్భంగా APAC-Discovery డైరెక్ట్ టూ కస్టమర్ హెడ్ ఇసాక్ జాన్ మాట్లాడుతూ.. డిస్కవరీ+ ప్రతీ భారతీయ గృహానికి ఒక ఉత్పత్తి అని మేము నమ్ముతున్నామన్నారు. జియోతో తమ భాగస్వామ్యం ద్వారా డిస్కవరీ+ దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుతుందన్నారు.

డిస్కవరీ+ యాప్ గురించి..

డిస్కవరీ+ యాప్ రియల్ టైం ఎంటరైన్మెంట్ మరియు లెర్నింగ్ అనుభవాన్ని అందించడానికి తీసుకువచ్చిన ఓ ప్రత్యేకమైన యాప్. రూ. 299తో వార్షిక సభ్యత్యం అందిస్తుంది. ఈ యాప్ భారతీయుల కోసం రూపొందించిన ప్రత్యేకమైన యాప్. డిస్కవరీ+ లో వేల గంటల ప్రత్యేకమైన కంటెంట్ అందుబాటులో ఉంటుంది. సైన్స్, అడ్వంచర్, ఫుడ్, లైఫ్ స్టైల్ తో పాటు మరో 40 విభాగాలకు చెందిన కాంటెంట్ ఇందులో ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, తమిళం, తెలుగు, మళయాలం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది. డిస్కవరీ లైబ్రరీలోని ఆల్ టైం ఫేవరెట్స్ ను మనం పొందొచ్చు,

First published:

Tags: Jio fiber

ఉత్తమ కథలు