Home /News /technology /

DIMMATIRIGI XIAOMI FOLDABLE PHONES PRICE FEATURES SUPER COMPETITION TO THAT COMPANY UMG GH

Xiaomi Mix Fold 2: దిమ్మతిరిగే షియోమి ఫోల్డబుల్ ఫోన్లు.. ధర, ఫీచర్స్ సూపర్.. ఆ కంపెనీకు పోటీ ?

 దిమ్మతిరిగే షియోమి ఫోల్డబుల్ ఫోన్లు.. ధర, ఫీచర్స్ సూపర్.. ఆ కంపెనీకు పోటీ ?

దిమ్మతిరిగే షియోమి ఫోల్డబుల్ ఫోన్లు.. ధర, ఫీచర్స్ సూపర్.. ఆ కంపెనీకు పోటీ ?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల(Smartphone)తయారీ కంపెనీ షియోమీ/ షావోమీ (Xiaomi) అద్భుతమైన ఫోన్స్ తీసుకొస్తూ మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన సరికొత్త ఫోల్డబుల్ షావోమీ మిక్స్ ఫోల్డ్ 2(Xiaomi Mix Fold 2)ని చైనాలో లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రముఖ స్మార్ట్‌ఫోన్(Smartphone) తయారీ కంపెనీ షియోమీ/ షావోమీ (Xiaomi) అద్భుతమైన ఫోన్స్ తీసుకొస్తూ మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన సరికొత్త ఫోల్డబుల్ షావోమీ మిక్స్ ఫోల్డ్ 2(Xiaomi Mix Fold 2)ని చైనా(China)లో లాంచ్ చేసింది. 2 రోజుల క్రితం గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 పేరుతో రెండు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్(Samsung) రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా రిలీజ్ అయిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4కి Xiaomi Mix Fold 2 బలమైన పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే Mix Fold 2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కళ్లు చెదిరే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

Xiaomi మిక్స్ ఫోల్డ్ 2 ధరలు
Xiaomi Mix Fold 2 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధరను 8,999 చైనీస్ యువాన్లు (దాదాపు రూ. 1,06,400)గా కంపెనీ నిర్ణయించింది. 12GB+512GB స్టోరేజ్ వేరియంట్‌ను 9,999 యువాన్లు (దాదాపు రూ.1,18,300), 12GB RAM + 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన టాప్-స్పెక్ వేరియంట్‌ను 11,999 యువాన్లు (దాదాపు రూ. 1,42,000)తో లాంచ్ చేసింది. ఈ మొబైల్ బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే లాంచ్ అయిన ఈ ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో అసలు విడుదల అవుతుందా? అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ రిలీజ్ అయితే అది ఎప్పుడు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.

మిక్స్ ఫోల్డ్ 2 స్పెసిఫికేషన్లు
Xiaomi Mix Fold 2ని ఫోల్డ్ చేసినప్పుడు కనిపించే బయట డిస్‌ప్లే (Outer Display)గా 6.56-అంగుళాల శాంసంగ్ E5 AMOLED డిస్‌ప్లేని అందించారు. ప్రైమరీ ఇన్నర్ డిస్‌ప్లేగా 8-అంగుళాల 2K+ Eco2 డిస్‌ప్లేను ఆఫర్ చేశారు. ఈ రెండు డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేయడం విశేషం. క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 4nm ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో గరిష్టంగా 12GB RAM, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4,500mAh బ్యాటరీ అందించారు. ఈ ఫోన్ 100% ఛార్జ్ చేయడానికి 40 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


 కెమెరాల విషయానికొస్తే.. Xiaomi Mix Fold 2 బ్యాక్‌సైడ్‌లో లైకా-బ్రాండ్‌కు చెందిన మూడు కెమెరాలు ఇచ్చారు. వాటిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2X ఆప్టికల్ జూమ్‌తో కూడిన టెలిఫోటో లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీల కోసం HDR సపోర్టుతో 20 మెగా పిక్సల్ కెమెరా ఉంటుంది. ఇందులో అందించిన స్టీరియో స్పీకర్లతో సౌండ్ చాలా లౌడ్‌గా వినిపిస్తుంది.



గెలాక్సీ Z ఫోల్డ్ 4కి పోటీగా మిక్స్ ఫోల్డ్ 2
Xiaomi Mix Fold 2 స్పెసిఫికేషన్లు చూస్తుంటే శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 4కి గట్టిపోటీ ఇస్తుందని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు చైనా మార్కెట్‌లో మాత్రమే ఈ పోటీ ఉంటుంది. గెలాక్సీ Z ఫోల్డ్ సిరీస్ లాగా Xiaomi మిక్స్ ఫోల్డ్ 2ని గ్లోబల్ రిలీజ్ చేస్తే అది Samsung Galaxy Z Fold 4కి ప్రపంచ మార్కెట్‌లలో బలమైన పోటీని ఇస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: China, Samsung, Tech news, Xiaomi

తదుపరి వార్తలు