#Tips: సెల్ఫీలు అందంగా రావట్లేదని బాధపడుతున్నారా? అయితే ఇది చదవండి..

సెల్ఫీ దిగని రోజుంటుందా? యూత్ అయితే మరీ ఎక్కువగా ఈ అలవాటుకి అడిక్ట్ పోయారు. అయితే, సెల్ఫీల్లో అందంగా రావట్లేదని చాలామంది బాధపడుతుంటారు. వారికోసమే ఈ కథనం..

Amala Ravula | news18-telugu
Updated: January 19, 2019, 2:20 PM IST
#Tips: సెల్ఫీలు అందంగా రావట్లేదని బాధపడుతున్నారా? అయితే ఇది చదవండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: January 19, 2019, 2:20 PM IST
ఫంక్షన్ అయినా సెల్ఫీనే, పదిమందిని కలిసినా సెల్ఫినే.. ఊరెళ్తుంటే సెల్ఫీ, అక్కడ్నుంచీ వస్తుంటే సెల్ఫీ, ట్రైయిన్, బస్సు, కారు, బైక్, నిల్చొని, అప్పుడే లేచి ఇలా కాదేదు సెల్ఫీకి అనర్హమన్నట్లు అయింది పరిస్థితి. యువత నిద్ర లేచింది మొదలు పడుకునేవరకూ సెల్ఫీలతోనే సమయం గడుపుతున్నారు. అయితే, కేవలం అక్కడివరకే అయితే బాగుండు.. కానీ, సెల్ఫీల్లో తాము అందంగా లేము అంటూ తెగ బాధపడుతున్నారు.. అలాంటివారు ఏం బాధపడాల్సిన అవసరం లేదు.
సాధారణంగా పాస్ పోర్ట్ ఫొటోలు, సాధారణ ఫొటోల వంటివి సుమారు 5 అడుగుల దూరం నుంచి తీసుకుంటాం. కానీ, సెల్ఫీలు మాత్రం పట్టుమని 12 అంగుళాల మాత్రమే దూరంగా తీస్తాం. ఈ యాంగిల్‌లో మన ఫేస్ సరిగా కనిపించదు, ముక్కు పెద్దగా కనిపిస్తుంది. ఒక్కో సారి ఒక్కోలా అనిపిస్తుంది. కాబట్టి, వీటినిచూసి బాధపడాల్సిన అవసరం లేదు.

అంతేకానీ, కొంతమంది సెల్ఫీల్లో అందంగా పడట్లేదని, 42శాతం మంది ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకోవాలని పరుగులు పెడుతున్నారట.. ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. సెల్ఫీలు కేవలం సరదా మాత్రమేనని, అవి దిగడం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు.. దిగిన తర్వాత బాలేమని బాధపడొద్దంటూ సలహాలిస్తున్నారు.
First published: January 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...